ఫేక్ ట్విట్టర్ అకౌంటుపై నటుడు ఆలీ స్పందన
అది ఫేక్ ఎకౌంట్ – అలీ
దాదాపు పదకొండు వందల సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాను. నేను సోషల్ మీడియా ట్వీట్టర్లో యాక్టర్ అలీ అఫీషియల్ పేరుతో ఎకౌంట్ ఓపెన్ చేసి పలువులు నటీనటుల్ని అభినందిస్తున్నట్లు పోస్ట్‌లు పెడుతున్నారు. నాకు ఎటువంటి ట్వీట్టర్ ఎకౌంట్ లేదు. అది ఫేక్ ఎకౌంట్. ఆ ఎకౌంట్లో వాళ్లు పెట్టిన పోస్ట్‌లను మీడియా వాళ్లు నేనే చేశాననుకొని దానిపై వార్తలను ప్రసారం చేస్తున్నారు.
ఈ వ్యవహారం అంతా మూడేళ్ల నుండి జరుగుతుందట. సోషల్ మీడియాలో నేనంత యాక్టివ్‌గా లేకపోవటంతో నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది. నాకు తెలిసిన వెంటనే శనివారం సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నా ప్రమేయం లేకుండా పెట్టే ఆ పోస్ట్‌లకు నాకు ఏ బాధ్యత ఉండదు.
ఇకనుండి మీకు ఏ న్యూస్ అన్నా తెలిస్తే దానిగురించి ఏదైనా వార్త ప్రసారం చేయలనుకుంటే నన్నుగాని, నాటీమ్ మెంబర్స్‌ను కానీ సంప్రదించాలని మనవి చేస్తున్నాను. ప్రస్తుతం నేను వైయస్సార్సిపి పార్టీలో కీలక సభ్యునిగా ఉన్నాను. నా వల్ల మా పార్టీకిగాని, మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గాని భవిష్యతులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం నేను ఈ రోజు కంప్లైంట్ చేశాను. ఫేక్ ఎకౌంట్లో వాళ్లు రాసిన న్యూస్ కన్నా అది నేనే పెట్టాననుకొని ఆ హీరోల ఫ్యాన్స్ చేసే కామెంట్స్ చూస్తుంటే నాకు, నా కుటుంబానికి ఎంతో భాద కలుగుతుంది. దయచేసి ఇటువంటి పనులు ఇకపై చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమీషనరేట్ ఆఫీసర్ డిసిపి రోహిణి గారిని కోరాను.