Reading Time: 2 mins

బటర్ ఫ్లై మూవీ డిసెంబర్29న విడుదల

బటర్ ఫ్లై చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బటర్ ఫ్లై. ఈ సినిమాలో భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జెన్ నెక్ట్ మూవీస్ పతాకంపై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఘంటా సతీష్ బాబు దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా అనుపమా కెరీర్ లో ఓటీటీలో విడుదలవుతున్న తొలి చిత్రం కావడం విశేషం. ఇందులో అనుపమ ఓ పాటను పాడారు. ఆదివారం హైదరాబాద్ లో చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ గతేడాది ఇదే డిసెంబర్ టైమ్ లో సినిమా షూటింగ్ ప్రారంభించాం. దాదాపు నెలరోజుల్లో కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఏడాది టైమ్ తీసుకుని క్వాలిటీగా చేశారు. ఈ చిత్రంలో నేను గీత అనే పాత్రలో కనిపిస్తాను. ఈ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. గీత క్యారెక్టర్ లో నటించడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇన్వాల్వ్ అయి చేశాను. నాకు ఈ ఏడాది సెకండాఫ్ చాలా బాగుంది. కార్తికేయ 2, 18 పేజెస్ హిట్ అయ్యాయి. ఇప్పుడు బటర్ ఫ్లై రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీలో రావడం సంతోషంగా ఉంది. సకుటుంబ ప్రేక్షకులు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మా సినిమాను ఎంజాయ్ చేయండి. అన్నారు.

సంగీత దర్శకుడు అర్విజ్ మాట్లాడుతూ ఈ సినిమాకు పాటలు చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అనుపమ ఒక పాట పాడటం అలాగే లెజెండరీ చిత్రగారు పాట పాడటం మర్చిపోలేను. సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. మా దర్శకుడు ఒక సెటిల్ మెంట్ చేసినట్లు నా దగ్గర నుంచి పాటలను తీసుకున్నారు. అన్నారు.

నిర్మాత ప్రసాద్ తిరువళ్లూరి మాట్లాడుతూ అనుపమ లేకుంటే ఈ సినిమా లేదు. ఆమె ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయి మాకు సపోర్ట్ చేశారు. నా తోటి నిర్మాతలైన రవిప్రకాష్ గారికి, ప్రదీప్ గారికి థాంక్స్. టెక్నికల్ టీమ్ అంతా చాలా కష్టపడి మూవీ బాగా వచ్చేలా పనిచేశారు. అన్నారు.

దర్శకుడు ఘంటా సతీష్ బాబు మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలో ఇక్కడిదాకా వచ్చానంటే కారణం నా మిత్రులు. చాలా మంది ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. అనుపమ గారికి థాంక్స్ చెప్పాలి. అలాగే మా ప్రొడ్యూసర్ మూవీ అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చేందుకు సహకరించారు. పాటలు బాగా వచ్చాయి. ఆదిత్య మ్యూజిక్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నెల 29 డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మా సినిమా చూసి ఎంకరేజ్ చేయండి.అన్నారు.

హీరో నిహాల్ మాట్లాడుతూ బటర్ ఫ్లై ఒక వండర్ ఫుల్ మూవీ. ఈ సినిమాలో విశ్వ అనే రోల్ నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇదే సంస్థలో మరో సినిమా చేయబోతున్నాను. అనుపమతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. స్టార్ లా నాతో బిహేవ్ చేస్తుందని అనుకున్నా కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంది. మూవీ చేస్తున్న ప్రాసెస్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మా మూవీ రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి. అన్నారు.