Reading Time: 3 mins

మిస్టర్ కింగ్ మూవీ రివ్యూ

Mr.King: `మిస్టర్ కింగ్`  రివ్యూ

Emotional Engagement Emoji


విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వస్తున్నాడంటే అభిమానుల్లో ఎక్స్ పెక్టేషన్స్ భారీగా లేకపోయినా మినిమం  ఉంటాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లని చూశాక అవి రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలో థియేటర్ కు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..కథేంటి..సినిమా చూడదగ్గ సినిమాయేనా అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథాంశం:

శివ (శరణ్‌ కుమార్‌) తెలివైన వాడు… నిబద్దత కలిగిన వ్యక్తి. అతనికి  కేవలం జీతం కోసం పని చేయడం అతనకి ఇష్టం వుండదు. దాంతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్  అయిన శివ.. ఆర్జేగా పనిచేస్తుంటాడు.  అతను ప్రాజెక్ట్ వాయు పేరుతో ఫ్యూయల్ లేకుండా విమానాన్ని నడిపేలా సరికొత్త టెక్నాలజీని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు.  ఇక మరో ప్రక్క సీతారామరాజు (మురళి శర్మ) దుర్మార్గుడు కాదు కానీ అలాంటి అలోచనలు అవసరం వస్తే చేయగల మనిషి.  ఇక సీతారామారాజు కూతురు ఉమాదేవి (యశ్విక) పూర్తిగా తండ్రిచాటు బిడ్డ. ఆ సీతారామరాజు అన్న కూతురు వెన్నెల (ఊర్వీ సింగ్). అయితే అనుకోని విధంగా ఉమాదేవి, వెన్నెల ఇద్దరూ శివని ఇష్టపడతారు. శివ మాత్రం ఉమాదేవిని ప్రేమిస్తాడు. కూతురు ప్రేమ విషయం తెలుసుకున్న సీతారామరాజు  ఎలా రియాక్ట్ అయ్యాడు. అనుకోకుండా తన లైఫ్ లోకి వచ్చిన ఇద్దరమ్మాయిలుని ఎలా డీల్ చేసాడు… ఎవరిని పెళ్లి చేసుకున్నాడు…తాను అనుకున్నది సాధించాడా? శివకి ఎలాంటి స్ట్రగుల్స్ ఎదరయ్యాయన్నదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే:

మల్టిఫుల్ లేయర్స్ ఉన్న కథలను డీల్ చేయటం చాలా కష్టం.  ఆకాశమే హద్దురా వంటి సూపర్ హిట్ లైన్ ఉన్న ఈ సినిమా ఆ స్దాయిలో వెళ్లదు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా టర్న్ తీసుకుని  పక్కిదారి పడుతుంది. ముఖ్యంగా చెస్ ఆట, కూతురు అంటే కొండంత ప్రేమ ఉన్న సీతారామారాజు మురళీశర్మ క్యారెక్టర్‌‌ను పరిచయం చేయడం ద్వారా ఇంట్రస్టింగ్ గా  కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథలోని ఎమోషన్స్, పాత్రల మధ్య కాంప్లిక్ట్  అంతా బాగానే ఉంది. అయితే అనేక రకాల అంశాలను కథలోకి తీసుకు రావడం వల్ల కథ ఏ అంశంపై వెళ్తుందనే విషయంపై కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. హీరో ప్రేమ, రిసెర్చ్ ప్రాజెక్టు, ఫ్యామిలీ అంశాలు ఒకే థ్రెడ్ మీదకు  తెచ్చి ప్రేక్షకుడికి చక్కగా చెప్పడంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడనే చెప్పాలి. దాంతో  లెంగ్త్  కూడా పెరిగిపోయింది.  సెంకాడఫ్ సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బాంగ్ ముందు వచ్చే సీన్  వరకూ  హీరో పాత్ర గొప్పదనాన్ని మాటల్లో ఎలివేట్ చేసుకుంటూనే వెళ్ళాటమే ఇబ్బందిగా మారింది. ఉన్నంతలో వెన్నెల కిషోర్ పాత్ర కామెడీ  హిలేరియస్ కాదు కానీ బాగుంది. పెళ్లి చూపులకు అబ్బాయి, అమ్మాయి ఇంటికి ఎందుకు రావాలి ? అమ్మాయి, అబ్బాయి ఇంటికి వెళ్ళకూడదా? బతకడానికి 35 వేల జీతం సరిపోదా ? రెండు లక్షల జీతం కావాలా? ప్రేమ కోసం ఎప్పుడూ అబ్బాయిలే పోరాటం చేయాలా ? అమ్మాయిలు చేయకూడదా? ….వంటి ఆసక్తికరమైన విషయాలు డీల్ చేసాడు కానీ కలిసి రాలేదు. ఎక్కువ విషయాలు ఒకే కథలో చెప్పాలనే ఆలోచనే దెబ్బ కొట్టింది.

టెక్నకల్ గా..

కథ, స్క్రీన్ ప్లే విషయంలోనే ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.  మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే బాగుంది. రెండు పాటలు బాగున్నాయి.  ఎడిటింగ్ ఇంకాస్త షార్ఫ్ గా వుండాల్సింది, కెమారపనితనం బావుంది. ప్రతి ఫ్రేం రిచ్ గా చూపించారు. కొత్త బ్యానర్ నిర్మాణ విలువలు బావున్నాయి. డైలాగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నటీనటుల్లో …

హీరో  శరణ్ కుమార్ జస్ట్ ఓకే అనిపించాడు. హీరోయిన్స్ లో ఊర్వీ సింగ్  అందంగా వుంది. మురళిశర్మ మెయిన్ రోల్.  సాప్ట్ వేర్ ఇంజినీర్ వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది. సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన ఉన్న సీన్స్ ఎంగేజ్ చేస్తూ వెళ్లాడు.   హీరో ప్రెండ్ గా చేసిన నటుడు రోషన్ …స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది.   కథపై ఆసక్తిని కలిగించే పాత్రే.    SS కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు వంటి  మిగతా పాత్రధారులు పరిధిమేర చేశారు

బాగున్నవి?
ప్రొడక్షన్ వాల్యూస్
సినిమాటోగ్రఫీ
కొన్ని కామెడీ సీన్స్
ఇంట్రవెల్ ట్విస్ట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

బాగోనివి?
హీరో ఫెరఫార్మెన్స్
సబ్ ప్లాట్స్ సరిగ్గా లేకపోవటం
ఎమోషన్ కంటెంట్ పండకపోవటం
కాంప్లిక్స్ వీక్ గా ఉండటం

చూడచ్చా
మరీ తీసిపాడేసే సినిమా కాదు. అలాగని పరుగెత్తుకెళ్లే సినిమా కాదు. కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి.

బ్యానర్ : హన్విక క్రియేషన్స్,
న‌టీన‌టులుః శరణ్ కుమార్, నిష్కల, ఊర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్, SS కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు
సంగీత దర్శకుడు: మణిశర్మ,
సినిమాటోగ్రాఫర్: తన్వీర్ అంజుమ్,
సాహిత్యం: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, కడలి,
సహ నిర్మాత: రవికిరణ్ చావలి,
కొరియోగ్రాఫర్: భూపతి రాజా,
పబ్లిసిటీ డిజైనర్: శివం సి కబిలన్,
కాస్ట్యూమ్ డిజైనర్: కావ్య కాంతామణి & రాజశ్రీ రామినేని
ప్రెజెంట్స్: బేబీ హన్విక ప్రెజెంట్స్,
అడిషనల్ డైలాగులు:హరికృష్ణ
Runtieme:2 hrs, 25 mins
నిర్మాత: బి.ఎన్.రావు,
రచన& దర్శకత్వం, ఎడిటింగ్ : శశిధర్ చావలి,
విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2023