బూట్ కట్ బాలరాజు చిత్రం టీజర్ విడుదల
‘బూట్ కట్ బాలరాజు’ పెద్ద విజయాన్ని సాధించాలి: బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన సోహెల్, శ్రీ కోనేటి, ఎం.డీ పాషా ‘బూట్ కట్ బాలరాజు’ హిలేరియస్ టీజర్
‘బిగ్బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘బూట్ కట్ బాలరాజు’ టీజర్ ని లాంచ్ చేశారు.
‘అనగనగా ఒక రాజు అనేది పాత కథ ఐతే… అనగనగా ఒక బూట్ కట్ బాలరాజుఅనేది కొత్త కథ” అనే వాయిస్ తో మొదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా వుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్, ఎంటర్ టైమెంట్ అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. బూట్ కట్ బాలరాజు పాత్రలో సోహెల్ హైలీ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. సునీల్ తో పాటు ముక్కు అవినాష్, సద్దాం పాత్రలు వినోదాన్ని పంచాయి. మేఘ లేఖ, ఇంద్రజ పాత్రల ప్రజెన్స్ అలరించింది. నేపధ్య సంగీతం వినోదాన్ని రెట్టింపు చేసింది. శ్యామ్ కె నాయుడు కెమరావర్క్ కలర్ ఫుల్, లైవ్లీ గా వుంది. నిర్మాణ విలువలు టాప్ క్యాలిటీలో వున్నాయి. మొత్తానికి హిలేరియస్ టీజర్ ‘బూట్ కట్ బాలరాజు’ పై క్యురియాసిటీని మరింతగా పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. బూట్ కట్ బాలరాజు టీం అందరికీ నా బెస్ట్ విషెస్. సోహెల్ నాకు బిగ్ బాస్ అప్పటినుంచి బాగా తెలుసు. తను ప్రతి సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాతో తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇంద్రజ గారు ఇటు టీవీ, అటు సినిమా రెండిటిలో అలరిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ ని డెవలప్ చేసిన బెక్కం వేణుగోపాల్ గారికి, రచయితలు, ఇందులో నటించిన నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకుడు శ్రీ కోనేటి చేస్తున్న రెండో సినిమా ఇది. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ మీ ప్రోత్సాహం కావాలి” అని కోరారు.
సోహెల్ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. నా ప్రతి సినిమాకి ప్రోత్సహిస్తున్నారు.ఇండస్ట్రీ
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేయడం చాలా అనందంగా వుంది. సోహెల్ కి తగ్గట్టు వుండే కథ ఇది. కథ చాలా వినోదాత్మకంగా వుంటుంది. ఇంద్రజ గారు ఇందులో చాలా కీలక పాత్ర చేస్తున్నారు. ఆ పాత్రని చాలా అద్భుతంగా చేశారు. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధాన్యత వుంటుంది. సునీల్ గారి పాత్ర సెకండ్ హాఫ్ ని మరో స్థాయికి తీసుకువెళుతుంది. నిర్మాత పాషా ఎక్కడరాజీపడకుండా సినిమాని నిర్మించారు. కుటుంబం అంతా కలసి చూడదగ్గ సినిమా ఇది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
దర్శకుడు శ్రీ కోనేటి మాట్లాడుతూ.. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం, ఈ సినిమా వెన్నుముక బెక్కం వేణుగోపాల్ గారు. తర్వాత నిర్మాత పాషా గారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అలాగే నిర్మాత మీదవున్న భారాన్ని సోహెల్ తన మీదకు తీసుకొని నడిపించారు. రాకేశ్, రామ్ ప్రసాద్ మంచి మాటలు రాశారు. మా టెక్నికల్ టీం ఎంత గానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది’ అన్నారు
నిర్మాత పాషా మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడానికి కారణం నా స్నేహితుడు సోహెల్. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఒసేయ్ రాములమ్మలో విజయశాంతి గారిని ఎలా చూశారో.. ఇందులో ఇంద్రజ గారిని అలా చూస్తారు. దర్శకుడు శ్రీ కోనేటి చాలా ప్రతిభవంతుడు. ఈ సినిమా తప్పకుండా పెద్దవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. నా తొలి చిత్రమిది. ప్రేక్షకుల అందరూ తప్పకుండా సపోర్ట్ చేసి మరిన్ని సినిమాలు చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను.
ఇంద్రజ మాట్లాడుతూ.. సినిమా కోసం సోహెల్ చాలా హార్డ్ వర్క్ చేశారు. కెమరా ముందే కాదు వెనుక కూడా ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ చాలా శ్రమించాడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రెండేళ్ళు పాటు ఈ సినిమా కోసం తన జీవితాన్ని కేటాయించారు. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మేఘ చక్కని తెలుగు మాట్లాడుతుంది. చాలా సహజమైన నటనతో ఆకట్టుకుంది. నిర్మాత పాషా గారు చాలా క్యాలిటీగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా అంతా టీం వర్క్. త్వరలోనే సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. మంచి కథ వున్న చిత్రమిది. తప్పకుండా అందరూ ఆదరించాలి’ అని కోరారు.
మేఘ లేఖ మాట్లాడుతూ.. ‘బూట్ కట్ బాలరాజు’ టీజర్ లానే సినిమా కూడా చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. ఈ సినిమాలో పని చేసిన అందరినీ పేరుపేరునా థాంక్స్. నిర్మాత చాలా క్యాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. సోహెల్ వండర్ ఫుల్ కో స్టార్. ఇందులో చాలా మంచి పాత్ర చేశాను. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది’’ అన్నారు. ఈ వేడుకలో సద్దాంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నటీనటులు: సయ్యద్ సోహెల్ ర్యాన్, మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, ‘కొత్త బంగారు లోకం’ వివేక్
రచన, దర్శకత్వం: శ్రీ కోనేటి
నిర్మాత: ఎండీ పాషా
బ్యానర్లు: గ్లోబల్ ఫిల్మ్స్, కథ వేరుంటాది
సహ నిర్మాత: పాండు, మామిడిశెట్టి శ్రీనివాస్
డీవోపీ: శ్యామ్ కె నాయుడు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: విజయ్ వర్ధన్
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికుమార్ పాత్రుడు
కథ: లక్కీ మీడియా యూనిట్
డైలాగ్స్: దుబాసి రాకేష్, ‘జబర్దస్త్’ రాంప్రసాద్
కొరియోగ్రాఫర్లు: ప్రేమ్ రక్షిత్, శేఖర్ విజె, భాను, విజయ్ బిన్ని
పీఆర్వో: వంశీ-శేఖర్