మూతోన్ తెలుగులో విడుదల
మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘మూతోన్’ను తెలుగులో విడుదల చేస్తున్న ‘ఆహా’..అక్టోబర్ 16న విడుదల
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో అక్టోబర్‌లో విడుదలైన చిత్రం ‘ఒరేయ్‌బుజ్జిగా’. ఈ సినిమాకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘ఆహా’ ద్వారా మలయాళంలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘మూతోన్’ను తెలుగులో విడుదల కానుంది. టోరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న తెలుగులో విడుదల చేస్తున్నారు. గీతు మోహన్‌దాస్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి… డైరెక్టర్ గీత మోహన్‌దాస్ తన భర్త, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవితో కలిసి వర్క్ చేయడం విశేషం. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ అవార్డ్ విన్నింగ్ మూవీలో నవీన్ పౌలీ హీరోగా నటించారు. అన్నను వెతుకుతూ ముంబై వెళ్లే తమ్ముడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఏం చేశాడనే కథాంశంతో సినిమా తెరకెక్కింది.
అతి తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ వారి హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న ‘ఆహా’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే తారలందరి సినిమాలకు సంబంధించిన క్లాసిక్ మూవీస్‌తో పాటు లేటెస్ట్ రిలీజ్‌లతో ఆకట్టుకుంటోంది.
నటీనటులు:
నవీన్ పౌలీ, శశాంక్ అరోరా, సంజనా దీపు, రోషన్ మాథ్యు, శోభితా ధూళిపాళ, మెలిస్సా రాజు థామస్,
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: గీతూ మోహన్‌దాస్, సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, మ్యూజిక్: సాగర్ దేశాయ్, స్క్రీన్ ప్లే: గీతూ మోహన్‌దాస్, అనురాగ్‌కశ్యప్,శ్రీజా శ్రీధరన్, నిర్మాత: అనురాగ్ కశ్యప్, ఎడిటర్: బి.అజిత్ కుమార్.