భజే వాయు వేగం సినిమా థ్యాంక్స్ మీట్
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రీసెంట్ గా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “భజే వాయు వేగం” సినిమా అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా
డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాకు మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మంచి సినిమా తనను తానే నిలబెట్టుకుంటుంది. తనను తానే ప్రూవ్ చేసుకుంటుంది అనేందుకు ఈ సినిమా ఫలితమే నిదర్శనం. టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.
బీజీఎం అందించిన కపిల్ కుమార్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమా మా టీమ్ అందరికీ ఎన్నో మంచి ఎక్సీపిరియన్స్ లు మిగిల్చింది. ఈ టీమ్ లో చివరగా జాయిన్ అయ్యింది నేనే. ఆరు నెలల పాటు ఈ సినిమా బీజీఎం కోసం వర్క్ చేశాం. దర్శకుడు ప్రశాంత్ నేను రోజూ బీజీఎం ఎలా ఉండాలో డిస్కస్ చేసుకుని డిజైన్ చేశాం. ప్రశాంత్ తన కథకు బీజీఎం ఎలా ఉండాలో చాలా క్లియర్ గా చెప్పేవాడు. “భజే వాయు వేగం” సినిమాకు మ్యూజిక్ కు మంచి పేరు రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.
ఎడిటర్ సత్య జి మాట్లాడుతూ – నేను, డైరెక్టర్ ప్రశాంత్ ఫ్రెండ్స్. యూవీలో రన్ రాజా రన్ నుంచి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఎడిటర్ గా, ప్రశాంత్ డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ సినిమా చేసి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది. “భజే వాయు వేగం”తో డైరెక్టర్ గా ప్రశాంత్ కు హిట్ రావడం నాకు ఆనందాన్నిచ్చింది. మా అందరికీ సపోర్ట్ ఇచ్చిన యూవీ సంస్థకు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
యాక్టర్ రాహుల్ టైసన్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సక్సెస్ తో కార్తికేయ హీరోగా వంద అడుగులు ముందుకు వేశాడని భావిస్తున్నా. అతనికి మరిన్ని విజయాలు రావాలి. దర్శకుడు ప్రశాంత్ ప్రతిభకు దక్కిన చిన్న విజయమిది. ఆయన ఇంకా పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆయనకు మెసేజ్ లు పంపించేవాడిని. నీలో చాలా టాలెంట్ ఉంది. దర్శకుడిగా ఎదుగుతావు అని. ఎందుకంటే ప్రతి క్రాఫ్ట్ లో అతనికి పట్టు ఉంది. చాలా కన్విక్షన్ తో మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమాలో కార్తికేయ నేను ఎలాంటి బేషజాలు లేకుండా కలిసి నటించాం. అందుకే స్క్రీన్ మీద మీకు అంత సహజంగా సీన్స్ వచ్చాయి. కపిల్ మ్యూజిక్, సత్య ఎడిటింగ్, మధు శ్రీనివాస్ డైలాగ్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నాకు ఇలాంటి మంచి మూవీలో అవకాశం ఇచ్చిన యూవీ సంస్థకు థ్యాంక్స్. “భజే వాయు వేగం” సినిమా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ – “భజే వాయు వేగం” మంచి సినిమా కాబట్టే ప్రేక్షకులు తమ మౌత్ టాక్ తో అందరికీ తెలిసేలా చేశారు. మా సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ కు థ్యాంక్స్. మూవీ షూటింగ్ లో మా డైరెక్షన్ టీమ్ ఇచ్చిన సహకారం మర్చిపోలేను. మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. యూవీ వంశీ అన్న ప్రమోద్ అన్న విక్కీ అన్నకు థ్యాంక్స్. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే భావిస్తున్నా. ఈ ప్రాజెక్ట్ లో ఫస్ట్ జాయిన్ అయ్యింది డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ అన్న. స్టోరీ డిస్కషన్ నుంచి సినిమా రిలీజ్ ముందు ప్రింట్స్ పంపించే టైమ్ లో చేసిన డైలాగ్ కరెక్షన్స్ వరకు నాతో ట్రావెల్ అయ్యారు. నా ఫ్రెండ్ సత్య. ఈ సినిమాకు కొన్ని వెర్షన్స్ ఎడిట్ చేయించా. ఎంతో పేసీగా సినిమాను ఎడిట్ చేశాడు. బీజీఎఎం చేసిన కపిల్ మా టీమ్ లో చివరగా జాయిన్ అయ్యి బెస్ట్ వర్క్ ఇచ్చాడు. రాహుల్ మా టీమ్ లో యాడ్ అవడం ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్యను ట్రైలర్ లో ఎందుకు చూపించలేదో మీకు సినిమా చూశాక అర్థమై ఉంటుంది. ఆమె కూడా అర్థం చేసుకుని మాకెంతో సపోర్ట్ చేసింది. ఐశ్వర్యకు థ్యాంక్స్. హీరో కార్తికేయ నన్ను ఎంతో నమ్మి ఈ సినిమాలో నటించాడు. ఒక్క రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ తన సపోర్ట్ ఈ మూవీకి ఎంతో ఉంది. కార్తికేయ లాంటి మంచి హీరోయిక్ పర్సనాలిటీ ఉన్నా ఆయన టోన్ డౌన్ చేసి సినిమాకు ఎంత కావాలో అంతే చూపించాను. రవిశంకర్, భరణి గారు ఇవాళ ట్రావెలింగ్ లో ఉండి సక్సెస్ మీట్ కు రాలేకపోయారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ లకు మంచి పేరొచ్చింది. కార్తికేయ లాంటి హీరో కొత్త దర్శకుడికి దొరికితే ఆ కంఫర్ట్ వేరేలా ఉంటుంది. అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమా నాకు హీరోగా ఎంతో సంతృప్తినిచ్చింది. ఎలాంటి సినిమా చేయాలి అని అర్థం కాని టైమ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నాకు దారి చూపించడం తో పాటు విజయం అనే టార్చిలైట్ ఇచ్చాడు. ఏడాది టైమ్ లో రెండో సక్సెస్ అందుకున్నా. బెదురులంక తర్వాత “భజే వాయు వేగం” విజయాన్ని ఇచ్చింది. గతంలో నా గురించి రాసేప్పుడు మరో అపజయం అందుకున్నాడు అని రాసేవారు. ఇప్పుడు అనదర్ హిట్ అని రాస్తున్నారు. అవి చూస్తుంటే హ్యాపీగా ఉంది. “భజే వాయు వేగం” రిలీజ్ అయ్యాక మా డైరెక్టర్ ప్రశాంత్ కలెక్షన్స్, షోస్ పెరగడం గురించి మాట్లాడుతుంటే నేను రిలాక్స్ అవుతూ ఉండేవాడిని. అవేమీ నేను పట్టించుకోలేదు. ఒక మంచి మూవీ చేశాం అనే సంతృప్తి నాకు మిగతా అన్నింటికన్నా హ్యాపీనెస్ ఇచ్చింది. ఒక మంచి సినిమా అవుతుందని మేము “భజే వాయు వేగం” మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఇకపై నేను చేసే సినిమాలు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటా. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్లీ మరో మంచి సినిమా చేశావంటూ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ చెబుతున్నారు. “భజే వాయు వేగం” సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ప్రతి స్టేజ్ లో మూవీ బెటర్ అవుతూ, మా నమ్మకం పెరుగుతూ వచ్చింది. అది ఇవాళ థియేటర్స్ లో ఆదరణ రూపంలో కనిపిస్తోంది. నాతో కలిసి నటించిన ఐశ్వర్య, రాహుల్, డైరెక్టర్ ప్రశాంత్, యూవీ బ్యానర్, మా మూవీ టీమ్ మెంబర్స్ అందిరికీ థ్యాంక్స్. అన్నారు.