Reading Time: < 1 min

బేబీ మూవీ రిబపప్పా లిరికల్ సాంగ్ రిలీజ్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని సహ నిర్మాత. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదల చేస్తున్న ప్రతి పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.

తాజాగా బేబీ సినిమా నుంచి రిబపప్పా అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఆనంద్, వైష్ణవి, విరాజ్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరిని చూపించారు. ఎదురుగా ఇంతదంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వూఎదసడే హద్దులు దాటే చూడూ చూడూకుదురుగా ఉందామన్నా ఉంచట్లేదే నన్నే నువ్వుఅంటూ ప్రేమ చేసే మాయను వర్ణిస్తూ సాగుతుందీ పాట. ఈ పాటకు విజయ్ బుల్గానిన్ మరో బ్లాక్ బస్టర్ ట్యూన్ అందించగాసురేష్ బనిశెట్టి సాహిత్యాన్ని రాశారు. సాయి కృష్ణ పాడారు. ఈ పాట సినిమాకు మరో హైలైట్ అవుతుందంటున్నారు చిత్రబృందం

నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష

సాంకేతికవర్గం :

సంగీతం : విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్ః విప్లవ్ నైషధం
సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి
నిర్మాతః ఎస్.కే.ఎన్
రచన, దర్శకత్వం : సాయి రాజేశ్