ప్రిన్స్  మూవీ  రివ్యూ

Published On: October 21, 2022   |   Posted By:
ప్రిన్స్  మూవీ  రివ్యూ
 
image.png
శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

                     👍                                                                                                                                                                     

‘జాతిరత్నాలు’ చిత్రంతో డైలాగ్‌ ప్రధానంగా సాగే ఓ కొత్త తరహా కామెడీని  తీసుకొచ్చారు దర్శకుడు అనుదీప్‌ కేవి.  అమాయక పాత్రలతో హాస్యాన్ని పండించారు. ఆ సినిమా మెగా హిట్ అయ్యింది. దాంతో అదే  దర్శకుడు తదుపరి చిత్రం అంటే ఖచ్చితంగా క్రేజ్ క్రియేట్ అవుతుంది. తమిళ స్టార్ హీరో  శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందించిన ద్విభాషా చిత్రం ‘ప్రిన్స్‌’. ‘ప్రిన్స్‌’ ప్రేక్షకులను అదే స్దాయిలో  నవ్వించాడా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథాంశం:

పాండిచ్చేరిలో స్కూల్‌ టీచర్‌ ఆనంద్‌ (శివ కార్తికేయన్‌) అక్కడకు కొత్తగా టీచర్ గా వచ్చిన జెస్సీక (మరియా ర్యాబోషప్క) తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె ఓ ఇండియన్ తో ప్రేమలో పడటం తండ్రి విలియమ్స్ కు ఇష్టం ఉండదు. దానికి తోడు ఆయన స్దలాన్ని ఇక్కడ లోకల్ గా ఉన్న ఓ  రియల్ ఎస్టేట్ బ్రోకర్ కబ్జాకు ప్రయత్నించటంతో …మరింత కోపం ఇండియన్స్ పై పెంచుకుంటాడు. మరో ప్రక్క ఆనంద్ తండ్రి విశ్వనాథ్( సత్యరాజ్) ఓ డిఫరెంట్ క్యారక్టర్. ఆయనకు బ్రిటీషర్స్ అంటే పడదు. అందుకు కారణం…ఆయన తాత ఆ రోజుల్లో స్వతంత్ర్య సమర పోరాటంలో బ్రిటీష్ వారి చేతిలో చనిపోవటమే. ఇలా రెండు వైపుల నుంచి ఆనంద్ ప్రేమకు సమస్యలు ఎదురు అవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు. చివరకు ఎలా తన ప్రేమను గెలిపించుకున్నాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ …:

జాతిరత్నాలు లాంటి హిలేరియస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అనుదీప్.. మళ్లీ అలాంటి కామెడీనే మరోసారి చేద్దామని ప్రయత్నించాడు. అయితే ఈ సారి ఆ జోక్స్ అంతలా వర్కవుట్ కాలేదు. దానికి తోడు కథ లేకుండా స్క్రీన్ ప్లే లేకుండా సినిమాని నడపాలని ప్రయత్నం చేయటం దెబ్బ కొట్టింది. పైకి  ఫన్నీ లవ్ స్టోరీలా కనిపించినా ట్రీట్మెంట్ లో ఆ ఫన్ ఎలివేట్ కాలేదు. తన స్టైల్  కామెడీ కొంతవరకూ వర్కౌట్ అయ్యింది. కానీ పూర్తి గా కాదు. ఇక ఫస్టాఫ్‌లోనే కథలోకి వెళ్లినా…మొదటి మలుపు మాత్రం ఇంట్రవెల్ కే వస్తుంది. అప్పటిదాకా సాగతీసిన ఫీలింగ్ వస్తుంది.  అక్కడక్కడ కామెడీ పండించే విషయంలో సీన్లు సాగదీసుకుంటూ పోయాడు. అయితే బాటిల్ గార్డ్ లాంటి కొన్ని ఫన్నీ ఎపిసోడ్.. బాగానే నవ్వించాయి. ప్రధాన పాత్రలన్నీ క్యారక్టరైజేషన్స్ బలంగా లేకపోవటంతో  చాలా సిల్లీగా బిహేవ్ చేస్తుంటాయి.  అయితే శివకార్తికేయన్, సత్యరాజ్, కొంతలో కొంత ప్రేమ్ జీ పాత్రలు తప్ప మిగతా పాత్రలు అంత ఫన్ పండేలా డిజైన్ చేయలేదు. ప్రేక్షకుడు లాజిక్ ఎంత వెతక్కుండా ఉండలన్నా ఇబ్బందిగా ఉంటుంది. సెకండాఫ్ లోనూ కథలో కదిలిక లేక, లింక్ లు సరిగ్గా లేక కామెడీ సన్నివేశాలు బోరింగ్ అనిపిస్తుంటాయి. ఇక హీరో, హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్‌లో ఎమోషన్ పండలేదనే చెప్పాలి.  దానికి తోడు ప్రతీ చిన్న పాత్రకి కూడా దాదాపు అందరూ తమిళనటులే కనిపిస్తారు.క్లైమాక్స్ కు జాతిరత్నాలు ఫార్మెట్ నే అనుసరించాడు అనుదీప్.  ప్రిన్స్ లో గ్రామస్తుల సమక్షంలో అర్ధం పర్ధం లేని మాటలతో ‘మానవత్వం’ చెప్తాడు. అది గొప్పగా పండితే సినిమా ఓ రేంజిలో ఉండేది.

టెక్నికల్ గా…:

తమన్ పాటల్లో బింబిలిక్కి, జెస్సికా పాటలు క్యాచిగా వున్నాయి. నేపధ్య సంగీతంలో మెరుపులు లేవు కానీ ఓకే అనిపిస్తుంది.

ఈ సినిమాకు చాలా పెద్ద టెక్నికల్ టీమే పనిచేసింది. ముఖ్యంగా  మనోజ్ పరమ హంస విజువల్స్ రిచ్ గా వున్నాయి. కలర్ ఫుల్ గా ప్రతీ సీన్ ని ప్రజంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్  డీసెంట్ గా వున్నాయి. అనుదీప్ మార్క్ డైలాగులు అక్కడక్కడా నవ్విస్తాయి. ఆర్ట్ వర్క్ బాగుంది.  తమన్ సంగీతం అందించడంతో పాటు పాడిన జెస్సికా, బింబిలిక్కి పాటలు బాగానే వర్కవుట అయ్యాయి. వాటి అందంగా చిత్రీకరించినా కథకు బ్రేక్ లు వేసుకుంటూ పోయాయి.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉంది.

నటీనటుల్లో …శివకార్తికేయన్ కు ఇది అలవాటైన క్యారక్టరే. కొత్తగా ఆయన చేసిందేమీ లేదు. అయితే తెలుగుకు ఆయన ఎంతవరకూ ఎక్కుతారో చూడాలి. ఇక సత్యరాజ్ పాత్ర సీరియస్ టోన్ లేదు. చాలా సిల్లీగా ఉంది. ల్యాండ్ కబ్జా మాఫియా డాన్ పాత్రలో ప్రేమ్ జి బాగా చేసారు. మిగతా వాళ్లు ఓకే.

చూడచ్చా:
జాతిరత్నాలు స్దాయిలో ఊహించకుండా ఏదో ఓ తమిళ కామెడీ సినిమాకు వెళ్లాం అని ఫిక్స్ అయితే బాగుందనిపిస్తుంది.

ఎవరెవరు:

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్,  శాంతి టాకీస్
నటీనటులు: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.
డీవోపీ: మనోజ్ పరమహంస
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ : నారాయణ రెడ్డి
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సమర్పణ: సోనాలి నారంగ్
రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి
సహ నిర్మాత:  అరుణ్ విశ్వ
నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు
రన్‌టైమ్:  2 గంటల 11 నిమిషాలు
విడుదల తేదీ: 21,అక్టోబర్ 2022.