మెగాస్టార్ చిరంజీవి156 మూవీ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి156 పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ Mega156 త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ నిర్మాణంతో బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మాగ్నమ్ ఓపస్ మొత్తం యూనిట్, కొంతమంది అతిథులు సమక్షంలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది.
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కలిసి ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేయగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కె రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివి వినాయక్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
పాత సంప్రదాయాన్ని తిరిగి తీసుకువస్తూ లాంచ్‌కు ముందు మేకర్స్ సినిమా మ్యూజిక్ రికార్డింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఇది చిరంజీవి గారి 156వ చిత్రం. యూవీ క్రియేషన్స్ 14వ ప్రొడక్షన్. సినిమాలో 6 పాటలు ఉంటాయి. సంగీత రికార్డింగ్‌తో పూజా కార్యక్రమాలను ప్రారంభించడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని తిరిగి తీసుకువస్తూ, మ్యూజిక్ రికార్డింగ్‌తో ప్రొసీడింగ్‌లను ప్రారంభించాలనుకుంటున్నాము. సెలబ్రేషన్స్ సాంగ్ రికార్డింగ్‌తో పనులు ప్రారంభమయ్యాయి. సినిమాను తన భుజస్కంధాలపై మోస్తున్న వశిష్టకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇలాంటి అరుదైన, అసాధారణమైన సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. కీరవాణి గారికి, దర్శకుడు వశిష్టకు, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతమైన పాటలతో మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నాం అన్నారు.
విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని అత్యంత బడ్జెట్‌తో నిర్మించనున్నారు, ఇది ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవికి హై బడ్జెట్ మూవీ. ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్లుగా పనిచేస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ గీత రచయితలు కాగా, శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా పని చేస్తున్నారు.
తారాగణం :
మెగాస్టార్ చిరంజీవి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ : ఛోటా కె నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి