ఫలక్నుమా దాస్ చిత్రం తొలి లుక్ విడుదల
వినూత్నమైన కాన్సెప్ట్ తో సక్సస్ లు సాధించిన వెళ్ళిపోమాకే, ఈ నగరానికేమైంది లాంటి చిత్రాల్లో నటించిన విశ్వక్సేన్ హీరోగా, స్వీయదర్శకత్వంలో కరాటేరాజు గారు నిర్మాతగా, వన్మాయే క్రియేషన్స్ పై విశ్వక్సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్ అనుసంధానంతో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ఫలక్నుమా దాస్.. ఈ సినిమా పూర్తిగా హైదరాబాద్ బ్యాక్డ్రాప్ లో సాగే చిత్రం. ఈ చిత్రంలో సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి లు ఫిమెల్ లీడ్ కేరక్టర్స్ లో కనిపిస్తారు. 3 రోజుల మినహ షూటింగ్ ని పూర్తిచేసుకుంది. పెళ్ళిచూపులు, ఈ నగరానికేమైంది లాంటి చిత్రాలు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలో నటించారు. క్రిష్టమస్ సందర్బంగా ఈరోజు ఈ చిత్రం యెక్క మెదటి లుక్ ని డైనమిక్ దర్శకుడు పూరిజగన్నాథ్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాత కరాటేరాజు గారు మాట్లాడుతూ.. విశ్వక్సేన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తనే హీరోగా చేస్తున్న చిత్రం ఫలక్నుమా దాస్. హైదరాబాద్ లోని పాతబస్తీ తో కలిపి దాదాపు 118 లోకేషన్స్ లో ఈ చిత్రం షూట్ చేశాము. ఈ చిత్రం హైదరాబాద్ బేస్డ్ స్టోరి కావటంతో ఇక్కడ నేటివిటి, కల్చర్ ని కలర్ఫుల్ గా చూపించాము. మా యూనిట్ అంతా చాలా కష్టపడి చేశారు. వారి కష్టాన్ని మించి అవుట్పుట్ రావటం చాలా ఆనందంగా వుంది. మూడు రోజుల షూట్ మినహ చిత్రం మెత్తం పూర్తయ్యింది. క్రిష్టమస్ సందర్బంగా ఈ రోజు మెదటి లుక్ మెషన్ పోస్టర్ ని విడుదల చేశాము. మరిన్ని వివరాలు తరువాత తెలియజేస్తాము.. అని అన్నారు
ఈ చిత్రంలో విశ్వక్సేన్, సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి లు నటించగా.. స్పెషల్ పాత్రలో తరుణ్ భాస్కర్ నటించారు.
బ్యానర్స్..వన్మాయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్
నిర్మాత.. కరాటే రాజు సినిమాటోగ్రాఫర్.. విద్యాసాగర్ చింతఒరిజినల్ సౌండ్ ట్రాకర్(మ్యూజిక్).. వివేక్ సాగర్ ఎడిటర్ రవితేజ లిరిక్స్.. కిట్టు విశ్శాప్రగడ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, సౌండ్ డిజైన్.. సచిన్, డి ఐ.. సురేష్ రవి, కాస్ట్యూమ్ డిజైనర్.. రాగారెడ్డి, ఆర్ట్.. అఖిల పెమ్మశాని, మ్యూజిక్ మిక్స్ంగ్.. సంజయ్ దాస్, సౌండ్ మిక్సింగ్.. అరవింద్ మీనన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. సందీప్ సి.హెచ్,ప్రోడక్షన్.. జయచంద్ర అండ్ గొపాల్ ఉపాద్యాయ, దర్శకుడు .. విశ్వక్ సేన్