Reading Time: 2 mins

ఫాలోయింగ్ మూవీ ప్రారంభం

విస్లా స్టూడియోస్ పతాకంపై తిలక్ శేఖర్, ఖ్యాతి శర్మ నటీ నటులుగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రవీణ్ సాపిరెడ్డి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ‘ఫాలోయింగ్’. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరీదేవి సాపిరెడ్డి క్లాప్ నివ్వగా.. రాధికా చిలకలపూడి ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో..

నిర్మాత ప్రవీణ్ సాపిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ రాధాకృష్ణగారు నాకు స్టోరీ చెప్పినపుడు నాకు హాలీవుడ్ స్టాండర్డ్‌లా అనిపించింది. ఇలాంటి ప్రాజెక్ట్‌తోనే ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలని వెయిట్ చేశాను. మా చిన్నాన్న చోట కె నాయుడుగారు స్టోరీ విని చాలా బాగుందని వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఈ సినిమాను 2021 మార్చిలో శివరాత్రికి విడుదల చేయాలని అనుకుంటున్నాము..’’ అన్నారు.

హీరో తిలక్ శేఖర్ మాట్లాడుతూ.. ‘‘నేను కన్నడలో 48 మూవీస్ చేశాను. అందులో 12 మూవీస్‌లో హీరోగా చేశాను. తెలుగు సినిమా త్రిపురలో నెగెటివ్ రోల్ చేశాను. ఆ తరువాత ఈ మూవీలో ఫుల్ లెన్త్ రోల్ చేస్తున్నాను. 2018లో రాధాకృష్ణగారు స్టోరీ ఉంది హైదరాబాద్ రమ్మన్నారు. అప్పుడు నేను బెంగుళూరులో షూట్‌లో బిజీగా ఉండి రాలేకపోయాను. తరువాత చేద్దాం అనుకోని స్టోరీ డిస్కర్షన్ చేసి మూవీ చేద్దాం అనుకున్న టైమ్‌లో కరోనా వచ్చి ప్రొడక్షన్ ఆగిపోయింది. ఇప్పుడు చోట కె నాయుడుగారి సపోర్ట్ వల్ల ఈ మూవీ లాంచ్ అయ్యింది. ఈ మూవీ తప్పక హిట్ అవ్వుతుంది..’’ అన్నారు.

ప్రమోద్ మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ రాధాకృష్ణగారు అందరితో కలిసి స్టోరీ డిస్కర్షన్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం మేమంతా చాలా ఎక్సయిటింగ్‌తో ఉన్నాము. శివరాత్రికి మీ ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువస్తాము..’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ మాణిక్ మాట్లాడుతూ.. ‘‘మొదటి సినిమానే స్టార్‌తో చేయడం హ్యాపీగా ఉంది. ఇందులోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలుస్తుంది..’’ అన్నారు..

హీరోయిన్ క్యాతీ మాట్లాడుతూ.. ‘‘ఈ మూవీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు’’ అని తెలిపింది.

కెమెరామెన్ నిమ్మ గోపి మాట్లాడుతూ.. ఈ స్టోరీ గురించి చాలా మందిని అప్రోచ్ అయ్యాము. అలాగే ఈ మూవీ కోసం చాలా స్ట్రగుల్ అయ్యాము. ఈ రోజు స్టేజ్ పైన నిల్చొని మాట్లాడుతున్నాను అంటే ఆ క్రెడిట్ అంతా దర్శకనిర్మాతలదే. వారికి నా కృతజ్ఞతలు..’’ అని తెలిపారు.

డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘చోటగారు ఇక్కడ ఉండి ఉంటే బాగుండేది. ఆయన సలహాతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. విలన్‌ను కరెక్ట్‌గా చూయించాలంటే డి.ఓ.పి చాలా ముఖ్యం. ఈ చిత్రానికి మంచి డి.ఓ.పి. దొరికాడు. మార్చి11న తప్పకుండా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అన్నారు..