బిచ్చగాడు 2 మూవీ రివ్యూ

Published On: May 19, 2023   |   Posted By:

బిచ్చగాడు 2 మూవీ రివ్యూ

Emotional Engagement Emoji 

కెరీర్ లో ఒడిదుడుకులు ఉన్నప్పుడు తమకు గతంలో  హిట్ ఇచ్చిన సినిమా క్రేజ్ ని వాడుకుందామనుకుంటారు. ఆ క్రమంలో ఆ హిట్ కు  సీక్వెల్ లేదా పార్ట్ 2 అనే ట్యాగ్ తగిలించి వదులుతూంటారు. అయితే మొదట పార్ట్ తో పోల్చి చూస్తారనే రిస్క్ ఎప్పుడు ఉంటుంది. అయినా తప్పదు. అలాంటి ఓ ట్రిక్ నే విజయ్ ఆంటోని ప్లే చేసారు. ఎప్పుడో తనకు  తెలుగు, తమిళం లో బాగా పాపులారిటీ సంపాదించి పెట్టిన సినిమా ‘బిచ్చగాడు’ ని అందుకు ఎంచుకున్నాడు. ఎందుకంటే బిచ్చగాడు  తరువాత అతనికి హిట్ అనేదే లేదు, మళ్ళీ ఇప్పుడు అదే పేరుతో అంటే ‘బిచ్చగాడు 2’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని స్పెషాలిటీ ఏంటంటే డైరక్టర్,నిర్మాత కూడా విజయ్ ఆంటోనీ నే. మరి ఈ సినిమా తో అయినా అతను హిట్ ట్రాక్ ఎక్కాడా..ఈ కొత్త బిచ్చగాడు కథేంటి?

స్టోరీ లైన్ :

దేసంలో అత్యంత ధనవంతుల్లో ఏడోవాడు విజయ్ గురుమూర్తి (విజయ్‌ ఆంటోనీ). డబ్బుకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అతనికి యాజ్ యూజువల్ గానే శత్రువులు ఉంటారు. వాళ్లు ఎక్కడో ఉండరు. అతని ప్రక్కనే స్నేహితుడు రూపంలో ఉంటారు. అతనే అరవింద్‌(దేవ్‌ గిల్‌). అవకాసం ఎదురుచూస్తున్న అతన్ని ఓ రోజు ఓ వార్త ఎట్రాక్ట్ చేస్తుంది. అదేమిటంటే బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ ని సక్సెస్ ఫుల్ గా చేసి, ఒకరి మెదుడుని మరొకరుకి పెట్టవచ్చు అనేది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటారు. విజయ్ ని చంపేసి..తమకు అనుకూలంగా ఉండే మరొకరి వ్యక్తి మెదడు తీసుకుని వచ్చి పెట్టాలనుకుంటారు. అలాంటి వ్యక్తి కోసం అన్వేషిస్తూంటారు. ఆ క్రమంలో సత్య (విజయ్ ఆంటోని డబుల్) కనపడతాడు. అతన్ని చంపేసి…అతని మెదుడు తీసుకొచ్చి విజయ్ శరీరంలో పెట్టేస్తారు. అప్పుడు శరీకం విజయ్ ది…బ్రెయిన్ ది సత్యది అన్నమాట. సత్య తమ మాట వింటారని అనుకుంటారు. కానీ చిన్నతనం లో తల్లి తండ్రులకు దూరమై, ఆ తర్వాత తన చెల్లికు దూరమై బాధాకరమైన గతం కలిగి ఉన్న సత్య ఓ రెబెల్ గా ఉంటాడు. అక్కడ నుంచి సమస్యలు మొదలౌతాయి. ఆ సమస్యలు ఏమిటి.. అప్పుడు అరవింద్ ఎలా రియాక్ట్ అయ్యాడు. విజయ్ శరరంలో సత్య మెదుడు ఉందనే విషయం బయిట ప్రపంచానికి తెలిసిందా..ఈ కథలో హేమ(కావ్యా థాపర్‌) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ :

ఈ కథ మనకు కొత్తేమీ కాదు. పూరి జగన్నాథ్, రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఇదే కాన్సెప్టు ఇదే. అయితే ఇక్కడ బిచ్చగాడు వెళ్లి కోటీశ్వరుడు పాత్రలో ప్రవేశిస్తాడు.అయితే ఇక్కడ బిచ్చగాడుకి తనలాంటి మిగతా బిచ్చగాళ్ల మీదా ఆ ప్రపంచం మీదా సానుభూతి ఉంటుంది. దాంతో వాళ్లకు ఏదో చెయ్యాలనే తాపత్రయంలో అతను తీసుకునే నిర్ణయంతో సెకండాఫ్ నడుస్తుంది. అయితే ఇలా సమాజానికి మంచి చేయాలని తిరిగే పాత్రకు కాంప్లిక్ట్స్ అంటే అడ్డంకులు లేకపోతే కథ చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. అదే జరిగింది. ఎక్కడో ప్రీ క్లైమాక్స్ ద్వారా హీరో ఇలా బ్రెయిన్ సర్జరీ తో బయిటకు వచ్చేడనే విషయం బయిట ప్రపంచంలో తెలియదు. అప్పటిదాకా ప్లాట్ గా సాగింది. దానికి తోడు సందేశాలు కూడా కలిపి వండారు.ఆ సీన్స్ విసిగించాయి.  బిచ్చగాళ్లకు సాయిం చేయాలంటూ ‘యాంటి బికిలీ’ అని కాన్సెప్టుని  పెట్టడం పేలలేదు. అయితే చెల్లితో సెంటిమెంట్ సీన్స్ మాత్రం బాగా పండాయి. బాగా పిండారు. చివర్లో కూడా ఆ ఎమోషన్ కు కన్నీళ్లు వస్తాయి. ఇందులో. సెంటిమెంట్ తో పాటు చాలా థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి .కాకపోతే సెంకడాఫ్ లో  సామజిక సేవ, ప్రీచింగ్ ఎక్కువయ్యాయి. బిచ్చగాడుకి స్వయంగా పేదవాళ్ల కష్టం ఎంతలా తెలుస్తుంది అనే విషయం మీద కొంచెం స్పీచ్ లు దంచాడు. అలాంటివి తొలిగిస్తే సెకండాఫ్ మరింత బిగిగా ఉండేది.అలాగే  ‘బిచ్చగాడు’ కి దీనికి ఎటువంటి పోలిక ఉండదు. ఇది దానికి సీక్వెల్ కాదు, ఇది వేరే కథ.

టెక్నికల్ గా :

విజయ్ ఆంటోని కేవలం నటుడుగానే కాకుండా చాలా విభాగాలు చేసారు. కథ అందిస్తూ దర్శకత్వంవహిస్తూ మ్యూజిక్ ఇచ్చారు. చాలా భాగం న్యాయం చేసారు. దర్శకత్వం అయితే  అశలు కొత్తగా చేస్తన్నట్లు అనిపించలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. పాటులు మాత్రం కాస్త కాన్సర్టేషన్ గా చెయ్యాల్సింది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తెలుగు డైలాగులు కూడా ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యాయి.

ఫెరఫార్మెన్స్ వైజ్ :

విజయ్ ఆంటోని   ద్విపాత్రాభినయం బాగా చేసాడు.   కావ్య థాపర్‌ నటనకు పెద్దగా అవకాసం లేదు.   దేవ్‌ గిల్, రాధా రవి, జాన్‌ విజయ్, హరీష్‌ పేరడి అంతా బాగా చేసారు.  యోగిబాబు కామెడీ పెద్దగా నవ్వించలేకపోయింది.

చూడచ్చా :

ఖచ్చితంగా వీకెండ్ కు ఈ సినిమా మంచి కాలక్షేపాన్ని ఇస్తుంది.

నటీనటులు :

విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి, వై.జి. మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు తదితరులు.

సాంకేతికవర్గం :

ఎడిటర్ : విజయ్ ఆంటోనీ
సంగీతం : విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రాఫర్స్ : విజయ్ మిల్టన్, ఓమ్ ప్రకాష్
ఆర్ట్ డైరెక్టర్ : ఆరుసామి
యాక్షన్ : రాజశేఖర్, మహేష్ మాథ్యూ
రచయితలు : విజయ్ ఆంటోనీ, కె పళని, పాల్ ఆంటోని
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని
దర్శకుడు : విజయ్ ఆంటోని
రన్ టైమ్ : 153 మినిట్స్
విడుదల తేదీ :  19, మే 2023.