మిస్టర్ అండ్ మిస్ మూవీ రివ్యూ
క్రౌడ్ ఫండింగ్ మూవీ ‘మిస్టర్ అండ్ మిస్’ రివ్యూ
Rating:2/5
తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయన్నది నిజం. అయితే ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారా లేదా అన్నది ప్రశ్న. అయితే ప్రతీ నిర్మాత, దర్శకుడు..ఇప్పుడు దాకా ఇండియన్ స్క్రీన్ పై చూడని కథతోనే వస్తున్నాం అని రిలీజ్ కు ముందు చెప్తారు. అలాగే ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ టీమ్ కూడా తామొక అతి కొత్త కాన్సెప్టు తో వచ్చాము అంది. అంతేకాదు… ఇదో క్రౌడ్ ఫండెడ్ సినిమా కావటంతో సినీ లవర్స్ లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి..ఆ కొత్త కాన్సెప్టు ఏమిటి..వర్కవుట్ అయ్యే కథేనా..రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
సాఫ్ట్ వేర్ జాబ్ చేద్దామని హైదరాబాద్ వచ్చిన అమలాపురం కుర్రోడు శివ(శైలేష్ సన్నీ) కు ఒకటే సమస్య. అది కమ్యునికేషన్ స్కిల్స్. ముఖ్యంగా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోవటం. దాంతో అతనికి ఉద్యోగాలు దగ్గరకంటా వచ్చి దూరమైపోతూంటాయి. ఇక తన లవర్ తో కలిసి ఉందామని హైదరాబాద్ వస్తుంది శశికళ అలియాస్ శశి (జ్ఞానేశ్వరి). అయితే ఆ లవర్ వేరే అమ్మాయిలతో ఎంగేజ్ అయ్యి ఉన్నాడని బ్రేకప్ చెప్పేస్తుంది. ఆమె ఓ కంపెనీలో హెచ్ ఆర్ గా పనిచేస్తూంటుంది. మన హీరోకు ఓ ఇంటర్వూలో తగులుతుంది. మనోడి అమాయకత్వం,మంచితనం వగైరా చూసి ఇంప్రెస్ అయ్యిన ఈ సిటీ అమ్మాయి..ఇంగ్లీష్ నేర్పటానికి రెడీ అవుతుంది. అయితే అక్కడితో కథ ఆగుతుందా..నెక్ట్స్ స్టెప్ కు వెళ్తుంది. వీళ్లిద్దరు ప్రేమలో పడటం, సహజీవనం చేయటం స్పీడుగా మొదలెట్టేస్తారు. కొన్ని హాట్ సీన్స్ ల సాక్షిగా కథ ఇలా నడుస్తూండగా..శివకు ఉద్యోగం ఊడుతుంది. ఆ చిరాకులో శశితో విభేధాలు తెచ్చుకుంటాడు. ఇద్దరు విడిపోదామనుకుంటారు. అదే సమయంలో అతనికో ట్విస్ట్ పడుతుంది. వీళ్లిద్దరూ ఇంటిమసిగా ఉండగా తీసుకున్న వీడియో కల సెల్ ఫోన్ మిస్ అవుతుంది. అంతే వీరి జీవితం రోడ్డు పాలవుతుంది. కంగారుపడకండి..వీరిద్దరూ కలిసి ఆ సెల్ ఫోన్ ని వెతుక్కుంటూ రోడ్డున పడ్డారన్నమాట. అప్పుడేమైంది. వీళ్ల సెల్ ఫోన్ దొరికిందా..అందులో ఉన్న వీడియో పరిస్దితి ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్..
ఈ సినిమా కథ వినగానే 2014లో వచ్చిన సెక్స్ టేప్ సినిమా టక్కున గుర్తు వస్తుంది. అయితే ఇందులో లాగ ఆ సినిమాలో లాగుడు ఉండదు. సినిమాప్రారంభమైన కాసేపట్లోనే కథలోకి వెళ్లిపోతారు. ఇక్కడ ఇంటర్వెల్ దాకా అసలు కథకు సంభందంలేని విషయాలు నడుస్తూంటాయి. పోనీ ఇంటర్వెల్ కు కథలోకి వచ్చారు అని ఆనందపడితే..సెకండాఫ్ లో దాన్ని సాగ తీయటం మొదలెడతారు. సీన్స్ నడుస్తూంటాయి కానీ అందులో విషయం ముందుకు వెళ్ళదు. ఇక మరో విషయం ఈ సినిమా… 2019లో సైమా అవార్డుల్లో బహుమతి గెల్చిన షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్. ఈ సినిమా దర్శకుడే దానికీ దర్శకుడు. దాంతో అదే కథనే ఈసారి లెంగ్త్ పెంచి సినిమా గా చేసేసారు. అందుకే ఈ సినిమాలో మనకు షార్ట్ ఫిల్మ్ లక్షణాలు లక్షణంగా కనపడతాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో అడుగు కూడా ముందుకు పడకపోవటం మనని విసిగిస్తుంది. రేసీగా నడవాల్సిన సీన్స్ నత్త నడకనడుస్తూంటాయి. అందుకు కారణం ఈ సినిమాకు రాసుకున్న స్క్రీన్ ప్లేనే. స్క్రీన్ ప్లే బాగోపోతే ..ఎలాంటి కాన్సెప్టు ఉన్నా…ఏమి నడవదని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో మరో కామెడీ ఏమిటంటే… ఐ ఫోన్ పోతే దాన్ని టాక్ చేయటానికి రకరకాల ఆప్షన్ లు ఉంటాయి. కానీ ఇందులో జీపీ ఎస్ ట్రాకింగ్ అంటూ హడావిడి చేస్తూంటారు. ఇలాంటి టెక్నికల్ అంశాల మీద కథ రాసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ ని ఖచ్చితంగా గేదర్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సినిమా నొక్కి చెప్తుంది.
టెక్నికల్ గా …
ఈ సినిమాకు కెప్టెన్ అయిన డైరక్టర్ తప్ప అందరూ మంచి స్టార్డర్డ్స్ లోనే అవుట్ పుట్ ఇచ్చారు. మ్యూజిక్ డైరక్టర్, కెమెరామెన్ ఈ సినిమాని ఉన్నంతలో నిలబెట్టడానికి ప్రయత్నించారు. ఎడిటరే కాస్తంత జాలి తలిస్తే బాగుండేది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా బాగుంది. నటీనటులు కొత్తవాళ్లైనా బాగా చేసారు. అయితే కొత్త వాళ్లు అవటమే సినిమాకు మైనస్ గా మారిందేమో ఓ సారి అనిపిస్తుంది. దానికి తోడు డైరక్టర్ ఎందుకు బూతుని ఎక్కువగా ఆశ్రయించాడో అర్దంకాదు. సినిమాని సోఫ్ట్ ఫోర్న్ లా ఊహించారు ఆయన.
చూడచ్చా…
ఈ సినిమాకు మూలమైన షార్ట్ ఫిలిం చూస్తే సరిపోతుంది.
తెర ముందు..వెనక..
తారాగణం: జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్ సన్నీ తదితరులు.
బ్యానర్ : రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్
ఎడిటర్ : కార్తిక్ కట్స్,
పాటలు: పవన్ రాచేపల్లి,
ఆర్ట్ డైరెక్టర్ : కరీష్ కుమార్,
లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి,
సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్,
సంగీతం : యశ్వంత్ నాగ్,
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల,
నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్,
రన్ టైమ్:2 గంటల 5 నిముషాలు
కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.
విడుదల తేదీ : 29 జనవరి, 2021