Reading Time: < 1 min

ప్లాంట్‌ మ్యాన్‌ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త తరహా కామెడీ చిత్రం ప్లాంట్‌ మ్యాన్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి హారర్‌ మూవీస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ ఇప్పుడు ఇంటి నెం.13 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కాబోతోంది. ఇదిలా ఉంటే.. పన్నా రాయల్‌ డిఎం యూనివర్సల్‌ స్టూడియోస్‌ అనే బేనర్‌ను స్థాపించారు. ఈ బేనర్‌ ద్వారా కొత్తవారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే డైరెక్టర్‌ పన్నా రాయల్‌ తనే నిర్మాతగా మారి డిఎం యూనివర్సల్‌ స్టూడియోస్‌ పతాకంపై ప్లాంట్‌ మ్యాన్‌ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా కె.సంతోష్‌బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పన్నా రాయల్‌ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకు మనం చూడని కొత్త తరహా కామెడీ మూవీ ఇది. సైంటిఫిక్‌ కామెడీ ఎక్స్‌పెరిమెంట్‌గా వస్తున్న ప్లాంట్‌ మ్యాన్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ మూవీ. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమాను రూపొందించారు. సినిమాటోగ్రఫీ విషయంలోగానీ, మ్యూజిక్‌ విషయంలోగానీ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇకపై కూడా తమ బేనర్‌లో కొత్తవారికి అవకాశం ఇచ్చి చిన్న సినిమాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా నిర్మాత పన్నా రాయల్‌ తెలిపారు.

నటీనటులు :

చంద్రశేఖర్‌, సోనాలి పాణిగ్రాహి, అశోక్‌ వర్థన్‌, యాదం రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్‌, లక్ష్మీకిరణ్‌, శేఖర్‌, వీరభద్రం, శ్రీకుమార్‌, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి

సాంకేతికవర్గం :

సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌
సంగీతం: ఆనంద బాలాజీ
ఎడిటింగ్‌: ఎస్‌.కె.చలం
నిర్మాతదర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్‌
దర్శకత్వం: కె.సంతోష్‌బాబు