మహావీరుడు మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
కథ ఏంటి అంటే :
ఒక కార్టూనిస్ట్ గా పని చేస్తున్న శివకార్తికేయన్ సాధరణంగా భయస్తుడు. అలాంటి వ్యక్తికి ఒక పొలిటికల్ పార్టీ నుంచి ప్రజలను ఆకర్షించడానికి మంచి కార్టూన్స్ డిజైన్ చేయాలని కాంట్రాక్ట్ వస్తుంది. దాని కోసం హీరో ఒక కల్పిత పాత్రను క్రియేట్ చేస్తాడు. స్వతహగా భయస్తుడైన హీరో పైకి చూసినప్పుడల్లా ఆ పాత్ర తనలో ఆవహించి తాను శక్తివంతుడిగా ఒక సూపర్ హీరోగా మారిపోతాడు. అసలు ఆ పాత్ర ఏంటి, ఎలా ఆ పాత్ర హీరోను ఆవహిస్తుంది, పైకి చూస్తే ఎం కనిపిస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మహావీరుడు చూడాల్సిందే.
ఎలా ఉందంటే :
కమర్షియల్ సినిమా ఫార్మెట్ ఏంటో అందరికి తెలుసు. హీరో ఇంట్రడక్షన్, ఒక పాట, ఫైట్, లవ్, ట్విస్ట్ ఇలా అయితే మహావీరుడు కూడా కమర్షల్ చిత్రమే. కానీ రెగ్యూలర్ ఫార్మెట్ లో ఉండదు. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసి, దాని చుట్టూ కమర్షియల్ అంశాలను జాగ్రత్తగా అల్లుకున్నారు. మొదటి భాగం హీరో తాలూకు భయాలు, అతని ప్రేమ కథని కామెడితో జోడించి ఎంగేజింగ్ గా చెప్పాడు దర్శకుడు మడోన్ అశ్విన్. ఇక రెండవ భాగం ఆధ్యంతం ఆసక్తికరమైన సన్నివేషాలతో ఎంగేజ్ చేస్తుంది. భయస్తుడైన హీరో శక్తివంతుడిగా మారడం చాలా ఆసక్తిగా ఉంటుంది. పొలిటికల్ డ్రామా అంత ఆసక్తికరంగా అనిపించకపోయినా హీరో క్యారెక్టరైజేషన్ మూలంగా సినిమా ఆద్యాంతం ఆసక్తికరంగా సాగుతోంది.
ఎవరెలా చేశారంటే :
సహజమైన నటనతో కట్టిపడేసే హీరో శివకార్తికేయన్ ఈ చిత్రంలో కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. చిత్రంలో భయస్తుడి పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ అదితి శంకర్ ఈ సినిమాలో తన పాత్రకి మంచి స్కోప్ ఉంది. ఇక ఆ పాత్రకి నూరు శాతం న్యాయం చేసింది. మిస్కిన్ ఉన్నంతలో పర్వాలేదు. ఇక తెలుగులో మంచి పేరుగాంచిన కమెడియన్ సునీల్, మొదటిసారి తమిళ్ లో నటించిన చిత్రం ఇది. తను కూడా ఉన్నంతలో బాగా చేసాడు, ఇక మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మడోన్ అశ్విన్ అద్బుతమైన ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నాడు. సాధారణంగా స్టార్ హీరో అనగానే కమర్షల్ సినిమానే తీస్తారు అనుకున్నారు. కానీ వినుత్నమైన కథకు కమర్షియల్ హంగులు అద్ది తెరకెక్కించిన విధానం అందరిని కట్టిపడేసింది. ముఖ్యంగా ఫాంటసీని ఈ చిత్రంలో మిళితం చేసిన విధానానికి మనం మడోన్ అశ్విన్ ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇక భరత్ శంకర్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక విషు అయ్యన్న మహావీరుడు చిత్రానికి వెన్నుముకగా అభివర్ణించొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం
హీరో యాక్టింగ్
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
కామెడీ
పాటలు
మైనస్ పాయింట్స్ :
పొలిటికల్ డ్రామా పండలేదు
కొన్ని సాగదీత సీన్లు
సినిమా వివరాలు :
మహావీరుడు సినిమా వివరాలు
సినిమా టైటిల్ : మహావీరుడు (తమిళం నుండి డబ్ చేయబడింది)
బ్యానర్: శాంతి టాకీస్
విడుదల తేదీ : 14-07-2023
సెన్సార్ రేటింగ్: U/A
తారాగణం : శివకార్తికేయన్, అదితి శంకర్
రచన – దర్శకత్వం : మడోన్ అశ్విన్
సంగీతం: భరత్ శంకర్
సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
నిర్మాత – అరుణ్ విశ్వ
రన్‌టైమ్: 153 నిమిషాలు
మూవీ రివ్యూ రైటర్ : రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్