మెరిసే మెరిసే చిత్రం ట్రైలర్ విడుదల

Published On: July 30, 2021   |   Posted By:
మెరిసే మెరిసే చిత్రం ట్రైలర్ విడుదల
 
 
‘మెరిసే మెరిసే’ ట్రైలర్ విడుదల చేసిన ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్, ఆగస్టు 6న మూవీ రిలీజ్
 
 
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’.  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందన్న విశ్వక్ సేన్ ‘మెరిసే మెరిసే’ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.
 
 
ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ*….దినేష్ తేజ్ నేనూ ‘హుషారు’ సినిమా టైమ్ నుంచి ఫ్రెండ్స్. కలిసి క్రికెట్ బాగా ఆడేవాళ్లం. తను మంచి పర్మార్మర్. టాలెటెండ్ ఆర్టిస్ట్. ‘మెరిసే మెరిసే’ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. చివరలో దినేష్ చెప్పిన డైలాగ్ సూపర్. థియేటర్లు ఓపెన్ అవడం సంతోషకరం. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్ లో సినిమా చూసిన అనుభూతి వేరు. ఆగస్టు 6న ‘మెరిసే మెరిసే’ థియేటర్ లలో రిలీజ్ అవుతోంది. తప్పక చూడండి. అన్నారు.
 
 
దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ*…మా సినిమా ట్రైలర్ ను విశ్వక్ సేన్ గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఆయనది సక్సెస్ ఫుల్ హ్యాండ్. ఆ లక్ మా సినిమాకూ కలిసొస్తుందని ఆశిస్తున్నాం. ఆగస్టు 6 మా సినిమాను పీవీఆర్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా మీ ముందుకొస్తున్న ‘మెరిసే మెరిసే’ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
 
హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ*…మా సినిమా ‘మెరిసే మెరిసే’ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు నా ఫ్రెండ్ విశ్వక్ సేన్ కు థాంక్స్. ఆగస్టు 6న థియేటర్ లలో కలుసుకుందాం. అన్నారు.
 
 
నటీనటులు: దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు
 
సాంకేతిక నిపుణులు: 
బ్యానర్: కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్మాత: వెంకటేష్ కొత్తూరి.ర‌చ‌న‌, దర్శకత్వం: పవన్ కుమార్. కె, సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్, సంగీతం: కార్తిక్ కొడగండ్ల, ఎడిట‌ర్‌:  మ‌హేశ్‌