ఫస్ట్ టైం చిత్రం ప్రారంభం

Published On: April 14, 2021   |   Posted By:
ఫస్ట్ టైం చిత్రం ప్రారంభం
 
హేమంత్ ఆర్ట్స్ పతాకంపై అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్  జంటగా ఐ.హేమంత్ స్వీయ దర్శకత్వంలో 
నిర్మిస్తున్న చిత్రం “ఫస్ట్ టైం”. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన యమ్. యల్.ఏ. రఘునందన్  ముహూర్తపు సన్నివేశానికి  క్లాప్ కొట్టగా, దర్శకులు జి.నాగేశ్వర్ రెడ్డి  కెమెరా స్విచ్ ఆన్ చేశారు.నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ  ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
  
యమ్.యల్.ఏ.రఘునందన్ మాట్లాడుతూ… అందరికీ ఉగాది శుభాకాంక్షలు.  కామారెడ్డి నుండి వచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ హేమంత్ దర్శక నిర్మాత గా మారి ఈ సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.బిగ్ బాస్ ద్వారా వెండి తెరకు పరిచమై ఇంతింతై వటుడింతై అన్నట్లు నటనలో తన కౌసల్యాని చాటుకొని ముందుకు పోతున్నాడు. ఈ సినిమాతో వెండి తెరకు అరంగేట్రం అవుతున్న అఖిల్ కు ఈ మూవీ పెద్ద విజయం సాధించి టీం అందరికీ మంచి పేరు రావాలని అన్నారు.
  
దర్శక, నిర్మాత ఐ.హేమంత్  మాట్లాడుతూ ….బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ ఈ సినిమా తరువాత పెద్ద హీరో అవుతాడు.హీరోయిన్ కోసం 1500 ప్రొఫైల్స్ చూసి అనిక కు సెలెక్ట్ చేయడం జరిగింది. త్వరలో ఈ సినిమా షూట్ కొరకు కర్నాటకలోని అప్సర కొండ బీచ్ కు వెళుతున్నాము. అక్కడ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి అదే నెల చివరికంతా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తాము .అన్ని అనుకున్నట్లు షూటింగ్ జరిగితే వరల్డ్ లోనే ఫస్ట్ టైం న్యూ ఫార్మాట్ లో ప్రిలుక్ టీజర్ ను రిలీజ్ చేస్తూన్నాము.ఇది పూర్తి రొమాంటిక్ అడ్వెంచరస్ మూవీ. ఈ సినిమాను ఆగస్ట్ కంతా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్భం చేస్తాం. ఈ మూవీ ద్వారా కొన్ని కొత్త టెక్నోలజీ తీసుకువస్తున్నాము..అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.
  
హీరో అఖిల్  మాట్లాడుతూ… హేమంత్ ఈ స్టోరీ గత సంవత్సరం క్రితమే చెప్పాడు.నేను ఈ కథ విన్న తరువాత నేను రెండు నిమిషాలు బ్లాంక్ అయ్యాను.ఎందుకంటే ఇది డిఫ్రెంట్ యూనిక్ స్టోరీ .నేను చాలా కథలు విన్నా హేమంత్ చెప్పిన కథ నా మైండ్ లో ఉండేది.ఇలాంటి కథ నాకు దొరకదని ఈ సినిమా తప్పక  చేయ్యాలని చేస్తున్నాను.ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.ఇలాంటి డిఫ్రెంట్ కథలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
  
హీరోయిన్ అనిక విక్రమన్  మాట్లాడుతూ …ఇంత మంచి ప్రాజెక్టు లో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అన్నారు.
 
సంగీత దర్శకుడు మాట్లాడుతూ… మంచి కథ తో వస్తున్న ఈ సినిమాలో పాటలు రాసె అవకాశం ఇచ్చిన హేమంత్ కు  ధన్యవాదాలు అని అన్నారు.
 
నటీనటులు 
అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్,అజయ్ రత్నం,అనిరుద్, వివారెడ్డి మవురపు తదితరులు
  
సాంకేతిక నిపుణులు 
బ్యానర్ : హేమంత్ ఆర్ట్స్
ప్రొడ్యూసర్ & డైరెక్టర్ : ఐ.హేమంత్
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వెంకట్
ఫోటోగ్రఫీ : మురళి. వి