బాహుబలి ప్రభాకర్ చిత్రం ప్రారంభం
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో ఆర్.ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం-1 చిత్రం షూటింగ్ ప్రారంభం!!
ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మాతగా `బాహుబలి` ప్రభాకర్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం రూపొందుతోంది.
ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు, నటుడు, దర్శకుల సంఘం అధ్యక్షులు వై కాశీ విశ్వనాథ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా ఫిలిం చాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు బాహుబలి ప్రభాకర్ మాట్లాడుతూ…“రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది అనేది కథాంశం. రెండేళ్ల క్రితం డైరక్టర్ పాలిక్ గారు ఈ కథతో కలిశారు. కరోన వల్ల అప్పుడు కుదర్లేదు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్లీ పాలిక్ గారు ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో నేను హీరో అని చెప్పను కానీ సినిమాకు ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తున్నా“ అన్నారు.
నిర్మాత రావుల రమేష్ మాట్లాడుతూ…“ దర్శకుడు పాలిక్ మా ప్రాతం వ్యక్తి. ఆయన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
కథా రచయిత వింధ్యా రెడ్డి మాట్లాడుతూ…“ పాలిక్ గారు నా గురువు. ఆయన దగ్గర మూడేళ్లుగా రైటర్‌గా శిష్యరికం చేస్తున్నాను. ఈ క్రమంలో ఈ కథ రెడీ చేసి చెప్పాను. వారికి నచ్చడంతో ఇది కార్యరూపం దాల్చుతోంది. నాకు ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు“ అన్నారు.
దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ…“ఆర్.ఆర్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న తొలి చిత్రమిది. ముహూర్తపు షాట్ కి క్లాప్ ఇచ్చిన కాశీ విశ్వనాథ్ గారికి, కెమెరా స్విచాన్ చేసిన ప్రసన్న కుమార్ గారికి నా ధన్యవాదాలు. ఈ కథ నా శిష్యురాలు వింధ్య రెడ్డి ఇచ్చారు. తను చెప్పిన లైన్ తో దీన్నొక సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగా మలిచి తెరకెక్కిస్తున్నాం. ఒక మేజర్ జీవితంలో ఒక నైట్ ఏం జరిగింది అనేది సినిమా స్టోరి. బాహుబలి ప్రభాకర్ గారిని ఇందులో కొత్త కోణంలో… డ్యూయల్ షేడ్ లో చూస్తారు. ఇందులో మూడు పాటలున్నాయి. జాన్ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. అదే స్థాయిలో సురేష్ గంగుల సాహిత్యాన్ని సమకూర్చారు. నాగిరెడ్డి గారి ఎడిటింగ్, మల్లిక్ సినిమాటోగ్రఫీ ఇలా టెక్నికల్ టీమ్ అంతా ఎంతో బాగా కుదిరింది. ఈ నెలాఖరులో షెడ్యూల్ ప్రారంభిస్తాం. తొలి షెడ్యూల్ గోవాలో రెండో షెడ్యూల్ హైదరాబాద్, అరకులో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం“ అన్నారు.
సంగీత దర్శకుడు జాన్ భూషణ్ మాట్లాడుతూ…“మంచి పాటలు రావడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఇప్పటికే రెండు పాటలు కంపోజింగ్ పూర్తయింది. డైరక్టర్ పాలిక్ గారు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల మంచి పాటలు వస్తున్నాయి“ అన్నారు.
చలపతి రావు, సుధ, జీవా, సౌజన్య, శైలజా, అనూషా, పల్లవి, సిద్ధు, కామ్నాసింగ్, చంద్ర సిద్ధార్థ ఆర్క, రాజారాం (రఘు) తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపీః మల్లిక్ కె చంద్ర; సంగీతంః జాన్; స్టంట్ః రామ్ సుంకర; ఎడిటర్ః నాగిరెడ్డి; పాటలుః సురేష్ గంగుల; స్టోరిః వింధ్య రెడ్డి; నిర్మాతః రావుల రమేష్; స్క్రీన్ ప్లే- మాటలు-నృత్యాలు-దర్శకత్వంః పాలిక్