ప్రణవం చిత్రం సాంగ్ లాంచ్
ప్రేమికుల రోజు సందర్భంగా `ప్రణవం` సాంగ్ లాంచ్
చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ హీరో హీరోయిన్లుగా కుమార్ జి. దర్శత్వంలో తను.ఎస్ నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రణవం’. పద్మారావ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను ఇటీవల రేడియో సిటీలో లాంచ్ చేశారు. ఈ పాటకు మంచి రెస్సాన్స్ వస్తోంది. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని రేడియో మిర్చిలో ప్రమఖ సంగీత దర్శకుడు,దర్శకుడు, సింగర్ ఆర్.పి.పట్నాయక్ చేతుల మీదుగా సెకండ్ సింగిల్ ను లాంచ్ చేశారు.ఈ పాటను ఆర్.పి.పట్నాయక్, ఉష కలిసి పాడారు.
ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ..“చాలా గ్యాప్ తర్వాత `ప్రణవం` చిత్రంలో ఒక మంచి మెలోడీ సాంగ్ ను పాడాను. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేస్తోన్న ఈ పాట శ్రోతలకు నచ్చుతుంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు“ అన్నారు.
హీరో శ్రీ మంగం మాట్లాడుతూ…ఆర్.పి పట్నాయక్ గారు పాడిన పాటను ఆ చేతుల మీదుగా “వేలెంటైన్స్ డే సందర్భంగా రేడియో మిర్చిలో విడుదల చేసాం. ఈ పాట అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్లో ఉన్నాయి. మార్చిలో రిలీజ్ చేయడానికి మా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు“ అన్నారు.
మ్యూజిక్ డైరక్టర్ పద్మనావ్ భరద్వాజ్ మాట్లాడుతూ…“ ఇటీవల మా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశాము. దానికి మంచి స్పందన వస్తోంది. ఇక రెండో సింగిల్ ను వేలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. ఇక ఈ పాటను పాడిన ఆర్ పి పట్నాయక్ గారి చేతుల మీదుగా రిలీజ్ కావడం చాల సంతోషంగా ఉందన్నారు.
లిరిసిస్ట్ కరుణ కుమార్ మాట్లాడుతూ..“ఒక మంచి మెలోడీ సాంగ్ రాసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత ఆర్.పి.పట్నాయక్. ఉషగారు కలిసి పాడిన ఈ పాట ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఉంటుందన్నారు.
జెమిని సురేష్, నవీన, జబర్దస్త్ బాబి, దొరబాబు, సమీర, తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి పిఆర్వో: వంగాల కుమార స్వామి; స్టిల్స్: శశాంక్ శేఖర్; డిఓపి: మార్గల్ డేవిడ్; కొరియోగ్రాఫర్: అజయ్; కో-డైరక్టర్: శ్రావణ్ నల్లూరి; సంగీతం: పద్మనావ్ భరద్వాజ్; ఎడిటర్: సంతోష్; ఫైట్స్: దేవరాజ్; లిరిక్స్: కరుణ కుమార్, సిహెచ్ విజయ్‌కుమార్, రామాంజనేయులు; నిర్మాత: తను.ఎస్; కో- ప్రొడ్యూసర్స్: వైశాలి, అనుదీప్; దర్శకత్వం: కుమార్.జి