ప్రజాకవి కాళోజీ బయోపిక్ ట్రైలర్ విడుదల
సినీ ప్రముఖులు,రచయితల సమక్షంలో గ్రాండ్ గా విడుదలైన “ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!. టీజర్, ట్రైలర్.
జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య’, ప్రణయ వీధుల్లో’, వంటి ప్రయోజనాత్మక ‘ సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర టీజర్, ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి, రంగారెడ్డి ఇన్కంటాక్స్ చీఫ్ కమీషనర్ నరసింహప్ప, తెలంగాణ సాంసృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, దర్శకులు వి.యన్ ఆదిత్య, దర్శకులు వేణు ఉడుగుల, రిజిస్ట్రేషన్స్ ఐ.జీ వేముల శ్రీనివాస్, రచయిత్రి అమృత లత లతో పాటు రెండు తెలుగు రాస్ట్రాల నుండి వచ్చిన రచయితలు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రజాకవి కాళోజీకి జ్యోతి ప్రజ్వాలన చేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ..బ్రిటీష్ డైరెక్టర్ రిచర్డ్ ఆటిన్ బరో మహాత్మాగాంధీ బయోపిక్ తీసి తన జన్మ ధన్యం చేసుకొన్నాడు. అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన కృష్ణ గారు నభూతో న భవిష్యత్ అని తన జన్మ ధన్యం చేసుకొన్నాడు. ప్రజాకవి అయిన కాళోజీ నారాయణ అనే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు ఒక శక్తి.తను తెలంగాణ కొరకు ఉద్యమాలే ఊపిరిగా బతికాడు. పేద ప్రజలకొరకు అహర్నిశలు కష్టపడుతూ వారికి అండగా నిలబడిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి సినిమా తియ్యాలి అంటే గట్స్ కావాలి.అలాంటి వ్యక్తి పై కాళోజీ బయోపిక్ పేరుతో సినిమా తీసిన ప్రభాకర్ జైనీ దంపతులు కూడా వారి జన్మ ధన్యం అయిందనుకుంటున్నాను .ప్రపంచంలో ఎం జరిగినా ఆది తన బాధ గా భావించే శ్రీ శ్రీ గారు కాళోజీ గారు రచించిన నా గొడవ నవల చూసి ఇది కాళోజీ గొడవ కాదు విశ్వ జగత్ గొడవ అన్నారంటే కాళోజీ గారు ఎంత గొప్ప వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు పొట్టి, ఛత్రపతి శివాజీ పొట్టి, అయితే కృష్ణ గారు ఆ సినిమాలో నటించి అల్లూరి సీతారామరాజు అంటే ఇలానే ఉంటాడనేలా నటించి అందరినీ మెప్పించాడు. ఇప్పుడు కాళోజీ నారాయణరావు పాత్రధారి పొట్టి అయినా సరే ఇలాగే ఉంటాడు అనేలా చాలా బాగా నటించిన మూల విరాట్ జన్మ కూడా ధన్యమైంది అని చెప్పవచ్చు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ..ప్రజాకవి కాళోజీ’ సినిమా ఒక అసాధ్యమైన టాస్క్. అటువంటి సినిమా తీయలేరని అందరూ నాతోనే అన్నారు. ఏదో ఉత్సాహంతో మొదలు పెట్టారు కానీ, సినిమా పూర్తి కాదని చాలా మంది అన్నారు. వేరే వాళ్ళు అనడం కాదు. సినిమా 2020 జనవరి, 29 న మొదలు పెట్టి వరంగల్లులో కాళోజీ గారి ఇంట్లో మొదటి షెడ్యూలు షూటింగు చేస్తున్నప్పుడే, ఈ సినిమాను నేను పూర్తి చేయలేమోనని నాకే అనిపించింది. అయితే పెద్ద నిర్మాతలకు మాత్రం ఇవన్నీ పీ నట్స్ తో సమానం. కానీ చిన్న నిర్మాతలకు మాత్రం ప్రతీరోజు ఒక జీవన్మరణ సమస్యే. కమర్షియల్ సినిమాలకు, బాగా తీస్తే, డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ సినిమా భవిష్యత్తు ఏమౌతుందో తెలియదు. ఈ సినిమా కోసం మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అత్యవసరం అయితేనే ఖర్చు పెడతాము. అదే సమయంలో సినిమా క్వాలిటీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టాము. ఈ సినిమాకోసం ఎన్నో కష్టాలను , బాధలను నాతో పాటు నా భార్య, నిర్మాత శ్రీమతి విజయలక్ష్మీ జైని అనుభవించింది. ఆమె నా కన్నా మానసికంగా దృఢసంకల్పం కలది. నన్ను తానే ప్రోత్సహించేది.
ఈ సినిమాలో రెండు పాటలకు సింగిల్ కార్డు లిరిక్ రైటర్ గా అవకాశం ఇవ్వమని బిక్కి కృష్ణ అడిగినప్పుడు నేను ముందు సంశయించాను. ఇది తెలంగాణా యాసను హైలైట్ చేయవలసిన సినిమా. కాళోజీకి పలుకుబడుల భాష అంటే ఇష్టమని నాకు తెలుసు. అందుకే, వేరే ఒక పాటల రచయితకు ప్రామీస్ చేసినా ఆయనకు సర్ది చెప్పి, బిక్కి కృష్ణ గారికే నాలుగు పాటలు రాయడానికి అనుమతించాను. పాటలు బాగా వచ్చినా, యాస సమస్యలు వచ్చాయి. వాటిని నేను సరిదిద్దిన తర్వాత,సినిమా అత్యద్భుతంగా వచ్చింది. పాటలు కూడా కాళోజీ ఔన్నత్యాన్ని పెంచే విధంగా, ప్రతీ తెలుగు వాడు గర్వించే విధంగా, ‘ఇది రా మా భాష గొప్పతనం’ అని చెప్పుకుంటూ తల ఎగరవేసేంత గొప్పగా వచ్చాయి.మనం ఫేస్బుక్కులో, సోషల్ మీడియాలో, పేపర్లలో మంచి సినిమాలు రావడం లేదనీ, రొడ్డకొట్టుడు సినిమాలే మనకు గతి అని అనడం చూస్తుంటాము,. అలాగే ఈ మధ్య తెలంగాణా మరియు ఇతర గ్రామీణ నేపథ్యంలో తీస్తున్న సినిమాలు మీరు చూసే ఉంటారు. సినిమా మొదటి సీను నుండి చివరి వరకు తాగడం, తినడం, ఒక లక్ష్యం అంటూ లేకుండా జులాయిగా తిరిగే హీరోహీరోయిన్లు, ఒక బేవార్సు స్నేహ బృందం, బూతుల ప్రవాహం మీరు గమనించే ఉంటారు.కానీ, మన సమాజం అలా లేదు. తెలుగు సమాజంలో నుండి ఐఏయస్, ఐపీయస్, గ్రూప్ వన్, టూ, త్రీ అధికారులు, దేశం కోసం ప్రాణాలర్పించే సైనికాధికారులు, శాస్తవ్రేత్తలు, ఐఐటీల్లో ప్రభంజనం సృష్టిస్తున్న ప్రతిభావంతులైన యువతీయువకులు ఉన్న, వైబ్రెంట్ సమాజం మనది. దాన్ని ఎవరు చూపించాలి? సినిమా అంతా తాగుడు, తినుడు, దొంగ తనాలు, ఆ వెధవలకు పడిపోయే బుర్రలేని అమ్మాయిలను చూపించి చివరి నిముషంలో ఒక నీతి వాక్యం చెప్పిస్తే సరిపోతుందా?
అందుకే, ఈ సినిమాలో సమాజం కోసం ప్రాణాలర్పించే, ఒక యువ జంటను చూపించాము. ఒక రిక్షా వాడు కూడా కవిత్వం చెప్పగలడని చూపించాము. ఒక పునరుజ్జీవనం చెందుతున్న, ఒక సజీవ చైతన్యంతో తొణికిసలాడుతున్న సమాజాన్ని చూపించాము. అహంకారాన్ని చీల్చి చెండాడే సన్నివేశాలను చూపించాము.మేము తీసిన ఈ సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.
పాటల రచయిత బిక్కి కృష్ణ మాట్లాడుతూ..ప్రజాకవి కాళోజీ’ వర్ధంతి వేడుకలు ఈ రోజు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.దర్శకుడు ప్రభాకర్ జైనీ ఈ సినిమాను చాలా కష్టపడి ఇష్టపడి చేశారు.. ఉద్యమాలకు ఊపిరి వదిలినటువంటి గొప్ప కవి కాళోజి పై బయోపిక్ తీయడం గొప్ప విషయం. ఆయనకు మా కృతజ్ఞతలు అన్నారు.
ఇన్కంటాక్స్ చీఫ్ కమీషనర్ హనుమంతప్ప మాట్లాడుతూ.. పీడిత, పేద ప్రజల పాలిట పెన్నిధి అయిన ప్రజాకవి కాళోజీ’ జీవితానికి వివరిస్తూ మంచి సందేశాత్మకత చిత్రాన్ని తీసిన ప్రభాకర్ జైనీ దంపతులకు కృతజ్ఞతలు.
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే విజయం సాధించాయి. అయితే తెలుగు వారికి సంబందించి కవి అయిన ప్రజాకవి కాళోజీ’ జీవిత చరిత్ర గురించి సినిమాగా తియ్యడం ఇదే మొదటి సినిమా అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి బయోపిక్ లు తియ్యడమంటే దుస్సాహసమే అనీ చెప్పవచ్చు.కానీ ఒకడుగు ముందుకు వేసి కాళోజీ గారి కథను తెలుగు ప్రేక్షకుల ముందుకు దృశ్య నివాళిని అర్పించిన ప్రభాకర్ జైనీ దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రేక్షకులందరూ ఇలాంటి మంచి సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నిర్మాత రామసత్య నారాయణ మాట్లాడుతూ ..ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు.ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు ఎంతో ఇన్స్పిరేషన్ ను కలిగిస్తాయి.కాబట్టి ఇంతమంచి సినిమా తీసిన ప్రభాకర్ జైనీ దంపతులకు సినిమా విడుదల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలుపుతున్నానని అన్నారు.
దర్శకులు వి.యన్ ఆదిత్య మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ కారుడు ప్రజా కవి కాళోజీ పై చిత్రీకరించిన టీజర్, ట్రైలర్, పాటలు బాగున్నాయి.ఇలాంటి వీరుల కథను సెలెక్ట్ చేసుకోని తీసిన శ్రీమతి విజయలక్ష్మీ జైనీ కు, దర్శకుడు ప్రభాకర్ జైనీ కు,మంచి పాటలు అందించిన బిక్కి కృష్ణ కు టోటల్ టీం కు అల్ ద బెస్ట్. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..గొప్ప విప్లవ కారుడైన కాళోజి గారి జీవిత చరిత్ర గురించి తీసిన ప్రభాకర్ జైనీ దంపతులకు ఈ సినిమా సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
కాళోజీ పాత్రలో నటించిన మూల విరాట్ మాట్లాడుతూ.. కాళోజి గారి ఆత్మ నా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమా లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక, నిర్మాతలు, రచయితలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “ప్రజాకవి కాళోజీ బయోపిక్” పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.
నటీ నటులు
కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ళ రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీయస్ రెడ్డి, అన్వర్, పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు, ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, లాయర్ చౌహాన్, జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు. మిసెస్ ఇండియా సుష్మా తోడేటి తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్: జైనీ క్రియేషన్స్,
నిర్మాత: విజయలక్ష్మీ జైనీ,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.
పాటలు: కళారత్న బిక్కి కృష్ణ,
కెమెరామెన్: స్వర్గీయ రవి కుమార్ నీర్ల;
సంగీతం: యస్.యస్.ఆత్రేయ,
నేపథ్య సంగీతం: మల్లిక్ యం.వి.కే;
‘ఎడిటింగ్: కొండవీటి రవి కుమార్,
సెకండ్ యూనిట్ కెమెరా: భాస్కర్,
కొరియోగ్రఫి: మల్లన్న శ్యామ్, కళాధర్; స్వర్గీయ రవి కుమార్ నీర్ల,