Reading Time: 3 mins

మీటర్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

చిరంజీవి, బాలయ్య వంటి స్టార్స్ తో ఒకే సారి సినిమా తీసి హిట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందరి దృష్టీ పడుతుంది.అలాంటి పెద్ద సంస్థలో కిరణ్అబ్బ‌వ‌రం లాంటి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న హీరో తో సినిమా చేసిందంటే ఖచ్చితంగా అందులో మేటర్ ఉందని భావిస్తాము. కథ ఖచ్చితంగా కిరణ్ కు సరపడది ఉండి ఉంటుంది అందుకే చేసారని ఓ డెసిషన్ కు వచ్చేస్తాము. నిజంగానే సినిమా బ్యానర్ స్టాండర్డ్స్ కు తగ్గ స్దాయిలో ఉందాఅసలు కథేంటిటైటిల్ కు లింకేంటికిరణ్ అబ్బవరంకు ఈ బ్యానర్ వరం అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ :

కానిస్టేబుల్ కొడుకైన అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం)కు పోలీస్ ఉద్యోగమంటే గిట్టదు. కానీ ఆ తండ్రి తన కొడుకు మంచి పోలీసాఫీసర్ కావాలని కోరుకుంటాడు. అయితే పోలీస్ గా తండ్రి పడ్డ కష్టాలు చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాకీ తొడగకూడదని గట్టిగా అర్జున్ బాబు డిసైడ్ అవుతాడు. కానీ అతను అనుకోకుండా ఎస్ఐ జాబ్‌కు సెలెక్ట్ అయి ఉద్యోగంలో చేరుతాడు. అయితే అప్పుడు ఎప్పుడెప్పుడు జాబ్‌ మానేయాలా? అని ఎదురుచూస్తూంటాడు. కానీ ఊహించని విధంగా అర్జున్‌కు మంచి పోలీస్ గా గుర్తింపు వస్తుంది.కానీ ఎలాగైనా ఆ ఉద్యోగం పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తున్న అర్జున్ హోం మినిస్టర్ బైరెడ్డి (ధనుశ్ పవన్)సాయంతో ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతాడు. కానీ హోం మినిస్టర్ కు ఫేవర్ చేసే క్రమంలో తన తండ్రినే కాల్చడం అతను కోమాలోకి వెళ్లడం ఒక వ్యక్తి చావుకు కారణమవడంతో అర్జున్ లో మార్పు వస్తుంది. మళ్లీ పోలీస్ అయి సిన్సియర్ గా డ్యూటీ చేయడం మొదలుపెట్టి హోం మినిస్టర్ ని ఢీకొడతాడు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు, అదే సమయంలో అబ్బాయిలంటేనే ఇష్టం లేని అతుల్య రవితో అతడికి పరిచయం ఏర్పడుతుంది. అబ్బాయిలంటేనే గిట్టని అమ్మాయిని మన హీరో ఎలా పడగొట్టాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే :

బ్యానర్ పై నమ్మకమో లేక యంగ్ హీరో కదా అనే ఉత్సాహంతోనో థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటేఆ ఉత్సాహం ఎగిరిపోయి నీరసం ఆవహించటానికి ఎంతో సమయం పట్టదు. అందుకు కారణం ఇప్పటి కాలంలో తీయాల్సిన కథ కాదు. అలాగని కొన్ని దశాబ్దాల ముందు చూసినా కూడా ఔట్ డేటెడ్ అనిపించే సినిమా ఇది. ఒక మామూలు పోలీస్ పెద్ద రాజకీయ నాయకుడుని ఢీకొట్టి అతణ్ని ఆటాడించే కమర్షియల్ ఫార్మాట్లో ఇప్పటి కాలంలో వర్కవుట్ అవుతుందని టీమ్, నిర్మాతలు ఎలా నమ్మారో అర్థం కాదు. పోనీ స్క్రీన్ ప్లే అయినా ఏమన్నా మ్యాజిక్ ఉందా అంటే అదీ లేదు. కథ, స్క్రీన్ ప్లేలో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. హీరోకు, విలన్‌కు మధ్య సీన్స్ పరమరొటీన్ గా ఉంటాయి. డైరక్టర్ కు ఒకటే టార్కెట్ .కిరణ్‌ అబ్బవరాన్ని మాస్‌గా చూపించే ప్రయత్నం చేయటం. ఉన్నంతలో తండ్రి, కుమారుల మధ్య ఎమోషనల్ ఎలిమెంట్స్‌ ఓకే అనిపించే ఉన్నాయి. క్లైమాక్స్‌ కూడా సోసోగా ఉంది. అంతగా కనెక్ట్ కాలేదు. చాలా సీన్స్ సినిమాటిక్ లిబర్టీ విపరీతంగా తీసుకుని చేసినట్లుగా లాజిక్ లెస్‌గా అనిపిస్తాయి. కిరణ్ అబ్బవరం డైలాగ్ డెలివరీతో ఓకే అనిపించాడు. కామెడీ సీన్స్ పరంగా ఫరవాలేదు. ఏదైనా పక్కా కమర్షియల్ మూవీ చేయాలన్న తాపత్రయంలో కంగాళీ సినిమా చేసిపెట్టాడు.

నటీనటులు :

కిరణ్ అబ్బవరం కమర్షియల్ సినిమా మోజులో పరమ రొటీన్ సినిమాలు చేస్తున్నారు. సెబాస్టియన్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని తాజాగా మీటర్ దారుణంగా ఉన్నాయి. పెద్ద బ్యానర్స్ వెనక ఉన్నా కూడా ఏమీ చేయలేని సిట్యువేషన్. యాక్టింగ్ పరంగా చూసినా . ఒకే రకం నటనతో హావభావాలతో విసిగిస్తన్నాడనిపిస్తుంది. హీరోయిన్ అతుల్య లోనూ విషయం లేదు. విలన్ పాత్రధారికు నటన లేదుహావభావాలు అంతకన్నా లేవు. చివరకు సప్తగరి నుంచి కూడా ఏమీ ఆశించలేం. పోసాని వంటి ఆర్టిస్ట్ లు ఉన్నా ఉపయోగం లేదు.

టెక్నికల్ గా:

సినిమాకు అవసరమైన ముడిసరకు స్క్రిప్టే చాలా విసుగ్గా బోరింగ్ గా ఉంది. సాయికార్తీక్ మ్యూజిక్ డైరక్టర్ గా ఒక్కటీ వినసొంపైన పాటలేదు. నేపథ్య సంగీతం దాదాపు అంతే. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణంలోనూ అంతంత మాత్రంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ స్థాయికి ఏమాత్రం తగని విధంగా ఉన్నాయి నిర్మాణ విలువలు. సూర్య రచన కానీ రమేష్ కడూరి దర్శకత్వం కానీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు.

చూడచ్చా :

బోర్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న ఈ సినిమా చూడాలనుకోవటం సాహసమే చెప్పాలి

నటీనటులు :

కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, ధనుష్ పవన్

సాంకేతికవర్గం :

నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు :చిరంజీవి ( చెర్రీ), హేమలత పెదమల్లు
దర్శకుడు : రమేష్ కడూరి
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్
రన్ టైమ్ : 120 మినిట్స్
విడుదల తేది: ఏప్రిల్ 07, 2023