మిస్టర్ బచ్చన్ మూవీ లక్నో షెడ్యూల్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ లక్నో లో ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ లక్నో లో ప్రారంభమైయింది. ఈ కీలక షెడ్యూల్ లో చిత్ర యూనిట్ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించనుంది. ఈ యాక్షన్ బ్లాక్స్ సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నాయి.
రవితేజ, హరీష్ శంకర్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ‘నామ్ తో సునా హోగా’ ట్యాగ్‌లైన్ రూపొందుతున్న ‘మిస్టర్ బచ్చన్’ లో రవితేజను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు హరీష్ శంకర్.
ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.
ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్