మనం సైతం సేవా సమరం
వరుస సేవా కార్యక్రమాలతో పేదల పక్షాన సేవా సమరం చేస్తోంది మనం సైతం. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవా సంస్థ క్రమం తప్పకుండా అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. వివిధ సమస్యల్లో చిక్కుకున్న పేదలను మనం సైతం సభ్యులు ఆదుకుంటూ మానవతను చాటుతున్నారు. పట్టువదలకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది మనం సైతం. సోమవారం హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో పది మంది పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వీరిలో విద్యా, వైద్యం, క్రీడలు వంటి వివిధ అవసరార్థులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ రామ్మోహన్ రావు, దర్శకులు దశరథ్, న్యూస్ రీడర్ దీప్తీ వాజ్ పేయి, పాత్రికేయులు సాయి, మనం సైతం సభ్యులు బందరు బాబీ, అనిల్ కుమార్, వినోద్ బాలా, సురేష్, కవిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పేదలకు చెక్ లు అందజేశారు.
అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…పరిశ్రమలో సుదీర్ఘ అనుభవాన్ని చూశాను. టీవీ కార్యక్రమాల నిర్వహణలో ఆర్థికంగా నష్టపోయాను. నా పక్కన నిలబడతారు అనుకున్న కొందరు కావాల్సిన సమయంలో దూరంగా వెళ్లారు. వీళ్లందరితో నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పుస్తకంగా రాద్దామనుకున్నాను. కానీ అలా చేస్తే అంత మందికి దూరం అవ్వాల్సి ఉంటుంది. మరో వైపు చూస్తే లక్షలాది మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నేను ఎదుర్కొన్న బాధల కోపం, కసి , ప్రతీకారం, ఆవేదనకు మరో కోణంలో మొదలైందే మనం సైతం. నేను చేస్తున్నది ఏపాటి సాయమైనా వాళ్లకు ధైర్యాన్ని అందిస్తున్నాం. మేము అందిస్తున్న సాయానికి ఎన్నో రెట్లు దీవెనలు పొందుతున్నాం. ఇవాళం పదిమంది పేదలకు అతిథుల చేతుల మీదుగా చెక్ లు అందిస్తున్నాం. ఈ పెద్దల వల్ల మా సంస్థకు మరింత ప్రాచుర్యం వచ్చి మనం సైతం బిడ్డ ఆయుష్షు పెరుగుతుందని ఆశిస్తున్నాను. మా బృందం ఏడుగురితో మొదలైన మనం సైతం ఇవాళ లక్షా డైబ్భై వేల మంది సభ్యులను సంపాదించుకుంది. ఈ సంస్థ పేదల గుండెల్లోకి ఎంతగా వెళ్లిందంటే, మంత్రి గారు లక్ష్మారెడ్డి నియోజకవర్గం జడ్చర్లకు వెళ్తే…అక్కడ దాదాపు 70 మంది యువత వచ్చి మనం సైతం జడ్చర్ల శాఖ పెడతాం అన్నారు. అంతకంటే గర్వం ఇంకే కావాలి. అన్నారు.
ఎఫ్ డీసీ ఛైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ…ఇంత గొప్పసేవా కార్యక్రమం చేస్తున్న కాదంబరి కిరణ్ కు అభినందనలు. పేదలకు డబ్బులు ఇవ్వడమే కాదు ఆత్మీయత పంచుతున్నారు. అవసరం ఉన్న వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆదుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ అంటే పోటీ. ఇక్కడ నిత్యం పరుగులు పెట్టాలి. అవన్నీ వదిలేసి పేదలకు సేవ చేయడం ఎంతో కష్టమైన పని. చిత్ర పరిశ్రమలో కొన్ని విభాగాల కార్మికులకు ఆరోగ్య బీమా సౌకర్యం లేదు. అలాంటి శాఖల కార్మికులకు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి సగం ఖర్చు మినహాయింపుతో ఆరోగ్య బీమా అందజేస్తామని ఈ సందర్భంగా చెబుతున్నాను. అలాగే చిత్ర పురి కాలనీలో ఒక వైద్యశాల నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. పేద సినీ కార్మికులకు వైద్యం అందజేసేందుకు కృషి చేస్తాం అన్నారు.
శ్వేతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ….మనం సైతం కార్యక్రమానికి వచ్చాక మానవత్వం ఇంకా మిగిలి ఉందని అనిపిస్తోంది. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తున్నా…అందరికీ చేరువ కావడం కష్టం. అలాంటి సందర్భంలో మనం సైతం లాంటి సంస్థల అవసరం ఎంతైనా ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలి. కాదంబరి గారికి నా తరపున ప్రశంసలు తెలియజేస్తున్నాను అన్నారు.
మనం సైతం సాయం పొందిన పేదలు..ఈశ్వరమ్మకు ఆరోగ్యం – రూ. 25 వేలుహెయిర్ డ్రెస్సర్ పి జయ, ఆరోగ్యం – రూ. 20 వేలు, బీఎన్ రేఖ, విద్య – రూ.20 వేలుచల్లా పవన్ కుమార్, – క్రీడలు రూ. 25 వేలుకో డైరక్టర్ ఉమా మహేశ్వరరావు, – ఆరోగ్యం, రూ. 25 వేలుప్రొడక్షన్ మేనేజర్ బత్తుల హరిబాబు, – ఆరోగ్యం రూ. 25 వేలులైట్ మేన్ వేణుగోపాల్, విద్య – రూ.10 వేలుసినీ మేనేజర్ ఆర్ మురళీ కృష్ణ, ఆరోగ్యం – రూ. 25 వేలుపొట్టి జానీ, ఆరోగ్యం – రూ.10 వేలుడ్రైవర్స్ యూనియన్ వెంకట లక్ష్మి