మేకప్ మ్యాన్ మూవీ ప్రారంభం
అభిరామ్ మూవీస్ బ్యానర్ పై సీనియర్ మేకప్ మ్యాన్ కుమార్ మెట్టుపల్లి నిర్మాతగా, దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాకప్ మ్యాన్. దివంగత ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు శ్రీకాంత్ అవుటూరి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. పోలూరు ఘటిక చలం డైలాగ్స్, ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు.
శనివారం ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రవి కుమార్ చౌదరి, నిర్మాతలు లయన్ సాయి వెంకట్, భరత్ పారేపల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దర్శకుడు రవి కుమార్ చౌదరి క్లాప్ కొట్టారు. లయన్ సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, భరత్ పారేపల్లి తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో… అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకులు రవి కుమార్ చౌదరి మాట్లాడుతూ..నేను దర్శకుడిగా పరిచయం అయినప్పుడు మా గురువు సాగర్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు కూడా నేను అంతే ఆనందం గా ఉన్నాను. నా దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన దివాకర్ మంచి స్టోరీ టెల్లర్. చాలా ప్యాషన్ తో పని చేస్తాడు. ఈ కథను చాలా అద్భుతంగా రాశాడు. తనతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా అని అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ..ప్రతి చిత్రానికి మేకప్ మ్యాన్ పాత్ర చాలా కీలకం గా ఉంటుంది. అలాంటి మేకప్ మ్యాన్ ప్రాముఖ్యతను ఈ చిత్రంలో చూపించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అని అన్నారు.
భరత్ పారేపల్లి మాట్లాడుతూ..దర్శకుడు దివాకర్ మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంచి విజయం సాధించి దర్శకుడుగా మరిన్ని చిత్రాలు తెరకెక్కించాలని కోరుతున్నా అని అన్నారు.
చిత్ర హీరో శ్రీకాంత్ కవుటూరి మాట్లాడుతూ.. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పట్నుంచీ మామయ్యను చూసి పెరగడం తో సినిమాలపై ఆసక్తి కలిగింది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో హీరోగా పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
చిత్ర దర్శకుడు దివాకర్ యడ్ల మాట్లాడుతూ..చిత్ర పరిశ్రమలో మేకప్ మ్యాన్ ప్రాముఖ్యత చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి మేకప్ మ్యాన్ ల జీవితాలను ఇందులో చూపిస్తాము. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించబోతున్నాం. త్వరలో షూటింగ్ మొదలు పెడుతున్నాం అని చెప్పారు.
చిత్ర నిర్మాత కుమార్ మెట్టుపల్లి మాట్లాడుతూ..సినిమా నిర్మించాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నా. ఇన్నాళ్లకు మంచి కథతో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం హ్యాపీ గా ఉంది అని చెప్పారు.
సీనియర్ రచయిత ఘటిక చలం, నటులు కట్టా రంజిత్ ఆనంద్ భారతి చిట్టిబాబు, రచయిత నాగరాజు చిత్ర యూనిట్ కు తమ అభినందనలు తెలియజేశారు.
తారాగణం :
శ్రీకాంత్ కవుటూరి, కట్టా రంజిత్, ఆనంద్ భారతి, చిట్టిబాబు తదితరులు..
సాంకేతిక వర్గం :
బ్యానర్ : అభిరామ్ మూవీస్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ : దివాకర్ యడ్ల
నిర్మాత : కుమార్ మెట్టుపల్లి
డిఓపి, ఎడిటర్ : వాసు వర్మ
సంగీతం : ఎం ఎం శ్రీలేఖ