Mr. Bachchan Movie Review – TEL
మిస్టర్ బచ్చన్ మూవీరివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ గల ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్. మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్స్ చేసి ఎన్నో వందల కోట్ల నల్లధనాన్ని వెలికి తీస్తాడు. అలాంటి మిస్టర్ బచ్చన్ను ఓ రైడ్ వల్ల విధుల నుంచి తొలగిస్తారు. ఆ తరువాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరికి వెళ్లి ఆర్కెస్టాను రన్ చేస్తుంటాడు. ఊర్లో జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరో వైపు ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) అరాచకాలు మితి మీరి పోతుంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని, ఎదురు తిరిగిన వారిని హత మార్చుతుంటాడు. అలాంటి ముత్యం జగ్గయ్య మీదకు మిస్టర్ బచ్చన్ లాంటి వాడ్ని ఐటీ రైడ్స్కు పంపిస్తారు. ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు? ముత్యం జగ్గయ్య ఇంట్లోని నల్లధనాన్ని మిస్టర్ బచ్చన్ పట్టుకుంటాడా? మిస్టర్ బచ్చన్ను ఎదుర్కొనేందుకు ముత్యం జగ్గయ్య ఏం చేస్తాడు? ఈ కథలో జిక్కీ పాత్ర ఏంటి? అసలు చివరకు ఏం జరిగింది? అనేది స్టోరీ
ఎనాలిసిస్:
సస్పెండ్ అయినా ఐటీ ఆఫీసర్ ని.. మళ్ళీ కావాలని విధుల్లోకి తీసుకొంటే అతను ఏమి చేసాడు..
ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్ :
రవితేజ నటన బాగుంది. భాగ్య శ్రీ చాలా అందంగా ఉంది . తణికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. జగపతి బాబు విలనిజం రొటీన్‌లా అనిపిస్తుంది. సత్య కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ ఓకే అనిపిస్తుంది.
టెక్నికల్ గా:
హరీష్ శంకర్ తన టెక్నికల్ టీంను బాగా వాడుకున్నాడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ పర్వాలేదు. ఆయనంక బోస్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ అద్భతుంగా ఉన్నాయి . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చూడొచ్చా:
చూడలేము
ప్లస్ పాయింట్స్:
రవితేజ
భాగ్యశ్రీ
సత్య కామెడీ
మైనస్ పాయింట్స్:
అవుట్ డేటెడ్ సీన్స్
తీర్పు:
బోర్ బచ్చన్
నటినటులు:
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సత్య, సత్యం రాజేష్ తదితరులు
సాంకేతిక వర్గం:
సినిమా టైటిల్: మిస్టర్ బచ్చన్
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ :14-08-24
సెన్సార్ రేటింగ్: U /A
దర్శకత్వం:హరీశ్ శంకర్
నిర్మాత:టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్
సంగీతం:మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ:అయానక బోసే
ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
రన్ టైం : 2 hr 35 min
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్