ఫేమ్‌ ఓప్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్స్‌ 2022

Published On: March 21, 2022   |   Posted By:

ఫేమ్‌ ఓప్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్స్‌ 2022

సోషల్‌ మీడియా వేదికలో పెద్ద ఎత్తున ప్రజాభిమానం పొందిన వ్యక్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్స్‌ 2022’ పేరిట అవార్డు ఫంక్షన్‌ను నిర్వహించారు.

‘విప్రైడ్‌’ సమర్పణలో సందీప్‌ గౌతమ్‌ సారధ్యంలో శ్రీని ఇన్‌ఫ్రా, ‘యు మీడియా’ల సహకారంతో జెఆర్సి కన్వెన్షన్‌ సెంటర్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎక్కడో విలేజ్‌లో వీడియోలు చేసుకొనే వారికి సైతం తగిన గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం రియల్లీ గుడ్‌. సోషల్‌ మీడియా ప్రజలకు బాగా దగ్గరైంది. దీని ద్వారా ఎందరో సెలబ్రిటీలుగా మారారు. అటువంటి వారికి మరింత గుర్తింపు, ఎకంరేజ్‌మెంట్‌ ఇస్తూ ఇటువంటి అవార్డు ఫంక్షన్‌ చేయడం చాలా గ్రేట్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫంక్షన్‌ చేసుకోవడం మరీ సంతోషంగా ఉంది అన్నారు. సందీప్‌కు ఆల్‌ది బెస్ట్‌. ఫేమ్‌ ఓప్స్‌, విప్రైడ్‌ సంయుక్తంగా ఈ అవార్డు ఫంక్షన్‌ చేయడం హ్యాపీగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో భాగంగా సోషల్ మీడియాలో సొంత ప్రతిభతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారికి ఈ అవార్డ్స్ ప్రదానం చెయ్యడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్పి.పట్నాయక్, హీరోయిన్స్ హెబ్బా పటేల్, పూర్ణ, బిగ్ బాస్ సన్నీ, హైపర్ ఆది, హరి ప్రియ, నిర్మాత అంబికా కృష్ణ, నిర్మాత దామోదర్ ప్రసాద్, ఎమ్ఎల్సి తక్కల పల్కి రవీందర్ రావ్, శ్రీని ఇన్ఫ్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.