బటర్ ఫ్లై మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలగులులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఈమె నటించిన కార్తికేయ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. కార్తికేయ 2 సినిమా మంచి హిట్ అవడంతో ఈమె తదుపరి చిత్రం 18 పేజెస్ సినిమాని కూడా పలు భాషలలో విడుదల చేసారు వారం తిరక్కుండానే అనుపమ నటించిన బటర్ ఫ్లై అనే ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రంతో మన ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది, ఆమె కెరీర్ ని, క్రేజ్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లేదేనా వర్కవుట్ అయ్యే చిత్రమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
అనాధలైన గీత(అనుపమ పరమేశ్వరన్), వైజయంతి(భూమిక) అక్కచెళ్లెళ్లు ఎంతో కష్టపడి పైకి వస్తారు వైజయంతి పేరున్న క్రిమినల్ లాయర్ అవగా గీత సీఏగా వర్క్ చేస్తుంటుంది అయితే ఇద్దరి మనస్తత్వాలు వేర్వేరు గీత ఇంట్రావర్ట్ కొత్తవాళ్లతో పెద్దగా కలిసే రకం కాదు. ఓరోజు వైజయంతి, వృత్తిలో భాగంగా దిల్లీకి వెళ్తుంది దీంతో ఆమె పిల్లల చిన్ను, బన్ను లను గీత చూసుకోవాల్సి వస్తుంది. స్కూల్ కి వెళ్తూంటే ఆ ఇద్దరి పిల్లలు కిడ్నాప్ కు గురి అవుతారు ఆ కిడ్నాపర్ గీతకు ఫోన్ చేసి చాలా డిమాండ్స్ పెడతాడు? అవేమిటి? ఆ కిడ్నాపర్ ఎవరు? వైజయంతి పిల్లలను ఎందుకు కిడ్నాప్ చేశాడు? అక్క పిల్లలను కాపాడుకోవడానికి గీత ఏం చేసింది? వైజయంతి నుంచి విడిగా ఉంటున్న భర్త సోమశేఖర్‌కు (రావురమేష్) కు దీనికి సంభందం ఉందా ఆ పిల్లలని గీత కాపాడిందా? లేదా? ఈ ప్రయత్నంలో గీతకు ఆమె లవర్ విశ్వ (నిహాల్) ఎలా అండగా నిలిచాడు పిల్లల్ని రక్షించే క్రమంలో గీత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే మాత్రం బటర్ ఫ్లై మూవీని చూడూల్సిందే.
ఎనాలిసిస్
ఓటిటిలలో ఎక్కువ శాతం థ్రిల్లర్స్, హారర్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే కానీ మళయాళీలు ఈ తరహా థ్రిల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూంటారు అయితే అప్పుడప్పుడు తెలుగు వాళ్లు సైతం ఈ థ్రిల్లర్స్ ని చేస్తున్నారు మంచి ఆదరణ దక్కుతోంది ఓ రకంగా ఇవి ఓటిటిలకే ఫెరపెక్ట్ అనిపిస్తూంటాయి. అలాంటి ఓ కిడ్నాప్ థ్రిల్లరే ఈ చిత్రం. అందరూ ఊహించే కథతోనే నడుస్తుంది హీరోహీరోయిన్ల ఫ్యామిలీ మెంబర్స్, వాళ్లకు కావాల్సిన వారు ఎవరో ఒకరు కిడ్నాప్ కావడం, విలన్ వేసే ఎత్తులను తమ తెలివితేటలతో చిత్తు చేస్తూ చివరలో హీరో లేదా హీరోయిన్స్ గెలిచినట్లుగా చూపిస్తూ ఈ కథలు ఎండ్ అవుతాయి.ఇక్కడా అదే జరిగింది. ఇలాంటి రొటీన్ కథలను ఎంగేజింగ్‌గా చెప్పడం అంత ఈజీ అయితే కాదు స్క్రిప్ట్ స్టేజ్‌లోనే దర్శకుడు చాలా వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సీన్స్‌ను కొత్తగా రాసుకున్నప్పుడు మాత్రమే ఈ తరహా సినిమాలు వర్కవుట్ అవుతాయి. బటర్ ఫ్లైలో చాలా వరకూ ఆ మ్యాజిక్ చేయగలిగాడు కథ కామన్ ఉందనిపించినా కథనంతో పరుగులెత్తించే ప్రయత్నం చేసారు. ఇక సినిమా ప్రారంభమైన దాదాపు అరగంట వరకూ సెటప్ సీన్స్ కే టైమ్ సరిపోయింది అప్పటిదాకా వైజయంతి, గీత పాత్రల పరిచయానికే సమయం తీసుకున్నాడు డైరెక్టర్. పిల్లల కిడ్నాప్‌తో అసలు కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత వచ్చే గంటన్నర మొత్తం కిడ్నాపర్ డబ్బులు డిమాండ్ చేయడం, ఆ డబ్బుల కోసం గీత అందరి దగ్గరకు వెళ్లటంతో నడిపి చిన్న ట్విస్ట్ తో శుభం కార్డ్ వేసారు.కథలో చిన్న ట్విస్ట్‌ను నమ్ముకొని దర్శకుడు బటర్‌ఫ్లై సినిమాను తెరకెక్కించాడు అది కూడా పెద్ద సర్ప్రైజింగ్గా అనిపించదు. ఓ టైమ్ లో ఆ చిన్న పాయింట్ కోసం రెండు గంటలు నడిపాడే అనిపిస్తుంది కానీ థ్రిల్లర్ సినిమాల్లో చాలా వాటిల్లో జరిగేది ఇదే కాబట్టి ఓకే అనిపిస్తుంది హీరోయిన్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన విధానం బాగుంది అయితే సెకండాఫ్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే మరింత థ్రిల్లింగ్ సినిమాగా నిలిచేది.
నటీనటుల్లో
ఈ సినిమా మొత్తం అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది అక్క పిల్లలను కాపాడుకోవడానికి తపన పడే పాత్రలో చక్కటి భావోద్వేగాలను పలికించిందనే చెప్పాలి. భూమిక జస్ట్ ఓకే వైజయంతిగా భూమిక క్యారెక్టర్ సెకండాఫ్‌లో తేలిపోయింది రావురమేష్ లాంటి సీనియర్ యాక్టర్ కు పెద్దగా విషయం లేని పాత్ర ఇచ్చారు. కానిస్టేబుల్‌గా ప్రవీణ్ క్యారెక్టర్ మామూలుగా సాగింది అపార్ట్మెంట్ సెక్రటరీ కామెడీ నవ్వించింది.
టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా సినిమాకి తగ్గట్లుగా ఉన్నాయి. స్క్రిప్టు వర్క్ ఇంకాస్త స్ట్రాంగ్ గా చేసి ఉంటే బెస్ట్ థ్రిల్లర్ అనిపించేది ఏదైనా ఉన్న వనరులతో మంచి అవుట్ ఫుట్ ఇచ్చారనే చెప్పాలి డైలాగులు బాగున్నాయి.
చూడచ్చా
థ్రిల్లర్ చిత్రాలు చూసేవారికి, అనుపమ అభిమానులకు ఈ సినిమా బాగానే నచ్చుతుంది. వీకెండ్ కు మంచి కాలక్షేపమే
నటీనటులు :
అనుపమా పరమేశ్వరన్, నిహాల్ కోదాటి, భూమికా చావ్లా, రావు రమేష్, ప్రవీణ్, రచ్చ రవి, ప్రభు, రజిత, వెన్నెల రామారావు, మేఘన, మాస్టర్ దేవాన్షు, బేబీ ఆద్య తదితరులు
సాంకేతికవర్గం :
మాటలు : దక్షిణ్ శ్రీనివాస్
పాటలు : అనంత్ శ్రీరామ్
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
సంగీతం : అర్విజ్, గిడియన్ కట్టా
నిర్మాతలు : రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్ళూరి, ప్రదీప్ నల్లమెల్లి
కథ, కథనం, దర్శకత్వం : ఘంటా సతీష్ బాబు
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2022
రన్ టైమ్ : 136 మినిట్స్
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్