మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ

Published On: April 1, 2022   |   Posted By:

మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ

తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ రివ్యూ

👎

కంటెంట్ బాగుంటే అది పెద్దదా, చిన్నదా , అందులో స్టార్ ఉన్నాడా అని ఇప్పుడు చూడటం లేదు. కొత్తవాళ్ల టాలెంట్ ని కూడా కళ్లకు హత్తుకుని మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. అందులోనూ ట్రైలర్ తో క్రేజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. పిల్లలతో చేసిన ఫన్ పండితే ఫ్యామిలీలు కదిలి వస్తాయని ట్రేడ్ లో లెక్కలు వేసారు. దానికి తోడు బాలీవుడ్ మల్టిప్లెక్స్ సినిమాలకు కేరాఫ్ గా మారిన తాప్సీ ప్రధాన పాత్రలో నటించింది..ఇంకేం కావాలి …ఓ వర్గానికి , సినిమా చూసేద్దామని ఫిక్సైపోయారు. ఇలా పేరుకుపోయిన అంచనాలను ఈ సినిమా కరిగించిందా లేక కంటెంట్ తో నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Storyline:

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ (తాప్సీ) కాస్త ఉషారైన పిల్లే. అయితే ఆ ప్రాసెస్ లో అనుకోకుండా ఎవరినైనా అడ్డం సాహసాలు చేసేస్తుంది. ఆమెకు పోలీస్ లు కూడా అండగా ఉన్నారనే ధైర్యం కూడా ముందుకు నడిపించేస్తోంది. రీసెంట్ ఓ   రాజకీయనాయుకుడుని తన తెలివితో బయిటపెట్టేసి,పదవినుంచి దించేసింది. ఇదిగో ఇప్పుడు  చైల్డ్ ట్రాఫికింగ్ మీద దృష్టి పెట్టింది. ఆ చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ రామ్‌శెట్టి(హరీశ్‌ పేరడీ) . ఆమెకు…బెంగళూరు నుంచి చిన్న పిల్లలను దుబాయ్‌కి తరలించేందుకు సదరు విలన్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. అంతే  పక్కా ఆధారాలతో,రెడ్ హ్యాండెండ్ గా అతన్ని పోలీసులకు పట్టించాలని  పిల్లలను రక్షించాలని బయలుదేరుతుంది.  అనుకోకుండా ఆమె స్కెచ్ లోకి ముగ్గురు పిల్లలు వచ్చి చేరుతారు. ఎవరు వాళ్లు …

తిరుపతికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం(ఆర్‌.ఆర్.ఆర్‌) ముగ్గరు డిఫరెంట్. రఘుపతి (సినిమా పిచ్చోడు), రాఘవ (టీవీ యాడిక్ట్),రాజారామ్ (క్రికెట్ లవర్).  వాళ్ళకు ఒకటే కోరిక… ఎలాగైనా డబ్బు సంపాదించి ఫేమస్ అవ్వాలి. అందుకు  దావూద్ ఇబ్రహీం ని పట్టుకుంటే బెస్ట్ అని డిసైడ్ అవుతారు. అంతేకాదు దావూద్ ని పట్టుకుంటే  యాభై లక్షల రివార్డు డబ్బులు వస్తాయని ఆశపడి,ఇంట్లోంచి బయిటపడతారు.

ఇంట్లోంచి పారిపోయిన వాళ్లు ముగ్గరూ ముంబై అనుకుని బెంగుళూరు వచ్చేస్తారు.  వాళ్లు  ఓ సీన్ లో శైలజ కి కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆమె వారిని ,వారి ఐడియాలజీని విని, వారితో కలిసి మాఫియాడాన్ రామ్ శెట్టి కి చెక్ పెట్టేలనుకుంటుంది.   ఆమె మిషన్ ఇంపాజలుబ్ మొదలెడుతుది. ఓ ప్లాన్ చేసి ఆ డాన్ ని పట్టిస్తుంది. అయితే ఆ ప్రాసెస్ లు కొన్ని సమస్యలు, పిల్లలు ఇరుక్కుపోతారనే భయాలు ..ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి.

Screenplay Analysis:

ఏ సినిమా సక్సెస్ అయినా  believability అనేదే అతి ముఖ్యమైన ఎలిమెంట్ . అది ఖచ్చితంగా పాత్రలు నిర్ణయాలు,యాక్షన్, రియాక్షన్, డైలాగులపై ఆధారపడుతుంది. అదే ఈ సినిమాలో మిస్సైంది.

2014లో జ‌రిగిన ఓ వాస్తవ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కించారు డైరక్టర్ స్వరూప్‌. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ప‌ట్టుకుంటే భారీ మొత్తంలో డ‌బ్బులు ఇస్తామ‌ని పేప‌ర్‌లో వ‌చ్చిన ప్రక‌ట‌న చూసి ప‌ట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబ‌యి వెళ్లిన విషయాన్ని ఈ కథకు ఎడాప్ట్ చేసారు. ఈ సంఘ‌ట‌న‌కు పిల్లల అక్రమ‌ర‌వాణా అంశాన్ని జ‌త చేసి ఆ క‌థ‌ను ఎంటర్టైన్మంట్ గా తెర‌పై  చెప్దామనకున్నాడు దర్శకుడు. అయితే అక్కడే దారి తప్పింది. సినిమాలో కోర్ ఎలిమెంట్ అయిన పిల్లలతో ఓ ఇన్విస్టిగేషన్ జర్నలిస్ట్ ఓ డాన్ ని పట్టుకోవాలనకునే ఎపిసోడ్స్ దారుణంగా ఫెయిలయ్యాయి. ఐడియాలెవిల్ లో బాగున్న ఈ సబ్జెక్టు విస్తరణ దశలో ముందుకు వెళ్లలేదు.

కేవలం పిల్లలు, డాన్ ని పట్టుకోవటానికి ప్లాన్స్ అనుకుని కథ చేసుకుని ఉంటే ఆ సరదా సీన్స్ బాగుండేవేమో. కానీ ఈ కథలోకి చైల్డ్ ట్రాఫికింగ్ తీసుకురాగానే కథనంపై గ్రిప్ కోల్పోయింది సినిమా. ఫస్టాఫ్ లో పిల్లల నుంచి వచ్చిన ఫన్ ని సెకండాఫ్ లో కొనసాగించలేకపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా విలన్ కు ఇలా కొంతమంది తనను పట్టుకోవటానికి బయిలుదేరారనే విషయం తెలియకపోవటంతో కథలో కాంప్లిక్ట్స్ కు దారి లేదు.  ప్యాసివ్ నేరేషన్ లోకి కథ జారిపోయింది. దాంతో బోర్ కొట్టేసింది. స్క్రిప్టే ఈ మిషన్ ని మిజరబుల్ గా మార్చేసింది. లేకపోతే ఈ కథ యేలేటి చంద్రశేఖర్ తొలి చిత్రం ‘ఐతే’ స్దాయిలో వర్కవుట్ అయ్యేది. అవ్వాల్సింది. మిస్సైంది..మిస్ ఫైరైంది.

Analysis of its technical content:

డైరక్టర్ గా స్వరూప్ వంకపెట్టలేని విధంగా సీన్స్ ని తెరకెక్కించారు. అయితే సరైన స్క్రిప్టునే ఎంచుకోలేకపోయారు. ఇలాంటి ట్రీట్మెంట్ బేసెడ్ స్క్రిప్టులు కత్తిమీద సామే. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” ఫార్మెట్ ప్రతీ కథకు పనికిరాదు. ఇక మార్క్ కె రాబిన్ పాటలు కొత్తగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. దీపక్ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. మాటలూ ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు…అత్యవసరమైన కథ, కథనాలు ఈ డైరెక్టర్ కు,సినిమాకు కలిసి రాలేదు.

నటీనటుల్లో…

తాప్సీకు నిజానికి ఈ సినిమాకు సరబడ సీన్స్ లేవు. సినిమా ఫస్టాఫ్ లో కేవలం  రెండు మూడు సీన్స్ లోనే ఆమె కనిపించింది. సెకండాఫ్ లో  ప్లానింగ్ ఆమెదే అయినా దాన్ని  అమలు చేసేది పిల్లలు కావడంతో వాళ్ళదే డామినేషన్.  దాంతో తాప్సీ సినిమాలా అనిపించలేదు. అయితే పిల్లలు ముగ్గురూ ఎక్కడా కొత్త అనిపించకుండా అనుభవం ఉన్న వాళ్లలా చెలరేగిపోయారు. కొంత అమాయికత్వం, మరికొంత అతి తెలివి వాళ్ల ఫేస్ లో బాగా పలికింది. మలయాళ నటుడు హరీశ్  లుక్ ఇంట్రస్టింగ్ గా  ఉంది.  తాప్సీ పక్కనే ఉండే విక్రమ్ పాత్రధారి రవీంద్ర విజయ్ డబ్బింగ్ బాగోలేదు.సుహాస్, హర్షవర్థన్, వైవా హర్ష, ‘సత్యం’ రాజేశ్‌, మధుసూదన్, సందీప్ రాజ్ వంటి వాళ్ళు గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు.

CONCLUSION:

చూడచ్చా…?

ఓటిటి లో రిలీజైనప్పుడు చూడదగ్గ సినిమా.పనిగట్టుకుని థియేటర్ కు వెళ్లి కొంత నిరాశ పడక తప్పదు.

Movie Cast & Crew

బ్యానర్: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీ ఏ ఎంటర్టైన్మెంట్
నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, హర్ష వర్ధన్, భాను ప్రకాశన్, హరీష్ పెరాడి, వైవ హర్ష, సుహస్, సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: మార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫీ: ఎస్ మనికందన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం: స్వరూప్ అర్ ఎస్ జే
Run-Time: 129 minutes.
విడుదల తేది: 01/04/2022