బుక్కా పకీర్ మూవీ టీజర్ విడుదల
యుక్తా ఆర్ట్స్ పతాకంపై అనిల్, నందిని, హీరోహీరోయిన్లుగా అనిల్ వాటుపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ బుక్క ప కీర్ . పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం జూలై నెలలో ప్రేక్షులముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవలే టిజర్ ను విడుదల చేసింది . ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత అనిల్ వాటుపల్లి మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అన్ని హంగులతో జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము అన్నారు.
నటీనటులు :
అనిల్, నందిని , త్రివేణి, స్వాతి, చిత్రం శ్రీను, వెంకీ రామచంద్ర, రాజేంద్ర ,లోబో
సాంకేతిక వర్గం :
కెమెరా: ఎమ్ ఎస్. కిరణ్ కుమార్
ఎడిట్ :gs స్టూడియోస్
మ్యూజిక్: లలిత్ కిరణ్
ప్రొడ్యూసర్ & డైరెక్టర్: వాటుపల్లి అనిల్