మార్షల్ ‘ టీజర్ కు సూపర్ రెస్పాన్స్
పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్”.
ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ ఈనెల 5 న తలసాని గారి చేతులమీదగా విడుదలైంది. ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన గంటల్లో హాఫ్ మిలియన్ వ్యూస్ రాబట్టి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్న ఈ చిత్రం అదే దూకుడుతో 2 మిలియన్ వ్యూస్ సాధించి, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ” ఇప్పటికే 20 లక్షల వ్యూస్ రావడం.. ఈ చిత్రంపై ముందు నుంచి మాకు గల నమ్మకాన్ని మరింత పెంచింది. ఇటీవలకాలంలో ట్రెండ్ సిట్టింగ్ హిట్స్ గా నిలిచిన చిత్రాల జాబితాలో మా “మార్షల్” కూడా కచ్చితంగా స్థానం పొందుతుంది” అన్నారు.
అభయ్ [హీరో], శ్రీకాంత్ , మేఘా చౌదరి[హీరొయిన్] రష్మి సమాంగ్[హీరొయిన్] సుమన్, వినోద్ కుమార్,శరణ్య, పృద్విరాజ్,రవి ప్రకాష్, ప్రియ దర్శిని రామ్, ప్రగతి,కల్ప వల్లి, సుదర్శన్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్, మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,ఫైట్స్ : నాభ మరియు సుబ్బు ఎడిటర్ : చోట కె ప్రసాద్,
పిఆర్వో : శ్రీ పాటలు : యాదగిరి వరికుప్పల, నిర్మాత : అభయ్ అడకా దర్శకత్వం జై రాజ్ సింగ్