భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ ప్రెస్ మీట్
భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా చూసి మీరొక క్రేజీ ఫీలింగ్ తో బయటకు వస్తారు – శివ కందుకూరి
యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భూతద్ధం భాస్కర్ నారాయణ. ఈ సినిమాను స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 31న రిలీజ్ కానుంది. అందులో భాగంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్రబృందం.
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ
ఇక్కడికి వచ్చిన మీడియాకి థాంక్యూ. నాకు మంచి రోల్ ఇచ్చారు సినిమాలో, మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ షూటింగ్ ఒక పిక్నిక్ లా అనిపించింది. ఈ స్టోరీ వినగానే ఈ కేరక్టర్ ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. ఈ సినిమా మార్చ్ 31న రిలీజ్ కానుంది. ఖచ్చితంగా చూస్తారని ఆసిస్తున్నా.
డైరెక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ
ముందుకు నా తల్లి తండ్రులకు, మీడియాకు థాంక్స్. ఈ కథ రాయడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ అన్న. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా అయిపోయాక, డిటెక్టివ్ బాబీ అని ఒక కథ కావాలి అన్నాడు. ఈ విషయం నాకు మా రూమ్మెట్ చెప్పగానే ఒక డిటెక్టివ్ స్టోరీ రెడీ చేసాను. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. మా హీరో శివ కందుకూరి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్.ఆయన ఒక అసోసియేట్ డైరెక్టర్ లా హెల్ప్ చేసాడు. 31st మార్చ్ ఈ సినిమా రాబోతుంది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా.
ప్రొడ్యూసర్ స్నేహాల్ మాట్లాడుతూ
హీరో తేజ గారికి, నిర్మాత రాహుల్ యాదవ్ గారికి థాంక్యూ అండి.
ఈ పూర్తి స్క్రిప్ట్ ను నాకు డైరెక్టర్ ముందే పంపించాడు శశిధర్, కార్తీక్ నేను 150 పేజిస్ వరకు చదివి ఇది చెయ్యాలని ఫిక్స్ అయిపోయాం.
డైరెక్టర్ పురుషోత్తం వెరీ టాలెంటెడ్, తరువాత మేము ఒక టీం ను బిల్డ్ చేసి ఈ సినిమాను పూర్తిచేసాం. 31st మార్చ్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు థాంక్యూ. ఈ రోజు కోసం చాలారోజులు వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ టీజర్ ను బిగ్ స్క్రీన్ పై చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన అందరు మాకు ఒక ఫ్యామిలీ లాంటివారు. మా ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ఔట్పుట్ కోసం చాలా ఖర్చుపెట్టారు. హీరో తేజ సజ్జ, నిర్మాత రాహుల్ యాదవ్, హీరో తిరువీర్ కి కృతజ్ఞతలు తెలిపాడు. ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఒక మంచి సినిమాను మీకు ఇవ్వబోతున్నాం. ఈ సినిమా చూసి మీరొక క్రేజీ ఫీలింగ్ తో బయటకు వస్తారు.
ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ మాట్లాడుతూ
ఈ సినిమాను ఇంటరెస్ట్ తో ప్యాషన్ ఈ సినిమాను చేసారు. నాకు తెలిసిన వాళ్ళందరూ ఈ స్క్రిప్ట్ చదివారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత నాకు ఆ విషయం తెలిసింది. ఫాంటాస్టిక్ టీం ఉంటె అద్భుతమైన మూవీ వస్తుంది. అందరికి కంగ్రాట్స్. థాంక్యూ.
హీరో తేజ సజ్జ మాట్లాడుతూ
ముందుగా సీనియర్ నటి జమున గారికి సంతాపం తెలిపారు.
ఈ సినిమా టీజర్ చూసి నేను ఈ ఈవెంట్ కి వచ్చాను. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ స్నేహల్,శశిధర్, కార్తీక్ ఇంకా మీరెన్నో మంచి సినిమాలు చెయ్యాలి. కొత్తవాళ్లు ఎక్కడున్నా రాజ్ కందుకూరి గారు ఎంకరేజ్ చేస్తారు. అలానే ఈ సినిమా చూడండి నచ్చితే ఒక పదిమందికి చెప్పండి.