ప్లేబాక్ చిత్రం మార్చ్ విడుదల

Published On: February 15, 2021   |   Posted By:

ప్లేబాక్ చిత్రం మార్చ్ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా దర్శకుడు సుకుమార్ రూపొందించిన చిత్రం వన్ నేనొక్కడినే , ఈ చిత్రాన్ని ఇప్పటికి కూడా టాలీవుడ్ లో మోస్ట్ ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ గా పరిగణిస్తున్నారు , అయితే అలాంటి అద్భుతమైన కథ ను ప్రేక్షకులకు అందిం చి న  రచయిత హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రాబోతున్న సినిమా “ప్లేబాక్” , సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథా, కథనం తో వస్తున్న చిత్రం మార్చ్ 5 వ తేదీన థియేటర్ల లో విడుదలకు సిద్ధమవుతోంది .

అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది సరికొత్త కథ అని చెబుతోంది టీం , క్రాస్ టైం కనెక్షన్ మీద ఇప్పటివరకు ఏ చిత్రం రాలేదని , కచ్చితంగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు నూతన కథా వస్తువు పరిచయం అవుతుందని అంటుంది ప్లేబాక్ టీం.   శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై తెరక్కేకిన ఈ చిత్రం లో హుషారు సినిమా ఫేమ్ దినేష్ తేజ్ , మల్లేశం సినిమా ఫేమ్ అనన్య నాగళ్ల హీరో హీరోయిన్ లుగా నటించారు . అర్జున్ కళ్యాణ్ , స్పందన , మూర్తి , టీఎన్ ఆర్ , చక్రపాని , అశోక్ వర్ధన్, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హరి ప్రసాద్ జక్కా ఇంతకుముందు వన్ నేనొక్కడినే కి కథను ఇవ్వడం తో పాటుగా , 100% లవ్ చిత్రానికి స్క్రీన్ప్లే ని అందించారు , అలాగే సుకుమార్ రైటింగ్స్ లో దర్శకుడు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు .

సంగీతం – కమ్రన్
సినిమాటోగ్రఫీ – బుజ్జి.కే
ఎడిటర్ – నాగేశ్వర రెడ్డి బొంతల
విడుదల తేది – మార్చ్ 5 , 2021