మిషన్ 2020 చిత్రం ప్రత్యేక ప్రివ్యూ షో

Published On: October 29, 2021   |   Posted By:
 
మిషన్ 2020 చిత్రం ప్రత్యేక ప్రివ్యూ షో
 
గొప్ప సందేశాత్మక ప్రయత్నం మిషన్ 2020  : దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ  
 
హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర హీరో గా  యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన జీవిత సమస్యల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం “మిషన్ 2020”.
 
 
గతంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన మెంటల్ పోలీస్, ఆపరేషన్ 2019 సినిమాలు తెరకెక్కించిన కారణం బాబ్జి దర్శకుడు.  కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు  నిర్మాతలు.
 
అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో గురువారం ప్రసాద్ ల్యాబ్ లో పలువురు చిత్ర ప్రముఖులకు ప్రత్యేక ప్రివ్యూ షో చూపించారు.
 
ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు సముద్ర, వీర శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్, పర్సనల్ ట్రైనర్ షఫీ, జర్నలిస్ట్ ప్రభు, సురేష్ కొండేటి లతో పాటు నిర్మాతలు వెంకటేష్ గౌడ్, రమేష్ రాజు, దర్శకుడు కరణం బాబ్జి, సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో  ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. దర్శకుడు కారణం బాబ్జి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఇంతకుముందు తీసాడు. ఇది కూడా నేటి సమాజం ఎదుర్కొంటున్న ఓ పేద సమస్య. ఇప్పుడు దానిగురించి చెబితే ముందే చెప్పినట్టు అవుతుందని దర్శకుడు అంటున్నాడు కాబట్టి ఇలాంటి మంచి ప్రయత్నాన్ని మనం అందరం సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. ఈ సందర్బంగా ఇంత మంచి సినిమా తీసిన దర్శక, నిర్మాతలను అభినందిస్తున్నాను అన్నారు. 
 
దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ… వెంకటేష్ గారికి, రాజు గారికి అభినందనలు మంచి ప్రయత్నం చేసారు. దర్శకుడు చాలా కమర్షియల్ హంగులతోనే కాకుండా ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేసాడు. కామన్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీసాడు దర్శకుడు. దేవదాసు నవల రాసినప్పుడు రైటర్ శరత్ ని అడిగారట.. దేవదాసు ప్రేమకథ నేను రాసింది ప్రేమించిన వారి తల్లి తండ్రిలకోసం రాసాను. ప్రేమించుకున్న వాళ్ళ ప్రేమను మీరు అర్థం చేసుకోకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఇలా తయారవుతుందని చెప్పే ప్రయత్నమే ఇది అని చెప్పాడట. అలాగే సుడిగుండాలు సినిమాలో నాగేశ్వర రావు కూడా అలాగే ప్రశ్నించాడు. ఈ సినిమా కూడా నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించారు. చాలా మంచి ప్రయత్నం. తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే టాపిక్ ఇది. ఇంత మంచి ప్రయత్నం చేసిన కరణం బాబ్జి ని అభినందిస్తున్నాను అన్నారు. 
 
మరో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. నిజంగా చాలా గొప్ప ప్రయత్నం చేసారు. నేటి సమాజంలో జరుగుతున్న బర్కింగ్ ఇష్యు ని తీసుకుని బాబ్జి గారు చక్కగా తెరకెక్కించారు. అలాగే ఇలాంటి కథను ఎంచుకుని సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు వెంకటేష్ గారిని, రాజు గారిని కూడా అభినందిస్తున్నాను. సమాజానికి పనికి వచ్చే ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా చాలా బాగుంది. తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ .. ఈ సినిమాతో నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన సందర్భం ఏమిటంటే.. ఇందులో నేను ఒ సాంగ్ పాడాను. నేను తేజ గారు కలిసి చాలా ఫోక్ సాంగ్స్ చాలా ఇచ్చాము .. అదే నేపథ్యంలో ఓ మాస్ సాంగ్ ని నేను పాడాను. రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అల్లుడా గారెలు ఒండాలా సాంగ్ బాగా పాపులర్ అయింది. 30 మిళియన్స్ వ్యూస్ పైగా రావడం ఆ తో సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడినది. ఓక సాంగ్ సూపర్ హిట్ అయిందంటే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. ఇలాంటి మంచి సినిమా చేసిన బాబ్జి గారిని, నిర్మాతలు వెంకటేష్ గౌడ్ గారు, రాజు గారిని అభినందిస్తున్నాను అన్నారు.
 
పర్సనల్ ట్రైనర్ షఫీ మాట్లాడుతూ .. ఈ సినిమా చూడాలని చెప్పి మా మిత్రుడు రాప్ రాక్ షకీల్ ఫోన్ చేసి చెప్పాడు. టైటిల్ చూడగానే చూడాలని ఆలోచనతో సినిమా చూసాను. చాలా గొప్ప సినిమా తీశారు. నిజంగా మన సమాజంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అసలు సమస్య ని తొలగించాలా లేక సమస్య క్రియేట్ చేసే విషయాన్ని తొలగించాలా అన్న విషయాన్నీ బాగా చెప్పారు. ఈ సమస్య గురించి ప్రభుత్వాలు, సంస్థలు కూడా ఆలోచించేలా ఉంటుంది. ఇలాంటి గొప్ప సినిమా, చాలా మంచి మెసెజ్ ఇచ్చారు. ఈ సందర్బంగా దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను అన్నారు. 
 
నిర్మాతలు వెంకటేష్ గౌడ్, రమేష్ రాజు మాట్లాడుతూ .. నేటి సమాజానికి కావాల్సిన సినిమా. ఈ రోజు పలువురు ప్రముఖులు మా మిషన్ 2020 సినిమాను చూసారు. అందరికి బాగా నచ్చింది. ఈ సినిమా విషయంలో మొదటి నుండి మాకు నమ్మకం ఉంది. ఎన్ని ఓటిటి అఫర్ లు వచ్చినా కూడా వద్దు ఈ సినిమాను థియటర్స్ లోనే విడుదల చేయాలన్న ఆలోచనతో వెయిట్ చేసాం. అనుకున్నట్టుగానే చాలా సినిమాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నా మా సినిమాకు ఆసియన్ సునీల్ గారు, గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు మాకు సపోర్ట్ చేసారు. అలాగే మా టీం అందరు చాలా బాగా సపోర్ట్ చేసారు. ఇప్పటికే ఓ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అదే ఉత్సహంతో ఈ చిత్రం ఈ నెల 29న విడుదల అవుతుంది. తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు. 
 
దర్శకుడు కారణం బాబ్జి మాట్లాడుతూ … పెద్ద సినిమాలతో పాటు మా చిన్న సినిమా కూడా విడుదల అవుతుంది. ఈ సినిమా పాయింట్ విషయం చెప్పాలంటే ఇండియాలో ఓ పెద్ద స్టార్ హీరో గత నెల నుండి చాలా బాధ పడుతున్నాడు. ఇప్పటికే అయన అదే బాధలో ఉన్నారు. ఈ సినిమా విషయంలో ఏప్రిల్ నుండి ఎదురు చూస్తున్నాం. ఏప్రిల్ లో అనుకుంటే లాక్ డౌన్ వచ్చింది. ఆ తరువాత విడుదల చేద్దాం అనుకుంటే చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి.. ఫైనల్ గా ఈ రోజున విడుదల కు ఫిక్స్ అయ్యాం. ఈ సినిమా విషయంలో రెండేళ్లుగా మా నిర్మాతలు వెంకటేష్ గారు, రాజు గారు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. నిజంగా వాళ్ళు నాకు అంత సపోర్ట్ అందించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా యూత్ కి మత్తేక్కిస్తాది, కిక్కెక్కిస్తాది, కౌపెక్కిస్తాది ఫైనల్ గా ఆలోచింపచేస్తుంది అన్నారు.