మాయా మూవీ ప్రీ రేలీజ్ ఈవెంట్
విన్ క్లౌడ్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీ లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై జీరో ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం మాయ. రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన మాయ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని తాజా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
డైరెక్టర్ రమేష్ నాని మొదటిసారి ఇంటికొచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు, మూవీ స్క్రీన్ ప్లే విన్న వెంటనే సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మినట్లు హీరో కిరణ్ ఆవల వెల్లడించారు. సినిమా ప్రివ్యూ వేసినప్పుడు తన నమ్మకం నిజమైందని తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పెట్టి కొట్టాడు అని కొనియాడారు. కిరణ్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ కూడా వీళ్ళకే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తమ మూవీని ప్రోత్సహించడానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సత్యం రాజేష్, అనుదీప్ చౌదరి ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాయ చిత్రం నిర్మాత రాజేష్ ఎంతో ఉత్సాహంతో అలాగే నమ్మకంతో పెట్టుబడి పెట్టారని తెలిపారు. నేడు ప్రేక్షకుడు టెక్నికల్ గా చాలా అడ్వాన్స్బుగా ఆలోచిస్తున్నాడని అందుకనే పూర్తిస్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా మాయా చిత్రం ఉంటుందని కిరణ్ ఆవల తెలిపారు.
నటుడు ఫిలిం క్రిటిక్ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. సత్యం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై సత్యం రాజేశ్ నేడు హీరోగా మంచి సినిమాలు అందిస్తూ మాయ చిత్రానికి ముఖ్యఅతిథిగా వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ఆనందంగా ఉందన్నారు. నటుడు, స్నేహితుడు కిరణ్ ఆవల ఒక స్టోరీ ఉందని చెప్పడం, డైరెక్టర్ రమేష్ వచ్చి స్టోరీ నరేట్ చేయడంతో.. సినిమా చాలా బాగా నచ్చిందని తెలిపారు. మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదని.. కంటెంటును నమ్ముకుంటే చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధిస్తుందని మరోసారి మాయా సినిమా నిరూపించబోతుందని పేర్కొన్నారు. మాయ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ బాపిరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాణ్ లాంటి క్యారెక్టర్, మాయ సినిమాలో చేశానని సురేష్ కొండేటి పేర్కొన్నారు. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం లాంటిది ఆ విషయంలో సూర్య మంచి ఔట్ ఫుట్ ఇచ్చాడని తెలిపారు. మిగితా టెక్నిషన్స్ కూడా అద్భుతంగా చేశారని తెలిపారు.
నిర్మాత రాజేష్ గురిజవోలు మాట్లాడుతూ.. రమేష్ మొదట ఈ కథను చెప్పినప్పుడు ఇలాంటి కథ ఖచ్చితంగా మెటీరియలైజ్డ్ కావాలని.. బడ్జెట్ గురించి ఆలోచించకండి అని చెప్పానన్నారు. తర్వాత ఈ ప్రాజెక్టులోకి హీరోయిన్ ఎస్తర్ రావడం ప్రధాన బలం అన్నారు. ఆ తర్వాత ఎంతో అనుభవం ఉన్న సురేష్ కొండేటి చేరడం అదనపు బలం అన్నారు. వీటన్నింటికీ మించి డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాయా సినిమాను తీసుకోవడం అనేది ఒక విజయం అని నిర్మాత రాజేష్ పేర్కొన్నారు. ఈ సినిమాకు సంగీతం అనేది ప్రాణం లాంటిదని, మ్యూజిక్ డైరెక్టర్ సూర్య ప్రాణం పెట్టి చేశారని కొనియాడారు.
మాయా చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్ రాజేష్ అని డైరెక్టర్ రమేష్ పేర్కొన్నారు. సినిమా మొదటి నుంచి పోస్టు ప్రొడక్షన్ అయ్యేవరకు ప్రతి క్షణాన్ని ప్రోత్సహిస్తూ డబ్బుల గురించి ఆలోచించకండి బాగా తీయండి అన్న వ్యక్తి మా ప్రొడ్యూసర్ అని తెలిపారు. సినిమా ఎంత బాగా చేసినా డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు ముందుకొచ్చి సినిమాను తీసుకోవడంతో విడుదలకు ముందే విజయం సాధించినట్టు అయిందని వెల్లడించారు. అలాగే కథ విన్న వెంటనే నేను చేస్తున్నా అని ముందుకొచ్చిన హీరోయిన్ ఎస్తర్ నోర్హానా మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం అని అన్నారు. హీరో సత్యం రాజేష్ తో పెద్దగా పరిచయం లేనప్పటికీ, కలిసిన వెంటనే నేనున్నాను.. మీకు సపోర్ట్ చేస్తాను అని భరోసానిచ్చిన మంచి మనసున్న వ్యక్తి అని డైరెక్టర్ తెలిపారు.చిత్రాన్ని తెరకెక్కించడంలో టీం ఎంతో సపోర్ట్ చేసిందని డైరెక్టర్ రమేష్ నాని తెలిపారు. సినిమాకు పెద్ద బ్యాక్ బోన్ అని అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు తన వంతు సాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. హీరోయిన్ ఎస్తర్ తో ఉన్న పరిచయంతోనే ఈ ఈవెంట్ కు వచ్చినట్లు.. చిన్న సినిమా అయినా అద్భుతమైన కంటెంట్ ను అందించారని మాయ టీంను కొనియాడారు.
మాయ చిత్రాన్ని చిన్న సినిమా అంటున్నారు కానీ నిజానికి ఆ తేడా ఏమీ ఉండదు కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఒకే రకమైన విజయాన్ని అందుకుంటుందని నటుడు హీరో సత్యం రాజేష్ పేర్కొన్నారు. సినిమా కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి తెరకెక్కించారని టీజర్, ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుందన్నారు. ఫిలిం క్రిటిక్ సురేష్ కొండేటి ఈ సినిమాలో తన పాత్రను కొట్టేసాడని కితకితలు పెట్టారు. సినిమాకి మెయిన్ పిల్లర్ ఎస్తర్ నోర్హణ అని తనతో వెయ్యి అబద్ధాలు, భీమవరం బుల్లోడు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ను పంచుకున్నారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో లంచ్ బ్రేక్ లో టైం వేస్ట్ కాకుండా లొకేషన్ లోనే ఉంటూ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన కమిట్మెంట్ యాక్టర్ తను అని కొనియాడారు. మెయిన్ లీడ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు అని అడిగినప్పుడు.. ఏదైనా పాత్రే కదా ఇండస్ట్రీలోనే ఉన్నాము, ఇక్కడే చివరి వరకు ఉండాలి అని చెప్పిన అద్భుతమైన నటి అని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్ బాపినీడు ఈ సినిమాని తీసుకోవడం శుభపరిణామం అని సత్యం రాజేష్ వెల్లడించారు.
ఎస్తర్ నోర్హణ మాట్లాడుతూ.. తన లైఫ్ ఎప్పుడు ముందుకు వెళుతుందని ఈ ప్రయాణంలో ఎంతో మందికి అండగా నిలిచే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ఒక సినిమా మొదలు పెట్టినప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఎవరెవరు కలుస్తారు. దాని విజయం ఎంతవరకు ఉంటుంది అనేది మనం అంచనా వేయలేము కానీ, ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగాలని తెలిపారు. చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయి కానీ, చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండవని పేర్కొన్నారు. మనం తెరక్కకిచ్చే సినిమా మనకు ఎప్పుడూ పెద్దదే అని తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ రమేష్ కాన్ఫిడెన్స్ నన్ను ఈ సినిమాను చేసేలా చేసిందన్నారు. ఇది క్రైమ్ స్టోరీ అయినప్పటికీ సినిమాలో ఎమోషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరారు.
నటీనటులు :
ఎస్తర్ నోరన్హా, కిరణ్ ఆవల, సిరిచందన, టార్జాన్, సురేష్ కొండేటి, స్వప్న, హరి, రవి పట్నాయక్, సునీత తదితరులు
సాంకేతిక వర్గం :
దర్శకత్వం: రమేష్ నాని
నిర్మాత: రాజేష్ గొరిజవోలు
బ్యానర్: VC ఎంటర్ టైన్మెంట్స్(VinCloud), శ్రీ లక్ష్మీ పిక్చర్స్
సంగీత దర్శకుడు: సూర్య వక్కలంక
సినిమాటోగ్రాఫర్: నవీన్ కుమార్
ఎడిటర్ : మసూద్ మావ