ప్రణయగోదారి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రణయగోదారి ఫస్ట్ లుక్ రిలీజ్
డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు నూతన దర్శకనిర్మాతలు. ఎప్పటికప్పుడు ఆడియన్స్ టేస్ట్ తెలుసుకుంటూ వెండితెరపై సరికొత్తగా కథలను ఆవిష్కరిస్తున్నారు. అలాంటి ఓ సినిమానే ప్రణయగోదారి. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటిస్తోంది.
పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ప్రణయగోదారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తు మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదగా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అదేవిధంగా PLV క్రియేషన్స్ బ్యానర్ లోగో కూడా లాంచ్ చేశారు మంత్రి. ఈ పోస్టర్స్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జెడ్ పిటిసి సభ్యులు సురేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ప్రణయగోదారి పోస్టర్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోందని చెప్పడమే గాక.. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించే కథతో వస్తోందని అర్థమవుతోంది. టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. పోస్టర్ లో గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు ప్రస్ఫుటం అవుతున్నాయి. నది ఒడ్డున హీరో హీరోయిన్ సైకిల్ పై ప్రయాణం చేస్తూ కనిపిస్తుండటం యువతను ఆకర్షించే పాయింట్ అని చెప్పుకోవాలి. మొత్తంగా అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జనం దృష్టిని లాగేశారు మేకర్స్.
మార్కండేయ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఈదర ప్రసాద్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చీఫ్ కో డైరెక్టర్ గా జగదీశ్ పిల్లి, డిజైనర్ గా TSS కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ గా గంట శ్రీనివాస్ వర్క్ చేస్తున్నారు. కొరియోగ్రఫర్స్ కళాధర్ , మోహనకృష్ణ , రజిని, ఎడిటర్ కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్ విజయకృష్ణ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.