Reading Time: < 1 min
బిక్ర‌మ్ కృష్ణ ఫిలింస్ బ్యాన‌ర్ పై మూడు సినిమాలు నిర్మాణం
 
అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, ప‌లాస 1978 సినిమాల‌కు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి వీర‌భోగ‌వ‌సంత‌రాయ‌లు సినిమాకు నిర్మాత‌గా చేసిన అప్పారావు బెల్లాన త‌న బిక్ర‌మ్ కృష్ణ ఫిలింస్ బ్యాన‌ర్ పై మూడు సినిమాల‌ను నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో మొద‌టి సినిమాను, సువ‌ర్ణ సుంద‌రి ఫేమ్ ఎమ్ ఎస్ ఎన్ సూర్య డైరెక్ష‌న్ లో తెరెకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారర్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొంద‌నుంది. శ్రీలంక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నిర్మాణం కానుంది. ప్ర‌స్తుతం క‌థ చ‌ర్చ‌లు సాగుతున్నాయి.
 
రెండో సినిమాగా క‌లియుగ చిత్ర ద‌ర్శ‌కుడు తిరుపుతిలో నూత‌న న‌టీన‌టుల‌తో ల‌వ్, రివెంజ్, సందేశాత్మ‌క చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని ఈ చిత్రాన్ని నందిమ‌ల్ల షాల‌ని గారితో క‌లిసి నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు.
 
మూడో చిత్రంగా సీనియ‌ర్ న‌టుల‌తో తానే ద‌ర్శ‌కులుగా మారి త‌న స్నేహిత‌ల‌తో క‌లిసి నిర్మించ‌నున‌న్నారు. ఈ చిత్రానికి పోలిస్ ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టి, ద‌శితుల స‌మస్య‌లుపై పోరాట‌లు చేసే న్యాయ‌వాది, ఉత్త‌రాంధ్ర జిల్లాలు ద‌ళిత నాయ‌కులు, మాల మ‌హానాడు వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు అయిన భాగంగోపాల‌రావు పేరును ఈ సినిమాకు టైటిల్ గా పెట్టే ఆలోచ‌న ఉంద‌న్నారు.