మిఠాయి మూవీ రివ్యూ
వద్దోయి – మిఠాయి రివ్యూ
Rating: 1/5
కథ లేకుండా సినిమా తియ్యలేమా అనే ప్రయోగాలు తెలుగు నాట కూడా మొదలయ్యాయని అప్పుడప్పుడు కొన్ని సినిమాలు నిరూపిస్తూంటాయి. అయితే పూర్తి స్దాయిలో అసలు కథే లేకుండా నోటి ఏ సీన్ వస్తే అది ..ఏ ఆలోచన వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ, అప్పటికప్పుడు సెట్లో అనుకున్న డైలాగుని తెరకెకిస్తూ సినిమా తీస్తే అది మిఠాయి సినిమా అవుతుంది. అదో కొత్త జానర్ చిత్రం అవుతుంది. ఇంతకీ మిఠాయిలో ఉన్న దినుసులు ఏమిటి…డార్క్ కామెడీగా చెప్పబడుతున్న ఈ సినిమాలో డార్క్ ఏమిటి…ఇద్దరు కమిడియన్స్ కలిసి కామెడీ పండించారా…నవ్విస్తే ఎక్కడా ఆ నవ్వులు మనకు వినపడటం లేదు కారణం ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం..
ఇదండీ కథ..
పోరంబోకు లాంటి పదప్రయోగానికి సరబడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాయి (రాహుల్ రామకృష్ణ). అతనికి తాగటం..తొంగోటం తప్ప వేరేదేమీ చెయ్యబుద్ది కాదు. అలాంటికి అతనికి పెళ్ళి కుదురుతుంది. కానీ ఈ కుదురుతక్కువ క్యాండేట్ ఆఫీస్ లో బాస్ తో గొడవెట్టుకుని ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఆ ప్రస్టేషన్ లో రాత్రి మందు కొట్టి..తెల్లారి చూసుకునేసరికి తన కాబోయే భార్య కోసం చేయించిన నెక్లెస్ ఎవరో లేపేసారు. దాంతో పెళ్లి లోగా ఆ నెక్లెస్ దొంగ ఎవరో కనుక్కుంటానని ఓ ఫ్రెండ్ తో ఛాలెంజ్ చేస్తాడు. అందుకోసం తన మరో పోరంబోకు ఫ్రెండ్ జానీ (ప్రియదర్శి) సాయం అడుగుతాడు. అక్కడ నుంచి వీరిద్దరూ కలిసి ఆ దొందను పట్టుకునేందుకు ప్రయాణం మొదలెడతారు. ఈ క్రమంలో అనేక పాత్రలు పరచయం అవుతాయి. పెళ్లి సమయం దగ్గర కు వచ్చేస్తుంది. ఇంతకీ వీళ్లు ఆ దొంగను పట్టుకున్నారా…సాయి పెళ్లైందా వంటి అమూల్య విషయాలు ఇప్పటికీ తెలుసుకోవాలని మీకు అనిపిస్తే సినిమా కు వెళ్లండి లేదా సినిమా పూర్తిగా చూసిన ఓపికమంతుడు ఎడ్రస్ పట్టుకోండి.
రకరకాలుగా.. సినిమా ఎలా ఉంది అని అడిగితే రకరకాలుగా ఉంది అని చెప్పాలి. అయినా సాధారణంగా పై కథ చదివిన తర్వాత .. సినిమా ఎలా ఉంది అని అడిగే సాహసం చెయ్యబుద్ది కాదు. ఎందుకంటే తలతోక కథ ఉన్న సినిమా ఎలా ఉంటుంది…అలాగే ఈ సినిమా కూడా ఉంటుంది. నిజంగా ఇలాంటి కథతో కూడా అతను అద్బుతమైన హిట్ కొడితే ఆస్కార్ ఇవ్వచ్చు. దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు..కాబట్టి నో ప్లాబ్లం. దర్శకత్వం చాలా నాశి రకంగా తనకు తోచిన షాట్స్ ని తీసుకుంటూ వెళ్లిపోయినట్లుంది.
నటులెలా చేసారు
ఇలాంటి కథను యంగ్ కమిడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇద్దరూ ఏం విని ఒప్పుకున్నారో మనకైతే అర్దం కాదు. వాళ్లకు అర్దమైందని అనుకోవటానికి లేదు..ఎందుకంటే అర్దమైతే వాళ్లు ఖచ్చితంగా నవ్విద్దురు. అంత టాలెంట్ ఉన్నవాళ్లు సైతం ఏమీ చేయలేని సిట్యువేషన్ లో పడేసిన సినిమా ఇది. మిగతా ఆర్టిస్ట్ లు గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు. పక్కాగా అందరూ డబ్బులుకోసం ఒప్పుకున్నట్లే ఉన్నారు.
టెక్నికల్ గా తెరముందు టీమ్ ఇలా ఉంది.తెర వెనక టెక్నీషిన్స్ ఎలా చేసారు అంటే సంగీత దర్శకుడు వివేక్ సాగర్ పాటలు సోసోగా ఉన్నాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. రవివర్మన్ కెమెరా వర్క్ సినిమాకు తగినట్లే సాగింది. నిర్మాతలు కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదు. దర్శకుడు ప్రశాంత్ కుమార్ తొలి సినిమానే ఇలాంటి పాచి మిఠాయితో వచ్చాడు.కథ సరిగ్గా రాసుకోలేక, డైరక్షన్ సోసోగా ఉంటే చూసేవాళ్ల పరిస్దితి ఏమి కావాలి.
ఆఖరి మాట
చిన్న సినిమాని బ్రతికించాలి అన్న నినాదం ఇలాంటి సినిమాలు చూసినప్పుడల్లా చచ్చిపోతుంది.
తెరముందు..వెనక
నటీనటులు: ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవి వర్మ, అజయ్ ఘోష్, అర్ష, శ్వేత వర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా తదితరులు
ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం
సంగీతం: వివేక్ సాగర్
కూర్పు: గ్యారీ బి.హెచ్
సాహిత్యం: కిట్టు విస్సా ప్రగడ
మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్
నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్
దర్శకత్వం: ప్రశాంత్ కుమార్
సంస్థ: రెడ్ యాంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 22 ఫిబ్రవరి 2019