Reading Time: 3 mins

ఫ్యామిలీ డ్రామా మూవీ రివ్యూ

డార్క్ కామెడీ: “ఫ్యామిలీ డ్రామా” రివ్యూ !

Emotional Engagement Emoji (EEE) :    


?

ప్రతి చిన్న విషయానికి తండ్రి బూతులు తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ అబ్బాయి, తన ఇంట్లో పరిస్థితులు నచ్చక బయటకి వచ్చేసిన ఓ అమ్మాయి..కలిస్తే…వాళ్లను మరో సైకో సపోర్ట్ ఇస్తే… ఇంట్రస్టింగ్ గా ఉంది కదా..ఇదే ఈ చిన్న సినిమాని పెద్ద సినిమా చేసింది. సుహాస్ అనే నటుడు విశ్వరూపం చూపించే అవకాసం కల్పించింది. అదే ఫ్యామిలీ డ్రామా…ఇదో డార్క్ కామెడీ..ఇటు ఫన్, అటు డార్క్ థీమ్ కలిసి సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి. అవును కొన్ని సినిమాలను మనం అండర్ ఎస్టిమేట్  వేస్తాము…వరస రిలీజ్ లలో ఒకటిగా భావిస్తాము..కానీ ఆ సినిమానే విజేతగా నిలుస్తుంది. ఎందరి డిస్కషన్స్ బోర్డ్ లలో టాపిక్ గా మారుతుంది. ఇంతకీ ఈ సినిమాలో అంత హాట్ కంటెంట్ ఏమిటి అంటారా..
 
హైదరాబాద్ లో, ఓ ఇండిపెండెంట్ హౌజ్ లో ఓ మిడిల్ క్లాస్ కుటుంబం. ఆ ఇంటి పెద్ద(సంజయ్ రతా) తన కొడుకులను ఎప్పుడూ తిట్టిపోస్తూంటాడు. ఆ టార్చర్ భరించలేక ఆల్రెడీ పెద్ద కొడుకు రామా(సుహాస్) ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చిన్న కొడుకు లక్ష్మణ్  (తేజ కాసారపు)పై  ఆ తండ్రి అలాగే నోరు పారేసుకుంటూంటాడు.  ఉద్యోగం లేదని ప్రతీ క్షణం సాధిస్తూంటాడు. పెళ్లైనా అతన్ని ఇల్లు వదిలిపొమ్మని అంటూంటాడు. ఈ క్రమంలో ఆ అన్నదమ్ములు రామా, లక్ష్మణ్  ఇద్దరు కలిసి తన తండ్రి పై కక్ష తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఓ మెడిసిన్ ఆ పెద్దాయన తాగే కాఫీలో కలిపి పక్షవాతం వచ్చేలా చేస్తారు. అక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. వాళ్లిద్దరూ క్రిమినల్సే కాదు..సైకో కిల్లర్స్ అని ఆ ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారు. మిగతా కథేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
తెలుగులో సైకో థ్రిల్లర్స్ రావు..డార్క్ కామెడీ లు అతి తక్కువ. ఎందుకో ధైర్యం చేయరు..చూడరంటావా,హాలీవుడ్ సినిమాలు చూసుకోవాల్సిందేనా  అనే ఓ వర్గం ప్రేక్షకుడు..హమ్మయ్య స్వచ్చమైన అచ్చ తెలుగు సైకో సినిమా వచ్చిందని,డార్క్ కామెడీ జానర్ చూస్తున్నామని ఆనందపడే సినిమా ఇది. ఈ తరహా సినిమాలు చూసే జనం ఉంటారా అనే సందేహం కు ఈ సినిమా ట్రైలర్స్ కు వచ్చిన రెస్పాన్సే సమాధానం చెప్పింది. సినిమా కోసం ఎదురుచూసేలా చేసింది. అయితే కొందరికి ఈ సినిమా ఎక్కకపోవచ్చు. డార్క్ కామెడీ జానర్ ని ఇష్టపడే వాళ్లే ఈ సినిమాని ఎంచుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. అసలు ఇలాంటి కథలను తెలుగులో సినిమాగా చేద్దామనే ఆలోచన రావటమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే ఇలాంటి సినిమాలు ఎటెమ్ట్ చేసాము కదా అని కాస్త ఓవర్ డోస్ అయితే ఏదో ఉపన్యాసం విన్న ఫీలింగ్ వస్తుంది. అలాగని డోస్ తగ్గిస్తే  విసుగొచ్చేస్తుంది. అలాగే ఇది ఏ హాలీవుడ్ కాపీలాగ అనిపించకూడదు. అచ్చ తెలుగు క్యారక్టర్స్ కనిపించాలి. లేకపోతే ఆ డార్క్ కథను ఫాలో అవటం కష్టం. ఇవన్ని ఈ చిత్రం రైటర్ ముందున్న కష్టాలు. అయితే వాటిని ఇష్టపడే చేసినట్లున్నాడు. బాలెన్స్ చేసుకుంటూ స్క్రిప్టుని రాసుకుని ఫ్యామిలీ డ్రామాని ఓవర్ డోస్ అనిపించకుండా లాక్కొచ్చాడు.

ఇక మార్కెట్ యాస్పెక్ట్ లో సుహాస్ పాత్ర ద్వారా ఇప్పటితరం ఆలోచనలు పట్టుకునే ప్రయత్నం చేసారు.  యువతరం ప్రేక్షకుల్లో పాగా వేయాలనుకుంటే, వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా తన పాత్రల తీరుతెన్నుల్ని  మార్చుకోవాల్సిందే అని తేల్చి చెప్పినట్లైంది. ఇవాళ్ళ సినిమాలు  ప్రధానంగా యూత్ కోసం, తర్వాత మిగిలితే వాళ్ళ అమ్మా నాన్నల కోసం అన్నట్లు రెడీ అవుతున్నాయి. టీవి ఫ్యామిలీ ప్యాక్ అయితే ఓటీటి ఇండిడ్యువల్ ప్యాక్ అయ్యింది. ఇలాంటి ఓటీటికి ఈ సినిమా ఫెరఫెక్ట్.  అయితే మాటల్లో తప్ప విజువల్ ప్రెజెన్స్ లేకపోవటమే కాస్త ఇబ్బంది పెడుతుంది.  ఫ్యామిలీ డ్రామాలు నేటి రోజువారీ డైలీ లైఫ్ లో ఎదురవుతున్న సమస్యలతో ముడిపెట్టి ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎంతో పకడ్బందీగా, ఆధునికంగా  తీస్తే తప్ప ఈ రోజుల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. అదే చాలా వరకూ ఈ సినిమా సాధించగలిగింది.


ముఖ్యంగా డైరక్టర్ మెహర్ తేజ్ అతి తక్కువ పాత్రలతో స్క్రిప్టుని రాసుకున్నాడు. ఈ కథకు కీలకం సుహాస్‌ క్యారెక్టరైజేషన్‌, దాన్ని కొత్తగా చూపించాడు. అయితే ఎందుకోసం సుహాస్ కిల్లర్ గా మారాడు, బ్లేడ్ ముక్కతో గొంతుకోసి మరీ చంపాలనేంత కసి  ఎందుకొచ్చిందనేది సినిమాలో క్లారిటీగా చెప్పరు. మనమే ఊహించుకోవాలి. ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలైనప్పటికీ ఇంట్రవెల్ సమయానికి సినిమాపై ఇంట్రస్ట్  రేకెత్తించాడు. అయితే అక్కడక్కడా  కొన్ని సీన్స్ రిపీట్ అయ్యాయి. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్టుతో సినిమాని ముగించడం ఇంట్రస్టింగ్.

ప్లస్ లు
సుహాస్ పాత్ర
ఆకట్టుకునే స్క్రీన్ ప్లే ప్రేక్షకులని అలాగే కూర్చోబెట్టేస్తుంది.
సినిమా లెంగ్త్
కాన్సెప్టు కొత్తగా,ఆలోచింపచేసేలా ఉంది.

నచ్చనవి
స్లో నేరేషన్


టెక్నికల్ గా ,

ఫెరఫార్మెన్స్ పరంగా..ఈ సినిమా నటుడు సుహాస్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఓటిటి ద్వారా రిలీజైన కలర్ ఫోటోతో ప్రేక్షకులకు సుపరిచితుడైన సుహాస్ సైకోగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మ్యూజిక్ కూడా బాగుంది. మిగితా పాత్రధారులు కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా చేశారు.  

సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు బాగున్నాయి.సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరిగినా ఆ పీల్ రాకుండా డైరక్టర్ మెహర్ తేజ్ మేనేజ్ చేసారు. ప్రొడక్షన్ పరంగా.. మేకింగ్ లో క్వాలిటీ. ఇక అజయ్ సంజయ్ సంగీతం,  ఈ చిన్న సినిమాను పూర్తిగా చివరి దాకా చూసేలా చేసాయి.  

చూడచ్చా?

కొత్త తరహా సినిమాలు చూడాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్

ఎవరెవరు..

బ్యానర్ :- చస్మ ఫిల్మ్స్ , నూతన భారతి ఫిల్మ్స్

నటీనటులు :- సుహస్ , తేజ కాసారపు , పూజా కిరణ్ , అనూష నూతుల , శృతి మెహర్ , సంజయ్ రాథా తదితరులు.
సంగీత దర్శకుడు :- అజయ్ మరియు సంజయ్
 సినిమాటోగ్రఫీ : వెంకటేష్ ఆర్.శాఖమూరి
నిర్మాత: రామ్ వీరపనేని
డైరెక్టర్ :- మెహెర్ తేజ్
విడుదల తేదీ : 29 అక్టోబర్,
ఓటీటి : సోనీ లివ్
రన్ టైమ్:2 గంటల, 12 నిముషాలు