మరో ప్రస్థానం మూవీ గురించి హీరోయిన్ ముస్కాన్ సేథి

Published On: September 20, 2021   |   Posted By:

మరో ప్రస్థానం మూవీ గురించి హీరోయిన్ ముస్కాన్ సేథి

 

మరో ప్రస్థానం” నాకు ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది – హీరోయిన్ ముస్కాన్ సేథి


“పైసా వసూల్”, “రాగల 24 గంటల్లో” చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న అందాల నాయిక ముస్కాన్ సేథి. సినిమాలతో పాటు బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ముస్కాన్ సేథి “మరో ప్రస్థానం” సినిమాలో తనీష్ సరసన నటించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దర్శకుడు జాని తెరకెక్కించారు. ఇటీవలే రిలీజైన “మరో ప్రస్థానం” సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది.

ఈ నెల 24న అమెరికా సహా వరల్డ్ వైడ్ గా “మరో ప్రస్థానం” మూవీ థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా..

హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ… “మరో ప్రస్థానం” నా కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని చెప్పగలను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. కొన్ని సీన్స్ లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్ లో కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ కథ విషయానికి వస్తే.. రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఈ కథ అంతా రెండున్నర గంటల్లో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే కథ 9.30 గంటలకు ముగుస్తుంది. రీల్ టైమ్ రియల్ టైమ్ ఒకటే కావడం మరో ప్రస్థానం మూవీ ప్రత్యేకత. ఈ కథ తెరపై ఎంత టైమ్ లో సాగుతుందో సరిగ్గా అదే టైమ్ కు ఎండ్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో చేసిన మొదటి సినిమా ఇదే  కావడం మరో స్పెషాలిటీ. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది. మరో ప్రస్థానం చిత్రంలో ప్రతి సీన్ రియలిస్టిటిక్ గా ఉంటుంది. ఈ సినిమా అనేది నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ కి మరో ప్రస్థానం నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ నెల 24న థియేటర్ లలో మిమ్మల్ని కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. అన్నారు.