మల్లె తీగ చిత్రం ప్రారంభం

Published On: November 19, 2021   |   Posted By:
మల్లె తీగ చిత్రం ప్రారంభం
 
 
 శ్రీ నందనం క్రియేషన్స్ పతాకంపై జైరాజ్ జల్లూరి,ప్రవీణ్ పోతురాజు, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్ , సుజాత, , భరత్, చందు నటీనటులుగా పల్లి మోహన్ రావు దర్శకత్వంలో శ్రీను మోచర్ల నిర్మిస్తున్న నూతన చిత్రం “మల్లెతీగ”.
 
ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు సముద్ర హీరో హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, చిత్ర దర్శకుడు చేతులు మీదుగా నిర్మాత శ్రీను మోచర్ల స్క్రిప్ట్ ను అందుకొగా, నటుడు నిర్మాత డి.యస్. రావు మల్లెతీగ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో చంద్ర యాదవ్, సత్తయ్య తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
 
అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….
 
 నటుడు,నిర్మాత డి.యస్.రావు మాట్లాడుతూ .. అంతా కొత్త వాళ్లతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న ఈ “మల్లెతీగ” సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు
 
 
 ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు సముద్ర గారు మాట్లాడుతూ .. .ఈ చిత్ర మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ మల్లె తీగ చిత్రం ఎర్ర మల్లెలు అంత పెద్ద హిట్ అవ్వాలి.మంచి కథను సెలెక్ట్ చేసుకొని చేస్తున్న దర్శక,నిర్మాతల కు ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని అన్నారు.
 
 
 చిత్ర నిర్మాత శ్రీను మోచర్ల మాట్లాడుతూ .. మా సినిమా ఓపెనింగ్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలుదర్శకుడు చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించింది. ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక విలేజ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కొత్తవారితో చేస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. 
 
 చిత్ర దర్శకుడు పల్లి మోహన్ రావు  మాట్లాడుతూ ..మా సినిమాను, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.ఇది నా మొదటి చిత్రం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథే హీరో. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కేవలం కథకు ప్రాణం పోస్తారు. వైజాగ్ దగ్గర గుడివాడ పరిసర ప్రాంతంలో ఉన్న ఈ విలేజ్ ఎక్కడా మ్యాప్ లో కూడా లేదు గవర్నమెంట్ అండర్ లో లేని ఈ విలేజ్ కు సెట్ కూడా అవసరం లేదు ఇది పూర్తి ట్రైబల్ లో ఉన్న ఈ  విలేజ్ ను సెలెక్ట్ చేసుకొని షూట్  షూటింగ్ చేస్తున్నాం.ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాము.ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాత శ్రీను మోచర్ల గారికి కృతజ్ఞతలు.మేము గొప్ప సినిమా తీయకున్నా మేమంతా కలసి మంచి సినిమా తీస్తామనే నమ్మకముంది అన్నారు. 
 
 హీరో ప్రవీణ్ పోతురాజు మాట్లాడుతూ.. నేను చేసిన జనసేన తర్వాత చేస్తున్న మంచి సినిమా ఇది.దర్శకుడు పల్లి మోహన్ రావు గారు చెప్పిన లైన్ చాలా రగ్ద్ గా అనిపించింది. ఇలాంటి కథే నాకు కరెక్ట్ అనిపించి. ఈ సినిమా చేస్తున్నాను. యూత్ అంతా కలిసి చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు 
 
 హీరో జై రాజ్ జల్లూరి మాట్లాడుతూ .. కొత్త వారిమైన మా లాంటి వారికి ఎంకరేజ్ చేస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
 
 హీరోయిన్స్ మాట్లాడుతూ ..కథ చాలా బాగుంది ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు 
 
 
 నటీనటులు
 
జైరాజ్ అల్లూరి,ప్రవీణ్ పోతురాజు, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్ ,సుజాత, భరత్, చందు తదితరులు 
 
 సాంకేతిక నిపుణులు
 
బ్యానర్ : శ్రీ నందనం క్రియేషన్స్ 
ప్రొడ్యూసర్ : శ్రీను మోచర్ల 
దర్శకత్వం : పల్లి మోహన్రావు 
కెమెరా : దేవేంద్ర సూరి పరవస్తు
ఎడిటర్ :  సోమేశ్ ముత్త 
మ్యూజిక్ : నాగేష్ గౌరీస్