Reading Time: < 1 min
మణిచందన నిత్యావసర సరుకుల పంపిణీ
 
అందరూ దీవిస్తుంటే..మనసుకి తృప్తిగా ఉంది : మణిచందన
 
లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది పలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో  సీనియర్ నటి మణిచందన తనవంతు సాయాన్ని అందిస్తున్నారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఈ సాయాన్ని మూడు రోజులు కొనసాగిస్తున్నాం.   శనివారం పలువురికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  కాగా  ఈరోజు అనగా ఆదివారం జీహెచ్ ఎంసీలో ఉండే మున్సిపల్ కార్మికులు రెండు వందల మందికి నిత్యావసర సరుకుల ను అందించాం.  మనసుకి చాలా సంతోషంగా ఉందని..ఎంతో మంది ఈ లాక్ డౌన్ వల్ల ఫుడ్ లేక బాధపడుతున్నారు..అలాంటి వారికి మాకు చేతనైనంత సాయం చేస్తున్నాం..ఈ సాయం వెనుక నా భర్త సపోర్ట్ చాలా ఉంది. ఇలా ఫుడ్ తీసుకున్నవారందరూ మా ఫ్యామిలీ చల్లగా ఉండాలని దీవిస్తుంటే మనసుకి చాలా తృప్తిగా అనిపించింది” అని మణిచందన తెలిపారు.