Reading Time: 3 mins

మాస్ట్రో మూవీ రివ్యూ

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ రివ్యూ
Rating:2.5/5


 డబ్బులుంటే హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కోవచ్చు. కానీ దాన్ని అంతే సక్సెస్ ఫుల్ మరో భాషలో రీమేక్ చేసి హిట్ కొట్టండం మాత్రం కష్టం. అలాగే ఒక భాషలో క్లాసిక్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సినిమాను రీమేక్ చేయడం అనేది పెద్ద రిస్క్. ఆ రిస్క్ తీసుకుని‘అంధాధున్‌’రీమేక్ రైట్స్ తీసుకుని చేసిన ఈ తెలుగు రీమేక్ ప్రయత్నం  ఏ మేరకు వర్కవుట్ అయ్యింది. నితిన్, తమన్నా కలిసి ఆయుష్మాన్ ఖురానా, టాబు చేసిన మ్యాజిక్ ని రిపీట్ చేయగలిగారా,   కథను నేటివిటి పరంగా తెలుగీకరించినప్పుడు..స్క్రిప్టు పరంగా చేసిన మార్పులు ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్


పియానో ప్లేయ‌ర్‌ అరుణ్ (నితిన్‌) గుడ్డివాడిగా నటిస్తూంటాడు. అతనికో గర్ల్ ప్రెండ్ సోఫీ  (న‌భా న‌టేషా) . ఆమెకు ఉన్న రెస్టారెంట్ కమ్ క్బబ్ లో పియోనో వాయిస్తూ కాలక్షేపం చేస్తూంటాడు. అక్కడికి  రియల్టర్‌గా మారిన మాజీ హీరో మోహన్ (నరేష్) వస్తాడు. అతని పాటలకు ఇప్రెస్ అయ్యి తన  మ్యారేజ్‌ డే సందర్భంగా ఇంటికొచ్చి పియానో వినిపించాల్సిందిగా కోరుతాడు.   సరేనని ఆయన చెప్పిన సమయానికి వాళ్లింటికి వెళతాడు అరుణ్. కాని ఆయన లేడని చెప్తుంది ఆయన భార్య సిమ్రాన్ (తమన్నా). మోహన్ కు,  సిమ్రాన్ కు వ‌య‌సులో ప‌దిహేనేళ్లు పైనే తేడా ఉంటుంది. ఆ విషయం గమనించినా తనకెందుకు అనుకున్న అరుణ్…అక్కడ ఆల్రెడీ మోహన్ మర్డర్ అయ్యి ఉండటం చూసి షాక్ అవుతాడు. కానీ అతను గుడ్డి వాడు అని భావించిన సిమ్రాన్ పట్టించుకోడు. అంతేకాదు అక్కడే అతన్ని చంపిన వ్యక్తి కూడా ఉంటాడు.  అప్పటిదాకా క‌ళ్లు లేవ‌ని అంద‌రినీ న‌మ్మిస్తున్న అరుణ్ ఈ హ‌త్య‌ని చూశాక వణుకు పుడుతుంది. కానీ ఆ విషయం బయిటపడకుండా తను చూడనట్లే నటించి బయిటపడతాడు.  ఏమీ ఎరగనట్టు ఆ ఇంట్లోంచి బయిటపడి డైరక్ట్ గా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తాడు ఆకాశ్‌. తీరా అక్కడికి వెళ్లే సరికి ఆ ఇన్‌స్పెక్టర్‌ సిమ్రాన్  బాయ్‌ఫ్రెండే అని తేలుతుంది. షాక్ అవుతాడు.  ఆ ఇన్‌స్పెక్టరూ సిమ్రన్ వాళ్లింట్లో ఆకాశ్‌ను చూస్తాడు.  అతను గుడ్డివాడు కాదేమోనని అనుమానపడ్తాడు.  అక్కడ నుంచి అతనేం  చేశాడు?  సిమ్ర‌న్‌తో అరుణ్ కి ఎదురైన స‌మ‌స్య‌లేంటి?  వాటి నుంచి ఎలా త‌ప్పించుకున్నాడు?  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్…

అంధాధున్ సక్సెస్ కు కారణం స్క్రీన్ ప్లే బిగి, జిగి అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు మారిపోయే ట్విస్ట్ లు సినిమాను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి. మొదట హీరో గుడ్డివాడు కాదని రివీల్ అయినప్పుడే షాక్ అవుతాం. అక్కడ నుంచి వరస ట్విస్ట్ లు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అతను ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవటం ,దాని నుంచి ఎలా బయిటపడాలనే ప్రయత్నం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. హిందీలో ఆయుష్మాన్ ఖురానా ఓ సాధారణ మ్యుజిషయన్ గా పాత్రలోకి వెళ్లారు. తెలుగులో నితిన్ కూడా బాగా చేసారు కానీ అతను ఇమేజ్ మనకు గుర్తు వస్తూంటుంది. నితిన్ ఏంటి..ఇలా ఇరుక్కుపోయాడు..బయిటపడకుండా తప్పించుకోవాలని చూస్తున్నాడేంటి అనిపిస్తుంది. అదొక్కటి మెజారిటీ జనాలకు అనిపించకపోతే సినిమా సక్సస్సే. దానికి తోడు అంధాధూన్ ప‌ర్పైట్ రైటింగ్.  ప్లాట్ ,సబ్ ప్లాట్ లతో కూడిన లింకుల‌న్నీ క‌రెక్టుగా ఉంటాయి కాబ‌ట్టి మార్పుల‌కు పెద్ద‌గా ఛాన్సు లేదు. అందుకే అంధాధూన్ ని గుడ్డిగా ఫాలో అయ్యారు.

ఇక సినిమాలో నితిన్ ఎందుకు అంధుడిగా నటిస్తున్నాడో సరయిన కారణం చూపించలేదనిపిస్తుంది . దానికి తోడు థ్రిల్లర్ సినిమాల్లో లాగ హీరో ఇంటెలిజెన్స్ ఏమాత్రం కనపడదు.  అలాగే సినిమా ప్రారంభ‌మైన స్టైల్ చాలా స్లోగా ఉండటం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. నితిన్ లాంటి కమర్షియల్ హీరోలు చేసే సినిమాల‌కు భిన్నమైన నేరేష‌న్‌ ఇది. దాంతో నితిన్ ఏమిటి మ‌రీ ఇంత డ‌ల్ గా ఉన్నాడు అనిపిస్తూంటుంది. ఒక్కో ట్విస్టూ  రివీల్ అవుతూంటే ఇంట్రస్ట్ మొదలవుతోంది.  ఒరిజనల్ నే ఫాలో అయినా, సోల్ చెడిపోకుండా బాగా తీశాడనిపిస్తుంది. 


నచ్చేవి

తెలుగుకు కొత్త స్టోరీ లైన్
తమన్నా నటన
ప్రొడక్షన్ వాల్యూస్

నచ్చనవి
తెలుగు నేటివిటీ  లేకపోవటం
 బోర్ కొట్టే ప్రీ క్లయిమాక్స్


సాంకేతిక నిపుణుల్లో…

 మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గొప్పగా లేదు. ఉన్నంతలో ఎండ్ టైటిల్స్ లో వచ్చే ‘మాస్ట్రో’ప్రమోషన్ సాంగ్ బాగుంది. కథని తెలియచేస్తూ, ఆయా పాత్రలతో సరదాగా డాన్స్ చేయించడం బాగుంది. ఆ పాట కొరియోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ‘ఓ బేబీ… ఓ బేబీ… చిన్ననవ్వే చాలే’, ‘అనగనగా అందమైన కథగా…’ కూడా ఓకే అనిపిస్తాయి. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది కానీ… చాలా వరకూ ఒరిజనల్ ని అనుకరిస్తూ సాగింది. ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ కాస్త స్లోని స్పీడు చేస్తే బాగుండేవి. సాహి సురేశ్ ఆర్ట్ డైరెక్షన్ స్పెషల్ గా చెప్పుకోవాలి.

నటీనటుల్లో..

 మనకు తెలుగులో బ్లాక్ కామెడీ మూవీస్ అతి తక్కువ. ఎంత తక్కువ అంటే యేడాదికి ఒకటి కూడా రాదు. వచ్చినా అందులో స్టార్స్, తెలుసున్న మొహాలు ఉండరు. కానీ నితిన్ ఓ నటుడుగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయటమే కాకుండా, నిర్మాతగా కూడా ముందుకు దూకాడు. ఆ విషయంలో అతన్ని మెచ్చుకోవాలి. ఇక  జిషు సేన్ గుప్తా పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూట్ అయ్యారు. న‌భా న‌టేషాది కేవ‌లం గ్లామ‌ర్ షో. చిట్టి పొట్టి దుస్తుల్లో మెరిసింది. త‌మ‌న్నా పాత్ర ఈ సినిమాకి ఆయువు ప‌ట్టు. ఆమె లేకపోతే ఈ సినిమా లేదు. ఇతర ప్రధాన పాత్రల్లో శ్రీముఖి, అనన్య, హర్షవర్థన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి, దువ్వాసి మోహన్, బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ లహరి తదితరులు కనిపిస్తారు.


చూడచ్చా

 హిందీ సినిమాను ఆల్రెడీ చూసిన వాళ్ళకు ఇది జెరాక్స్ గా కనిపిస్తుంది. కానీ మొదటి సారి తెలుగులో చూసిన వాళ్ళకు కథలోని కొత్తదనం కనిపిస్తుంది.

 
తెర ముందు..వెనక

బ్యానర్‌: శ్రేష్ఠ్‌ మూవీస్‌;
 నటీనటులు: నితిన్‌, తమన్నా, నభా నటేశ్‌, జిషు సేన్‌ గుప్త, నరేశ్‌, శ్రీముఖి తదితరులు;
సంగీతం: మహతి స్వర సాగర్‌;
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌;
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖర్‌;
నిర్మాత: సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి;
దర్శకత్వం: మేర్లపాక గాంధీ;
 బ్యానర్‌: శ్రేష్ఠ్‌ మూవీస్‌;
విడుదల తేదీ:17,సెప్టెంబర్ 2021.
రన్ టైమ్ :2 గంటల 15 నిముషాలు
ఓటీటి:- డీస్నీ+హాట్‌స్టార్‌