Reading Time: 2 mins

మార్క్ ఆంటోని లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

విశాల్ మార్క్ ఆంటోని వీరభద్ర స్వామి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్

విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌తో పురచ్చి తలపతి అనిపించుకుంటూ టాలీవుడ్ లో కూడా సుప‌రిచిత‌మై త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు విశాల్. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మరో పాపులర్ హీరో ఎస్.జె.సూర్య నటిస్తుండగా విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమాలో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సెన్సేషనల్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించగా మొదటి మూడు సింగిల్స్ కు భారీ స్పందన లభించింది. ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా, ఐ లవ్ యూనే, అమ్మ అను మంత్రము లిరికల్ సాంగ్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేయగా ఇప్పుడు మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

భువికి తరలిరా వీరభద్రుడా
మహిమ చూపరా ప్రళయ రుద్రుడా
ఉగ్రనేత్రుడా ఉరిమి చూడరా
ఊచకోతనే మొదలిడ ఇటురా
దుష్టనాశకా విజృంభించరా అంటూ ఈ సాంగ్ లో బీట్ హైలైట్ కాగా.. విశాల్ గెటప్స్ ఆకట్టుకునెల ఉన్నాయి. లిరిసిస్ట్ భువన చంద్ర రాసిన లిరిక్స్, హేమ చంద్ర గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. ఈ పాట కథానాయకుడి ఆవేశాన్ని చాటి చెప్పేలా ఉంది, పాటలో కొన్ని హై మూమెంట్స్ కూడా ఉన్నాయి. వీరభద్రుడిని ప్రార్థిస్తూ సాగిన ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ తెప్పించేలా ఆద్యంతం సాగింది. ఇక అంత బాగుండడంతో సాంగ్ విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ గా మారింది. ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్ చార్ట్ బస్టర్ కానుంది. ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ డిజైన్ చేశారు.

న‌టీన‌టులు :

విశాల్, ఎస్‌.జె.సూర్య‌, సునీల్, సెల్వ రాఘ‌వ‌న్‌, రీతూ వ‌ర్మ‌, అభిన‌య‌, కింగ్ స్లే, వై.జి.మ‌హేంద్ర‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వర్గం :

రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్రన్
నిర్మాత: ఎస్ వినోద్ కుమార్
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డి.ఓ.పి: అభినందన్ రామానుజం
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి