Reading Time: 2 mins

బలగం మూవీ ప్రెస్ మీట్

బలగం సినిమాలో పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకుడు వేణు ఎల్దండి

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా బలగం. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా ఉన్నాయి. త్వ‌ర‌లోనే బలగం సినిమాను రిలీజ్ చేయ‌టానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ బలగం సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్ప‌టికే విడుద‌లైన ఊరు ప‌ల్లెటూరు సాంగ్ పొట్టి పిల్ల సాంగ్‌ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తున్నాయి. సినిమా ఆర్గానిక్‌గా ఆడియెన్స్‌లోకి వెళ్లిపోయింది. వేణు త‌న ఐడియాను ప్రాప‌ర్‌గా మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్‌కి చెప్ప‌టం, అలాగే దానికి అద్భుత‌మైన లిరిక్స్‌ని కాస‌ర్ల శ్యామ్ అందించారు. మంచి సోల్ ఉన్న సాంగ్స్‌ను అందించారు. సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తీ ఒక్క‌రూ ప్రాణం పెట్టి ప‌ని చేశారు. మ‌రో రెండు సాంగ్స్‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తాం. ఆ పాట‌లు వింటే హృద‌యాలు క‌దిలిపోతాయి. అంత గొప్ప‌గా ఉంటాయి పాట‌లు.

ఇప్పుడే ఇంత రెస్పాన్స్ వ‌స్తుంటే రిలీజ్ త‌ర్వాత ఇంకా హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాం. ఇక బలగం సినిమా గురించి చెప్పాలంటే వేణు ముందుగానే ఇందులో క్యారెక్ట‌ర్స్ ఎలా ఉండాలి. అందులో ఎవ‌రు యాక్ట్ చేయాల‌నేది ప్లాన్ చేసుకుని వ‌చ్చి నా ద‌గ్గ‌ర అప్రూవ‌ల్ తీసుకుంటూ వ‌చ్చాడు. ముగ్గురు, న‌లుగురు త‌ప్పితే దాదాపు కొత్త వారినే వేణు యాక్ట‌ర్స్‌గా ఎంపిక చేసుకున్నాడు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ అనే ఐడియా వ‌చ్చిన‌ప్పుడు దీని ద్వారా వీలైనంత మంది కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియ‌న్స్‌ను ప‌రిచ‌యం చేయాల‌నేదే మా ఆలోచ‌న‌. అందులో భాగంగా ముందు వేణు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యాడు. డీజే టిల్లుతో ఫేమ‌స్ అయిన ముర‌ళీధ‌ర్‌గారు ఇందులో హీరోయిన్ తండ్రి పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న పాత్ర అంద‌రికీ గుర్తుండిపోతుంది. త‌ర్వాత హీరో మేన‌త్త పాత్ర‌లో విజ‌య‌లక్ష్మిగారు ఎక్స‌లెంట్‌గా న‌టించారు. ఆమె పాత్ర‌ను చూడ‌గానే మ‌న‌కు మ‌న మేన‌త్త‌లు గుర్తుకు వ‌స్తారు. అలాగే ఐల‌య్య‌గారు వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌గా మ‌న‌కు గుర్తుండిపోతుంది. హీరో తండ్రిగా ఐల‌య్య జీవించారు.

ఇక హీరో ద‌ర్శి గురించి చెప్పాలంటే సెల్ఫీష్ క్యారెక్ట‌ర్‌ను త‌ను క్యారీ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇక హీరోయిన్ కావ్య గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. మా సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ మ‌సూద‌తో ముందుగానే మీ అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యింది. ద‌ర్శి, కావ్య‌.. ఎమోష‌న్స్‌ను చాలా చ‌క్క‌గా క్యారీ చేశారు. వేణు ఇంత మందిని ఎంతో గొప్ప‌గా రాసుకున్నారు. తెలంగాణకి చెందిన ప‌ల్లెటూర్లో జ‌రిగే క‌థ కావ‌టంలో తెలంగాణ‌ క‌ల్చ‌ర్ తెలిసిన చాలా మంది ఈ సినిమాను చూశారు. సినిమా చాలా చాలా బాగుంద‌ని అంద‌రూ అభినందించారు. కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు గుర్తుకు వ‌స్తాయి.అలాగే ర‌వి, కృష్ణ‌తేజ మ‌న‌ల్ని వారి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటారు అన్నారు.

ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దిల్ రాజుగారికి థాంక్స్‌. త్వ‌ర‌లోనే బలగం సినిమాను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం. ఈ సినిమాలో నారాయ‌ణ పాత్ర‌లో ముర‌ళీధ‌ర్‌, హీరో మేన‌త్త పాత్రలో విజ‌య లక్ష్మి, హీరో త‌ల్లి పాత్ర‌లో స్వ‌రూప‌, హీరో బాబాయ్ పాత్ర‌లో మొగిలి ఇలా అంద‌రూ దాదాపు కొత్త వారినే ప‌రిచ‌యం చేశాం. ఇక ఇప్ప‌టికే మా బలగం మూవీ నుంచి విడుదలైన రెండు సాంగ్స్‌కు భీమ్స్‌గారు ఇచ్చిన సాంగ్స్‌, దానికి కాస‌ర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ఎక్స‌లెంట్‌. పాట‌ల‌న్నీ శ్యామ్‌గారే రాశారు. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ జ‌ర్నీలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.

న‌టీన‌టులు :

ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జ‌య‌రాం, విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం :

ఎ దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్
స‌మ‌ర్ప‌ణ‌: శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం: వేణు ఎల్దండి
నిర్మాత‌లు: హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆచార్య వేణు
కథా విస్తరణ – స్క్రీన్ ప్లే: రమేష్ ఎలిగేటి – నాగరాజు మడూరి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిట‌ర్‌: మ‌ధు