జయమ్మ పంచాయితీ మూవీ రివ్యూ

Published On: May 10, 2022   |   Posted By:

జయమ్మ పంచాయితీ మూవీ రివ్యూ

రివ్యూ: జయమ్మ పంచాయితీ

Emotional Engagement Emoji (EEE)

👍

చిన్న సినిమాలు ఒక్కోసారి ఊహించని స్దాయిలో పెద్ద హిట్ కొడతాయి. చిన్న సినిమా అయినా కంటెంట్ బలంగా ఉంటే నిలబడిపోతుంది. అందులోనూ ఓటిటిలు వచ్చాక చిన్న సినిమాలకు కాస్తంత ఊపు వచ్చింది. కాస్తంత తెలిసున్న మొహాలు ఉంటే మినిమం వచ్చేస్తుందనే నమ్మకం. వీటిన్నటినీ పరిగణనలోకి తీసుకునే దర్శక,నిర్మాతలు ధైర్యం చేసి చిన్న సినిమాలు తెరకెక్కిస్తూంటారు. అయితే ఆ మ్యాజిక్ ఎప్పుడో కానీ జరగదు. అలా ధైర్యం చేసి వచ్చిన చిత్రమే జయమ్మ పంచాయితీ. సుమ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఆ బజ్ ని సినిమా క్యాష్ చేసుకోగలిగిందా…సినిమాని నిలబెట్టే సత్తా కంటెంట్ లో ఉందా వంటి విషయాలు చూద్దాం.

Story line:
జ‌య‌మ్మ (సుమ‌) ది శ్రీకాకుళం జిల్లా పాలకొండ దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అక్కడ తన భర్త(దర్శకుడు దేవి ప్రసాద్), ఇద్దరు ఆడపిల్లలతో ప్రశాంతమైన జీవితం సాగిస్తూ ఉంటుంది జయమ్మ. అలాగే జయమ్మది కొంచెం భోళాత‌నం.. మ‌రికొంచెం జాలిగుణం మొండిత‌నం కల మనస్తత్వం. ఆమె అంటే ఊరి జనాలకు కూడా భయం. భర్త మంచితనంతో, అడిగిన వారికి కాదనకుండా చేసే సాయాలతో ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని చిరవరు కౌలుకి పొలం చేస్తూ బండి లాగుతూంటారు. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకున్న టైమ్ లో
పెద్ద కుమార్తె పుష్పవతి అయిన టైమ్ లోనే భర్తకు గుండె జబ్బు ఉన్న సంగతి బయిటపడుతుంది. ఆపరేషన్ కు నాలుగు లక్షలు దాకా ఖర్చు అవుతుంది. చేతిలో పైసా లేదు. అప్పుడో ఆలోచన చేస్తుంది.

కుమార్తె పుష్పవతి ఫంక్షన్ రోజున తమ ప్రాంతంలో ఎంతో కాలంగా వస్తున్న చదివింపులు కార్యక్రమంతో వచ్చిన డబ్బుతో భర్త గుండె ఆపరేషన్ చేయిద్దామనుకుంటుంది. అయితే ఆమె అంచనా తప్పుతుంది. ఆమె ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో డబ్బు రాక పోవడంతో భర్తను కాపాడుకోవడం వేరే దారిలేక ఈ స‌మ‌స్య తీరాలంటే పంచాయితీకి వెళ్లాల్సిందే అని నిర్ణ‌యిస్తుంది. తను చేత సాయిం పొందన వాళ్లు , వాళ్ల పంక్షన్స్ కు పెట్టుబడి పెట్టించుకున్న వాళ్లు తిరిగి డబ్బులు ఇవ్వాలని అడుగుతుంది. తిరిగి సాయం చేయ‌క‌పోతే మాత్రం ఊరుకోనని చెప్పేస్తుంది. కానీ పంచాయితేమో వేరే స‌మ‌స్య‌తో త‌ల‌మున‌క‌లై ఉంటుంది. కానీ జ‌య‌మ్మ పట్టుబడుతుంది. తన సమ‌స్య‌కి ప‌రిష్కారం దొరికేదాకా పోరాడుతుంది. ఎక్కడెక్కడి వాళ్లను కదిలిస్తుంది. డబ్బులు పోగేస్తుంది. తన భర్తను అనారోగ్యం నుంచి బయిటపడేస్తుంది. ఆ సంఘటనలు చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా కథ.

Screenplay Analysis:
భర్తను బతికించుకోవడం కోసం జయమ్మ పెట్టిన పంచాయితీ ఏమైంది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్. అయితే జయమ్మ పంచాయితీ ఇంటర్వెల్ నుంచి మొదలవుతుంది. గుండె జబ్బుతో బాధ పడుతున్న జయమ్మ భర్త బతికించుకోవటం కోసం చేసే ప్రయత్నం సబబుగానే ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్ లో జరిగే విషయాలే ఇబ్బందిగా ఉంటాయి. ఆమెకు డబ్బు కోసం ఆ ఊరి పూజారి పెళ్లి, తన కూతురు ప్రేమ కథ, మధ్యలో నక్సలైట్స్ వ్యవహారం విసుగ్గా ఉంటాయి. ఇంటర్వెల్ దాకా కథ పరుగెడుతుంది. అక్కడ నుంచి కథ డ్రాప్ అవటం మొదలవుతుంది. ఎందుకంటే ఆ పంచాయితీలో జరగాల్సిన ఫన్ జరగలేదు. కావాల్సిన సీన్స్ పడలేదు.

మెలిక బాగుంది కానీ దాన్ని విడితీసే నైపుణ్యం రచయిత,దర్శకుడు దగ్గర కొరవడింది. సైటర్ గా నడవాల్సిన కథ సెకండాఫ్ లో పూర్తిగా సీరియస్ అయ్యిపోయింది. ముఖ్యంగా రెండు లవ్ స్టోరీ లు విసిగిస్తాయి. ఎక్కడా కథను పరుగెట్టించవు. దానికి తోడు దళిత పూజారి కథ ఒకటి …ఇలా కథకు సంభంధం లేని ట్రాక్ లు సినిమాని ఇబ్బందిగా మార్చేసాయి. ఏదైమైనా ఎంచుకున్న ఎత్తుగడ బాగుంది కానీ ట్రీట్మెంట్ ,స్క్రీన్ ప్లే కుదరలేదు. అయితే చదివింపులు (ఈడ్లు) కోసం సుమ చేసే హంగామా, త‌న‌కి స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ఆదుకోవాల్సిందే అని పంచాయితీలో వాదించే వైనం మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది.

Analysis of its technical content:

దర్శకుడు మాత్రం శ్రీకాకుళం జిల్లా నేప‌థ్యంలో సాగే ఈ గ్రామీణ క‌థ ని ఆ ఊరుకి వెళ్లిన ఫీల్ తీసుకురాగలిగారు. ఆ వాతావ‌ర‌ణాన్ని అత్యంత స‌హ‌జంగా క‌ళ్ల‌కు క‌ట్టిన చిత్ర‌మిది. అయితే ఈ కథ ఏ కాలంలో జరుగుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ప‌ల్లెటూరులు ఉన్నాయా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మూఢ న‌మ్మ‌కాలు, అస‌మాన‌త‌ల వంటి ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఒకేసారి చూపించాలనే ఉత్సాహం ముంచేసింది. ముఖ్యంగా ఇన్నాళ్లుగా యాంకర్ గా సుమను చూసిన మనకు ఆమె ప్ర‌భావం ఏమాత్రం లేకుండా జ‌య‌మ్మ పాత్రని డిజైన్ చేసిన విధానం బాగుంది.

ఇక ఈ సినిమాలో మెయిన్ హైలెట్ కెమెరా వర్క్. చుట్టూ కొండలతో ప్రకృతి తో కూడిన అందాలను సినిమాటోగ్రాఫర్ అనూష్ కుమార్ చాలా బాగా చూపించారు. అలాగే సినిమాకి సంగీతం అందించిన కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. చిన్న సినిమాని రిచ్ గా నిర్మించారు. ఎడిటింగ్ విషయంలో మాత్రం కాస్త నిరాశే. సెకండాఫ్ బోర్ కొట్టకుండా లెంగ్త తగ్గించవచ్చు అనిపించింది.

నటీనటుల్లో జ‌య‌మ్మ పాత్ర‌కి సుమ ఫెరఫెక్ట్ ఛాయిస్. అక్కడ మహిళగా ఒదగటంతో పాటు శ్రీకాకుళం యాసని ప‌లికిన తీరు కూడా మెప్పిస్తుంది. జ‌య‌మ్మ భ‌ర్త‌గా దేవిశ్రీప్ర‌సాద్ బాగా చేసారు. మిగిలిన‌వాళ్లల్లో ఎక్కువ‌గా రంగ‌స్థ‌ల క‌ళాకారులే. స‌హ‌జంగా చేసారు. జబర్దస్త్ త్రినాథ్ సినిమాని చాలా భాగం సుమ తర్వాత మోసారు.

ప్లస్ లు

+ ప్రధాన పాత్రకు సుమని ఎంచుకోవటం

+ గ్రామీణ నేప‌థ్యం

+ ఫస్టాఫ్ లో ఫన్

మైనస్ లు

– సబ్ ప్లాట్ లు ఎక్కువైపోవటం

– లవ్ ట్రాక్ లు విసిగించటం,

సెకండాఫ్ లెంగ్త్

CONCLUSION:

మరీ తీసి పారేయదగ్గ సినిమా కాదు.ఓటీటిలో రిలీజైతే ఇబ్బంది లేకుండా చూడచ్చు. పనిగట్టుకుని వెళ్ళలేము

Movie Cast & Crew

నటీనటులు: సుమ, దేవి ప్రసాద్‌, దినేశ్‌ కుమార్‌, షాలిని జోయ్‌, నిఖిత తదితరులు;
సంగీతం: ఎం.ఎం.కీరవాణి;
ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల;
సినిమాటోగ్రఫీ: అనుష్‌ కుమార్‌;
నిర్మాత: బాలగ ప్రకాశ్‌, అమర్‌-అఖిల్‌;
రచన, దర్శకత్వం: విజయ్‌ కలివరపు;
Run time: 2h 5m
విడుదల: 06-05-2022