బంగారు బుల్లోడు చిత్రం ప్రీ -రిలీజ్ ఫంక్షన్
ఫ్యామిలీ స్టార్ నరేష్ నటించిన “బంగారు బుల్లోడు” పెద్ద హిట్ కావాలి.. ప్రీ -రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్
అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం “బంగారు బుల్లోడు”.
జనవరి 23న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ -రిలీజ్ వేడుక జనవరి 21న హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్, అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాతలు కె.యల్. దామోదర ప్రసాద్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, అమ్మిరాజు, నటులు రాజా రవీంద్ర, అల్లరి నరేశ్, పృద్వి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, ప్రవీణ్, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, హీరోయిన్ పూజా జవేరి, దర్శకుడు గిరి, రచయిత వెలిగొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, కెమెరామెన్ సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యూసర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు. శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. బంగారు బుల్లోడు రిలీజ్ పోస్టర్ ని మెహర్ రమేష్ ఆవిష్కరించారు…
ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. ‘ బంగారు బుల్లోడు టైటిల్ తో పాటు ట్రైలర్ చాలా బాగుంది. సాయి కార్తీక్ మంచి సాంగ్స్ కంపోజ్ చేశాడు. స్వాతిలో ముత్యమంత సాంగ్ రోజు మా ఇంట్లో వింటున్నాం. అంత బాగా నచ్చింది. సతీష్ సూపర్బ్ విజువల్స్ ఇచ్చారు. అల్లరి నరేష్ సినిమా అంటే కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ నరేష్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులందరిని అలరిస్తుందని ఈ చిత్రం పెద్ద హిట్ అయి మా అనిల్, కిషోర్ గారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
“ఆర్ ఎక్స్ 100” ఫేమ్ అజయ్ భూపతి మాట్లాడుతూ..’ నా ఫెవారేట్ డైరెక్టర్ ఇవివి గారు. 1990లో వచ్చిన డైరెక్టర్స్ అందరికీ ఆయనే ఇన్స్పిరేషన్. ఇవివి గారు టచ్ చేయని జోనర్ లేదు. టచ్ చేయని క్యారెక్టర్స్ లేవు. అన్ని రకాల జోనర్సలో ఆయన సినిమాలు చేశారు. ఆయనలా ఇంకెవరు చేయలేదు. నరేష్ కామెడీనే కాదు ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నారు. గిరి మంచి ఫ్రెండ్. ట్రైలర్ చూస్తుంటే సినిమా బాగా తీశాడని తెలుస్తుంది. ఈ సినిమా మంచి హిట్ అయి నిర్మాత అనిల్ గారికి, దర్శకుడు గిరికి మంచి పేరు రావాలని అన్నారు.
ప్రముఖ నిర్మాత కె.యల్. దామోదరప్రసాద్ మాట్లాడుతూ.. ‘ హీరోగా అనే కంటే నరేష్ నా దృష్టిలో మంచి యాక్టర్. కామెడీ అయినా సీరియస్ అయినా ఎమోషన్స్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఈజీగా చేసే వెర్సటైల్ ఆర్టిస్ట్. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా బాగా ఆడి సూపర్ హిట్ అయి నిర్మాత దర్శకులకు మంచి పేరు డబ్బులు రావాలని కోనుకుంటున్నాను అన్నారు.
అమ్మిరాజు మాట్లాడుతూ.. ‘ మా గురుదైవం, తండ్రిసమానులు ఈవివి గారి వర్ధంతి రోజున ఈఫంక్షన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. సురేష్ ప్రొడక్షన్, ఈవివి సినిమా, సిరి సినిమా బ్యానర్లో సినిమాలు చేసిన నరేష్ ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరసగా సినిమాలు చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చి నరేష్ ని ప్రోత్సహిస్తున్న అనిల్ సుంకర గారికి చాలా థాంక్స్. గిరి, వెలిగొండ ‘బెట్టింగ్ బంగార్రాజు’కు కథ ఇచ్చారు. మళ్ళీ ఈ చిత్రానికి వారిద్దరూ పనిచేశారు.. గ్యారెంటీగా ఈ చిత్రం సూపర్ సక్సెస్ అవుతుంది అన్నారు.
హీరో నరేష్ మాట్లాడుతూ.. ‘ ముందుగా ‘బంగారు బుల్లోడు’ టైటిల్ ని అడగ్గానే మాకు ఇచ్చిన బాలకృష్ణ, రవిరాజా పినిశెట్టి గారికి నా థాంక్స్. సినిమా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సినిమా బాగుంటే ఆదరిస్తామని ఆడియెన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల్ని ఆదరించి సక్సెస్ చేశారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి 23న మా బంగారు బుల్లోడు చిత్రం వస్తుంది. అందరూ థియేటర్స్ లో మా సినిమా చూసి పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుం టు న్నా ను. డైరెక్టర్ గిరి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. బ్రహ్మాండమైన డైలాగ్స్ రాశారు వెలిగొండ. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది ఆరవ సినిమా. డెఫినెట్ గా డబుల్ హ్యాట్రిక్ అవుతుంది. సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. సాయి కార్తీక్ మ్యూజిక్ ఎక్స్ లెంట్ గా చేశాడు. అతనితో ఇది 5వ సినిమా. కంటిన్యూస్ గా మా జర్నీ ఇలాగే ఉండాలి. ఏకే అంటే నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది. ఎంతో కష్టపడి అనిల్ గారు కిషోర్ ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వర్ణ కార్మికులను కించపరిచే విదంగా బాడ్ గా కాకుండా వారి కష్టాన్ని, వారి వృత్తిని హైలెట్ చేసి మా చిత్రంలో గొప్పగా చూపించాం. సినిమా చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ట్రైలర్, పోస్టర్ చూసి ఎలాంటి డేసిషన్స్ తీసుకోవద్దు అన్నారు.
చిత్ర దర్శకుడు గిరి మాట్లాడుతూ.. ‘ కథా రచయితగా ఈవివి గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఆయనకి నా కృతజ్ఞతలు. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో గోల్డ్ స్మిత్ కుర్రాడి కథ ఇది. కథలోనే కామెడీ రన్ అవుతూ ఎంటర్టైన్మెంట్ దిశగా సినిమా ఉంటుంది. నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నరేష్ కి థాంక్స్. అలాగే ఏకే బ్యానర్లో ఈ సినిమా చేయడం చాలా గర్వాంగా, హ్యాపీగా ఫీలవుతున్నాను. అనిల్ గారు సినిమా కోసం ఎంతైనా ఖర్చుపెడతారు. ఎంత దూరమైనా వెళ్లారు. అలాంటి అనిల్ గారి కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోనుకుంటున్నాను. సాయి కార్తీక్ మ్యూజిక్, సతీష్ కెమెరా విజువల్స్, సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేసి ఈ సినిమాకి వర్క్ చేశారు. వారందరికీ నా థాంక్స్ అన్నారు.
హీరోయిన్ పూజా జవేరి మాట్లాడుతూ..’ షూటింగ్ అంతా పిక్నిక్ లా చాలా ఫన్నీగా జరిగింది. ఎప్పుడు ఆయిపోయిందో కూడా తెలీలేదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మూవీ. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఓటీటీ లు ఎన్ని వచ్చినా రిలీజ్ చేయకుండా థియేటర్స్ లొనే మన సినిమా రిలీజ్ అవ్వాలి అని వెయిట్ చేసి ఇప్పుడు 23న మా బంగారు బుల్లోడు చిత్రాన్ని విడుదల చేస్తున్న అనిల్ గారికి, కిషోర్ గారికి నా థాంక్స్ అన్నారు.
ఈ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాత అనిల్ గారికి మరిన్ని డబ్బులు, దర్శకుడు గిరికి మంచి పేరు రావాలని బంగారు బుల్లోడులో నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని కమీడియన్స్ అందరూ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నరేష్, పూజా జవేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పోసాని, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, ప్రవీణ్, అదుర్స్ రఘు, అజయ్ గోష్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్, అనంత్, భద్రం, నవీన్, భూపాల్, రమాప్రభ, రజిత, జోగిని శ్యామల తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు; రామజోగయ్య, కాస్ట్యూమ్స్; ఖాదర్, మేకప్: రాంగా, ఆర్ట్; గాంధీ, చీఫ్-కో డైరెక్టర్; నాగ ప్రసాద్ ధాసం, ఎడిటింగ్; యం ఆర్ వర్మ, డివోపి; సతీష్ ముత్యాల, సంగీతం; సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; కృష్ణ కిషోర్ గరికపాటి, కో- ప్రొడ్యూసర్; అజయ్ సుంకర, నిర్మాత; రామబ్రహ్మం సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; గిరి పాలిక.