బొంబాట్‌ చిత్రం లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల

Published On: June 6, 2020   |   Posted By:

బొంబాట్‌ చిత్రం లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల 

బొంబాట్‌` రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ‌’ విడుద‌ల

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తున్న చిత్రం `బొంబాట్`. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ‌’ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు.

‘‘బుద్ధిగా కలగన్నాబుజ్జిగా ఎదపైన  సర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిరా అన్నీ దిక్కులలోన ఆక్సిజన్ జడివాన … స్వామినాథ’’ అంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ లవ్ సాంగ్. ఈ పాట‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి రాయ‌గా జోష్‌.బి సంగీతం అందించారు. చందన బాల కల్యాణ్, కార్తీక్, హరిణి ఇవటూరి పాటను ఆలపించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్  చేస్తున్నారు.