Reading Time: 2 mins

భరతనాట్యం మూవీ ఫస్ట్ లుక్ విడుదల

సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర, పాయల్ సరాఫ్, పీఆర్ ఫిలిమ్స్ భరతనాట్యం ఫస్ట్ లుక్ విడుదల

పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే, తనతొలి సినిమా దొరసాని తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. సూర్య తేజ హీరోగా నటించడమే కాకుండా, దర్శకుడు కెవిఆర్ మహేంద్రతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ కూడా రాశారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్.

మేకర్స్ ఈరోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేసారు. ఈ చిత్రానికి భరతనాట్యం అనే క్లాసిక్ టైటిల్‌ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యూనిక్ గా డిజైన్ చేశారు. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్అనేది క్యాప్షన్. టైటిల్‌పై బ్లడ్ మార్క్స్ గమనించవచ్చు.

పోస్టర్‌లో సూర్య తేజ షేడ్స్‌తో ట్రెండీ, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అతన్ని పూలతీగ చుట్టుకోవడం ఆసక్తికరంగా వుంది. పోస్టర్ ప్లజెంట్ బ్యాగ్డ్రాప్ లో వుంది. చిత్రంలోని ప్రముఖ తారాగణం- మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీని కూడా పోస్టర్ లో కనిపించారు. చాలా మంది ప్రముఖ హాస్యనటులు నటిస్తున్న ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని భరోసా ఇచ్చింది.

ట్యాగ్‌లైన్ సూచించినట్లుగా భరతనాట్యానికి సినిమా కనెక్షన్ ఉంది. పోస్టర్‌లోని తుపాకీ సినిమా క్రైమ్ సైడ్‌ను సూచిస్తోంది. ఓవరాల్‌గా ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్‌ని కలిగించింది. అయితే ఈ సినిమాకు భరతనాట్యం అనే క్లాసిక్ టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే టీజర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

భరతనాట్యం షూటింగ్ మొత్తం పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో యువ, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు

వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రాఫర్. రవితేజ గిరిజాల ఈ చిత్రానికి ఎడిటర్. త్వరలోనే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు మేకర్స్.

నటీనటులు :

సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్ బాలకృష్ణ

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర
నిర్మాత: పాయల్ సరాఫ్
కథ: సూర్య తేజ ఏలే
స్క్రీన్ ప్లే & డైలాగ్స్: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: వెంకట్ ఆర్ శాకమూరి
ఎడిటింగ్: రవితేజ గిరిజాల