Reading Time: < 1 min

భజే వాయు వేగం సినిమా టీజర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ కానున్న యువి క్రియేషన్స్ సమర్పణలో హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న భజే వాయు వేగం సినిమా టీజర్

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా భజే వాయు వేగం. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇవాళ భజే వాయు వేగం సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 2.25 నిమిషాలకు మెగాస్టార్ ఈ టీజర్ రిలీజ్ చేస్తారు. భజే వాయు వేగం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు  :

కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్ :

ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు)  రధన్
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి