Reading Time: 3 mins

మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌

మాయాబజార్ ఫర్ సేల్ ఓ రోలర్ కోస్టర్‌లా కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది : ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో డా. న‌రేష్ వి.కె

మాయాబజార్ ఫర్ సేల్ జూలై 14 న జీ 5లో స్ట్రీమింగ్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప‌లు భాష‌ల్లో అందిస్తూ త‌నదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 త్వరలోనే మాయాబజార్ ఫర్ సేల్ అనే స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ తెలుగు వెబ్ ఒరిజిన‌ల్‌ను అందించనుంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా ద‌గ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యాన‌ర్ క‌లిసి సునిశిత‌మైన‌, హృద్య‌మైన డ్రామాగా మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ క‌మ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. గౌత‌మి చిల్ల‌గుల్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆదివారం మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఈ కార్య‌క్రమంలో జీ 5 వైస్ ప్రెసిడెంట్‌సౌత్ కంటెంట్ హెడ్ సాయితేజ్ దేశ్‌రాజ్‌, స్పిరిట్ మీడియా రాజీవ్ రంజ‌న్‌, డైరెక్ట‌ర్ గౌత‌మి, డా. న‌రేష్ వి.కె, ఝాన్సీ, రాజా చెంబోలు, సునైన‌, అదితి, ర‌విరాజ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ర‌విరాజ్ మాట్లాడుతూ డైరెక్ట‌ర్ గౌత‌మిగారికి థాంక్స్‌. నరేష్‌గారు, ఝాన్సీగారు వంటి యాక్ట‌ర్స్‌తో క‌లిసి న‌టించ‌టం మ‌ర‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌. జీ5లో ఇది నాకు రెండ‌వ వెబ్ సిరీస్‌. ఇంత‌కు ముందు ఏటీఎం అనే వెబ్ సిరీస్‌లో న‌టించాను. జూలై 14న మాయాబజార్ ఫర్ సేల్ స్ట్రీమింగ్ అవుతుంది. మిస్ కావొద్దు అన్నారు.

అదితి మాట్లాడుతూ అవకాశం ఇచ్చిన గౌత‌మికి థాంక్స్‌. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసి ఎంజాయ్ చేసేలా మాయాబజార్ ఫర్ సేల్ సిరీస్ ఉంటుంది. కాబ‌ట్టి త‌ప్ప‌కుండా చూడండి అన్నారు.

సునైన మాట్లాడుతూ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతున్న మాయాబజార్ ఫర్ సేల్ అందరికీ క‌నెక్ట్ అవుతుంది. డైరెక్ట‌ర్ గౌత‌మికి స‌దా రుణ‌ప‌డి ఉంటాను. నా అరుపులు ట్రైల‌ర్‌లో చూశారు. నా ఆవేద‌న‌ను రేపు స్క్రీన్‌పై చూశారు. అంద‌రూ క‌లిసి చూసేలా మాయాబజార్ ఫర్ సేల్ ఉంటుంది అన్నారు.

రాజా చెంబోలు మాట్లాడుతూ జీ 5, స్పిరిట్ మీడియాకు థాంక్స్. మాయాబజార్ ఫర్ సేల్ సిరీస్ ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే చూసిన ఆడియెన్స్ ఎక్క‌డో ఓ చోట క‌నెక్ట్ అవుతారు. న‌రేష్‌గారు, ఝాన్సీగారు, సునైన‌, డైరెక్ట‌ర్ గౌత‌మిగారు ఇలా మంచి టీమ్‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం ద‌క్కింది. జూలై 14న సిరీస్‌ను జీ5లో చూడండి అన్నారు.

ఝాన్సీ మాట్లాడుతూ జీ 5లో ఆడియెన్స్ మంచి వెబ్ సిరీస్‌ల‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాగే మాయాబజార్ ఫర్ సేల్ ను ఎంజాయ్ చేస్తారు. తెలుగు సినిమాల్లో హనుమాన్ జంక్షన్ అనే సినిమా ఎలాంటి కామెడీని క్రియేట్ చేసి గుర్తుండిపోయిందో అలాగే మాయాబజార్ ఫర్ సేల్ న‌భూతో న‌భ‌విష్య‌త్ అనేలా ఉంటుంది. ఈ ద‌శాబ్దానికే కాదు రాబోయే రెండు ద‌శాబ్దాల‌కు కూడా ఇలాంటి కామెడీ ఉన్న వెబ్ సిరీస్ మ‌రోటి రాదు. రానాగారి స్పిరిట్ మీడియా, జీ 5 కాంబోలో వ‌స్తున్న ఈ సినిమా ఆక‌ట్టుకుంటుంది. అంద‌రూ నిరుత్సాహంగా ఉన్న‌ప్పుడు మాయాబజార్ ఫర్ సేల్ ను చూస్తే తెలియని ఉత్సాహం వ‌స్తుంది. జూలై 14న జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది అన్నారు.

డైరెక్ట‌ర్ గౌత‌మి చిల్ల‌గుల్ల మాట్లాడుతూ మెయిన్ సిటీలో నుంచి విల్లాస్‌లోకి మారినప్పుడు నాకైతే ఏమీ అర్థం కాలేదు. నాలాగే చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇక మాయాబజార్ ఫర్ సేల్ విష‌యానికి వ‌స్తే దీనికి కావాల్సిన కంటెంట్ అంతా మా వాట్స‌ప్ గ్రూపు నుంచే వ‌చ్చేసింది. ప్ర‌తి ఫ్యామిలీలో ఎమోష‌న్స్ కామ‌న్‌గా ఉంటాయి. గేటెడ్ క‌మ్యూనిటీ అనేది ఓ జాయింట్ ఫ్యామిలీలా ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రూ ఎక్క‌డో క‌నెక్ట్ అవుతారు. స్టేజ్‌పై ఉన్న ఆర్టిస్టులే కాకుండా చాలా మంది ఆర్టిస్టులుంటారు. జంధ్యాల‌గారి స్ఫూర్తిగా తీసుకుని క్యారెక్ట‌ర్ రాశాను. జూలై 14 నుంచి మాయాబజార్ ఫర్ సేల్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.

జీ 5 వైస్ ప్రెసిడెంట్‌సౌత్ కంటెంట్ హెడ్ సాయితేజ్ దేశ్‌రాజ్ మాట్లాడుతూ ఓటీటీని మ‌రీ బూతు చేసేశారు. ఓటీటీలో ఏదైనా కంటెంట్ వ‌స్తుందంటే ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని చూడాలా అనిపిస్తుంది. కానీ జీ5లో రాబోతున్న మాయాబజార్ ఫర్ సేల్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉంటాయి. 6 ఏళ్ల వ‌య‌సు నుంచి 60 వ‌య‌సు వ‌ర‌కు ఉన్న అంద‌రూ చూసి ఎంజాయ్ చేస్తారు. గౌత‌మిగారు చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. స్పిరిట్ మీడియా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సిరీస్‌ను రూపొందించారు. మంచి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో చేశారు. దీనికి సీక్వెల్ కూడా చేయాల‌ని కోరుకుంటున్నాను. ప్ర‌తి పాత్ర మ‌న‌కు ఎదో ఒక‌టి గుర్తు చేస్తుంది. ఇందులోని పాత్ర‌లు న‌వ్వించ‌ట‌మే కాదు ఎమోష‌న‌ల్‌గా కంట‌త‌డి కూడా పెట్టిస్తాయి. మ‌న‌ల్ని పాత్ర‌లు వెంటాడుతుంటాయి. న‌రేష్‌గారు, ఝాన్సీగారు, రాజాగారు, సునైన ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించారు. వ్య‌వ‌స్థ‌, పులి మేక‌, రెక్కీ. ఇలా ప్ర‌తి నెల ఓ కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. పండ‌గ‌లాంటి సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్ను జూలై 14న‌ జీ 5లో చూసి ఎంజాయ్ చేస్తారు అన్నారు.

డా. న‌రేష్ వి.కె మాట్లాడుతూ జీ 5 నుంచి సాయి తేజ్, స్పిరిట్ మీడియా అండ్ టీమ్, విరాజ్ అండ్ టీమ్, మాయాబజార్ అండ్ టీమ్‌కి థాంక్స్‌. 1990, 2000 ద‌శ‌కాల్లో గేటెడ్ క‌మ్యూనిటీ అనేది ఓ డ్రీమ్‌. ఇప్పుడు వేల కొద్ది గేటెడ్ క‌మ్యూనిటీలున్నాయి. దీన్ని ఇప్పుడు ఇరుగు పొరుగు అని అనుకోవాలి. మాయాబజార్ ఫర్ సేల్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక రోలర్ కోస్ట‌ర్‌, ఫ్యామిలీ ఫ‌న్ రైడ‌ర్‌. షూటింగ్ అంతా కార్నివాల్‌గా చేశాం. డైరెక్ట‌ర్ గౌత‌మిని అభినందిస్తున్నాను. ఓ కొత్త డైరెక్ట‌ర్ ఇలాంటి కంటెంట్‌ను చేయాలంటే సాధార‌ణ విష‌యం కాదు. అంద‌రూ ఎంతో ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. అంద‌రూ కుటుంబంతో కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. జీ 5లో జూలై 14న స్ట్రీమింగ్ అవుతుంది అన్నారు.